Today Horoscope : ఫిబ్రవరి 8th సోమవారం మీ రాశి ఫలాలు

మేషరాశి : ఆఫీస్లో సహచరుల నుంచి ప్రోత్సాహం !

ఈరోజు పనుల్లో అవరోధాలు. ఆఫీస్లో సహచరుల నుంచి ప్రోత్సాహం ఉటుంది. వ్యాపార ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. ఇంటాబయటా ఒత్తిడులు. శ్రమాధిక్యం. విద్యార్థులకు కొన్ని అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగాలలో నిరుత్సాహం. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆనందంగా ఉండటానికి శ్రీరామ తారకాన్ని జపించండి.

వృషభరాశి: ఉత్సాహంగా గడుపుతారు !

ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి. కుటుంబ వ్యాపారంలో తోబుట్టువుల నుంచి సహాయం అందుకుంటారు. శుభకార్యాలలో పాల్గొంటారు. నూతన విషయాలపై పనిచేస్తారు. తీరిక లేకుండా పనిచేస్తూ కుటుంబ అవసరాలను కూడా తీరుస్తారు. మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఉద్యోగాలలో నూతనోత్సాహం. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. శ్రీశివాభి షేకం చేసుకోండి.

మిథునరాశి: ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం !

ఈరోజు పనిప్రదేశంలో సమస్యలను పరిష్కరించుకుంటారు. శ్రమ ఫలిస్తుంది. ఉద్యోగ యత్నాలు సానుకూలం. ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలకు ఖర్చు చేయడం వల్ల మీ ప్రతిష్ట పెరుగుతుంది. కుటుంబ ఆస్తిని అభివృద్ధి చేసుకుంటారు. పనులు చకచకా సాగుతాయి. మీ పురోగతి పెంచుకోవడానికి మంచి పనులు చేయాలి. ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుంది. మంచి ఫలితాల కోసం శ్రీలక్ష్మీదేవి ఆరాధన చేయండి.

కర్కాటకరాశి: ఆగిపోయిన పనులను పూర్తిచేసుకుంటారు !

ఈరోజు రుణాలు చేస్తారు. ఈరోజు తోబుట్టువుల ఆందోళనలు అంతం చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువులతో వివాదాలు. ఆరోగ్యభంగం. మీ పనిపై దృష్టి పెట్టండి. చాలాకాలంగా ఆగిపోయిన పనులు పూర్తిచేసుకుంటారు. కుటుంబంతో బయటకు వెళ్లడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు. శుభఫలితాల కోసం శ్రీశివ పంచాక్షరీ జపించండి చేయండి.

Today February 8Th 2021 Daily Horoscope In Telugu
today february 8th 2021 daily horoscope in telugu

సింహరాశి: కుటుంబంలో ఒత్తిడులు !

ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలుంటాయి. నూతన పని ప్రారంభించానలుకుంటే అనుకూలంగా ఉంటుంది. బంధువులతో మాటపట్టింపులు. విద్యార్థులు ఎదుర్కుంటోన్న ఆర్థిక సమస్యలు అంతమవుతాయి. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారంలో అవరోధాలు మిమ్మల్ని బాధపెడతాయి. ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. అనవసరమైన ఖర్చులను నివారిం చండి. అతిథి రాకతో మనస్సు ఆనందంగా ఉంటుంది. శ్రీశివారాధన చేయండి.

కన్యరాశి: పెట్టుబడులు ద్వారా లాభాలు !

ఈరోజు పరిస్థితులు అనుకూలిస్తాయి.పనిప్రదేశంలో సానుకూల మార్పులు. నూతన అవకాశాలు సిద్ధిస్తాయి. సంఘంలో ఆదరణ పెరుగుతుంది. తండ్రికి మద్దతుగా ఉంటారు. ఉద్యోగలాభం. తల్లి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. భాగస్వామ్య వ్యాపారంలో నూతన పెట్టుబడులు ద్వారా లాభాలు అందుకుంటారు. భూమి, వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు. పోటీ పరీక్షలో మంచి మార్కుల కోసం విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. అనుకూలమైన ఫలితాల కోసం శ్రీశివకవచం పారాయణం చేయండి.

తులరాశి: ఉద్యోగయత్నాలు నిదానిస్తాయి !

ఈరోజు ఆర్థిక ఇబ్బందులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో నిమగ్నమైన ఉంటారు. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఈరోజు ఉద్యోగయత్నాలు నిదానిస్తాయి. అత్తగారి వైప నుంచి కొంచెం ఇబ్బంది ఉండవచ్చు. శ్రీకృష్ణ ఆరాధన చేయండి.

వృశ్చికరాశి: వివాదాలు సమసిపోతాయి !

ఈరోజు పాతబాకీలు వసూలవుతాయి. పనుల్లో కొన్ని అంతరాయాలు ఉండవచ్చు. ప్రముఖుల నుంచి సహాయం. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలు ఉత్సహకరంగా ఉంటాయి. అధికారి నుంచి మద్దతు లభిస్తుంది. పాత తగాదాలు, వివాదాలు సమసిపోతాయి. ఈరోజు అనుకూలంగా ఉంటుంది. శ్రీశివాభిషేకం చేసుకోండి.

ధనస్సురాశి: వేడుకల్లో పాల్గొంటారు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. కొన్ని పనులు వాయిదా వేస్తారు. నూతన పథకాలపై పనిచేయడానికి అవకాశం లభిస్తుంది. కుటుంబ అవసరాలకు అనవసర ఖర్చు చేసే అవకాశముంది. నూతన పరిచయాల నుంచి ప్రయోజనం పొందుతారు. కష్టపడ్డా ఫలితం కనిపించదు. ఆఫీస్‌లో సాధారణంగా ఉంటుంది. బంధువులతో శుభకరమైన వేడుకల్లో పాల్గొంటారు. శ్రీలక్ష్మీగణపతి ఆరాధన చేయండి.

మకరరాశి: ఈరోజు శుభవార్త అందుకుంటారు !

ఈరోజు పరిచయాలు పెరుగుతాయి. వ్యాపార విషయంలో అంతరాయలు తొలగించుకుంటారు. ఆర్థిక ప్రగతి ఉంటుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. శత్రువుల నుంచి స్వేచ్ఛ పొందుతారు. ఆహ్వానాలు అందుతాయి. ఈరోజు మీ గౌరవం పెరుగుతుంది. ఉద్యోగాలలో అనుకూలత. ఈరోజు శుభవార్త అందుకుంటారు. అనుకూలమైన ఫలితాల కోసం శ్రీశివపంచాక్షరీ జపించండి.

కుంభరాశి: భార్య మద్దతు లభిస్తుంది !

ఈరోజు కొత్త మిత్రుల పరిచయం. భార్య నుంచి మద్దతు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. అనవసర వివాదాలకు దూరంగా ఉండండి. వస్తు,వస్త్రలాభాలు. సమయాన్ని సరిగ్గా ఉపయోగించడం వల్ల ప్రయోజనం చేకూరుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి. పెట్టుబడుల్లో ప్రయోజనం పొందుతారు. విద్యార్థులకు విజయావకాశాలు ఉన్నాయి. వైవాహికంగా సంతోషకరంగా ఉంటుంది. శివాభిషేకం చేసుకోండి.

మీనరాశి: ఈరోజు పనులు మందగిస్తాయి !

ఈరోజు మీకు మధ్యస్తంగా ఉంటుంది. కుటుంబంలో చికాకులు. పనిప్రదేశంలో వ్యవహారాలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. ధనవ్యయం. కుటుంబ వాతావరణం ఒత్తిడిని కలిగిస్తుంది. ప్రయత్నాలు విజయవంతమవుతాయి. కొన్ని పనులు మందగిస్తాయి. వివాదస్పదాంశాలు ముగుస్తాయి. ఆర్థిక పరిస్థితిపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. బంధువులతో మాటపట్టింపులు. శుభఫలితాల కోసం అమ్మవారి ఆరాధన చేయండి.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles