HomeHoroscopeToday Horoscope : ఫిబ్రవరి 2nd మంగళవారం మీ రాశి ఫ‌లాలు

Today Horoscope : ఫిబ్రవరి 2nd మంగళవారం మీ రాశి ఫ‌లాలు

మేష రాశి : సమస్యలని పరిష్కరించుకుంటారు !

ఈరోజు సామాజిక పనులలో బిజీగా గడిపేస్తారు. పరిచయాలు పెరుగుతాయి. ఇతరులకు మీరు సాయం చేస్తారు. ఈరోజు కష్టమైన సమస్యలని పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఇతరులకు దూరంగా ఉండడం మంచిది. ఈరోజు సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. వినాయకుడి నైవేద్యంగా సమర్పించిన ప్రసాదాన్ని ఆర్ధికంగా కోల్పోయిన ప్రజలకు ఇవ్వండి.

వృషభ రాశి: ఈరోజు చికాకులు తొలుగుతాయి !

ఈరోజు పరిస్థితులు అనుకూలిస్తాయి.కొత్త ప్రణాళికలను ప్రారంభిస్తారు. మీ సన్నిహితుల సలహాలు తీసుకుంటే ప్రయోజనాలుంటాయి. ఆర్థికాభివృద్ధి. ఈరోజు పోటీ పరీక్షల్లో నెగ్గే అవకాశం ఉంది. ఈరోజంతా ఆహ్లదకరంగా గడిచిపోతుంది. ఈరోజు ఉద్యోగాలలో చికాకులు తొలుగుతాయి. ఇంట్లో పసుపు రంగు పుష్పాలు కలిగిన మొక్కలు పెంచండి.

మిధున రాశి: ఈరోజు ఉన్నతాధికారులను మెప్పిస్తారు !

ఈరోజు ఇంటాబయటా ఒత్తిడులు. ఇంటి అవసరాల కోసం ఎక్కువ డబ్బుని ఖర్చు చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. పని చేసే చోట ఉన్నతాధికారులను మెప్పిస్తారు. ఈరోజు అవసరానికి మీకు డబ్బు అందుతూంది. శనగలు ఆవులకు ఇవ్వండి.

కర్కాటక రాశి: కుటుంబసభ్యులతో తగాదాలు !

ఈరోజు ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది.ఈరోజు అవకాశాలు లభిస్తాయి. కుటుంబసభ్యులతో తగాదాలు. ఈరోజు ఆరోగ్యం విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోండి. అనారోగ్య సూచనలు. సోదరభావం పెరుగుతుంది. ఈరోజు వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. లక్ష్మీ నారాయణ ఆరాధన చేయండి.

సింహ రాశి: ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి !

ఈరోజు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. శుభవార్తలు వింటారు. ఈరోజు అన్ని పనులు పూర్తి అవుతాయి. మీ తొందరపాటు వలన పొరపాట్లు జరిగే అవకాశం ఉంటుంది. ఈరోజు ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. చర్చల్లో మీదే పై చేయి అవుతుంది. అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఈరోజు చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఈశ్వర ఆరాధన చేయండి.

Today February 2Nd 2021 Daily Horoscope In Telugu
today february 2nd 2021 daily horoscope in telugu

కన్య రాశి: శ్రమ అధికంగా ఉంటుంది !

ఈరోజు పరిచయాలు పెరుగుతాయి. ఈరోజు శ్రమ అధికంగా ఉంటుంది. బాధ్యతలను మోయాల్సి ఉంటుంది. ఈరోజు వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. గతంలో పెండింగ్లో ఉన్న పనులను ఈరోజు మీరు మోయవల్సి వస్తుంది. ఈరోజు అన్ని పనులను అనుకున్నట్లు పూర్తి చేయగలుగుతారు. వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. ఆవులకు కందిపప్పు అందించండి.

తులా రాశి: బంధువులతో విభేదాలు !

ఈరోజు పనులు వాయిదా వేస్తారు. ఖర్చులని తగ్గించుకోవడం మంచిది. ఈరోజు రుణాలు చేస్తారు. ఈరోజు బంధువులతో విభేదాలు. ఈరోజు విద్యార్థులకు కలిసి వచ్చే రోజు. సన్నిహితుల నుంచి ధనలాభం. పేదలకు ఆహారపదార్తాలు, పండ్లు ఇవ్వండి.

వృశ్చిక రాశి: ఆలోచనలు స్థిరంగా ఉండవు !

ఈరోజు బంధు, మిత్రులతో విభేదాలు. ఈరోజు బిజీగా గడుస్తుంది. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఈరోజు మీ పాత స్నేహితులతో మాట్లాడతారు. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఈరోజు అప్పులు ఇచ్చేముందు ముందు ఆలోచించుకుని ఇవ్వండి. ఓం పద్మపుత్రాయ విదాయ అమృతేషాయ ధీమాహి తన్నో కేతువు ప్రచోదయాత్ వ్యాపార / పని సంబంధమైన మెరుగుదల కొరకు 11 సార్లు పఠించండి .

ధనుస్సు రాశి : ఈరోజు వివాదాలు పరిష్కారం !

ఈరోజు మెరుగ్గా ఉంటుంది. పనులను కొత్తగా చేయాలనీ ఆశిస్తారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. గతంలో కంటే మీరు మీ పనులను ఈరోజు మెరుగ్గా చేస్తారు. ఆస్తి వివాదాలు పరిష్కారం. ఈరోజు వాదనలు మానేసుకోండి. వృత్తి, వ్యాపారాలలో చిక్కులు అధిగమిస్తారు. శ్రీలక్ష్మీసూక్తం పారాయణం చేయండి.

మకర రాశి: ఆలయాలు సందర్శిస్తారు !

ఈరోజు రుణయత్నాలు సాగిస్తారు.కొత్త పనులను ప్రారంభించే ముందు ఉత్సాహంతో పని చేస్తారు.ఈరోజు ఆలయాలు సందర్శిస్తారు. అత్యుత్సాహంతో ఎలాంటి పనులను చేయకండి. ఈరోజు పని చేసే సమయంలో శ్రద్ధ వహించండి. విష్ణు మత్స్యవతార కథను చదవండి.

కుంభ రాశి: ఈరోజు మిత్రులను కలుసుకుంటారు !

ఈరోజు బిజీగా ఉంటారు. పలుకుబడి పెరుగుతుంది. ఈరోజు అవసరానికి మీకు డబ్బు అందుతుంది. శుభవార్తలు వింటారు. ఈరోజు ఉద్యోగ, వ్యాపారాలలో మీకు అనుభవం లభిస్తుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఈరోజు మీ కుటుంబంతో కలిసి గడుపుతారు. వాహనాలు కొంటారు. వృద్ధులకు సహాయం చేయండి.

మీన రాశి: ఈరోజు సంతోషంగా గడుస్తుంది !

ఈరోజు ఆర్థిక లావాదేవీలు అంతగా అనుకూలించవు.ఈరోజు సంతోషంగా గడుస్తుంది. ప్రత్యర్థి విమర్శలను పట్టించుకోకండి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఈరోజు కుటుంబసభ్యులతో తగాదాలు. అవసరం లేని ఖర్చుల్ని తగ్గించగలుగుతారు. కుజగ్రహారాధన చేయండి.

Related Posts

Gallery

Most Popular

Polls

Latest News