Today Horoscope : ఫిబ్రవరి 27th శనివారం మీ రాశి ఫలాలు

today february 27th 2021 daily horoscope in telugu

మేష రాశి: వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి !

శ్రమ పెరుగుతుంది. మీ సన్నిహితుల సలహాలు తీసుకుంటే ప్రయోజనాలుంటాయి. పోటీ పరీక్షల్లో నెగ్గే అవకాశం ఉంది. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఈరోజంతా ఆహ్లదకరం గా గడిచిపోతుంది. దుర్గా అష్టోత్తర పారాయణం చేసుకోండి.

వృషభ రాశి: సమస్యలను పరిష్కరించుకుంటారు !

ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.సామాజిక పనులలో బిజీగా గడిపేస్తారు. ఇతరులకు మీరు సాయం చేస్తారు. సమస్యలను పరిష్కరించుకుంటారు. వృత్తి,వ్యాపారాలలో ఉత్సాహం. వస్తులాభాలు. లక్ష్మీ స్తోత్ర పారాయణం చేసుకోండి.

మిధున రాశి: పెట్టుబడుల వల్ల నష్టాలు !

ఈరోజు ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ఉద్యోగమార్పులు. ఆరోగ్యభంగం. ఆరోగ్యం విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోండి. పెట్టుబడులు పెట్టడం వల్ల నష్టాలు. ప్రయాణాలకు అనుకూలమైన రోజు కాదు, వాయిదా వేసుకోవడం మంచిది. విష్ణుసహస్రనామ పారాయణం చేసుకోండి.

కర్కాటక రాశి: మిత్రులను కలుస్తారు !

ఈరోజు పనులలో అనుకూలత. చిన్ననాటి మిత్రులు కలుస్తారు. ఈరోజు ఎక్కువ డబ్బుని ఖర్చు చేస్తారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఈరోజు అవసరానికి మీకు డబ్బు అందుతూ ఉంటుంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. నారాయణ కవచం స్తోత్రం పారాయణం చేసుకోండి.

సింహ రాశి: దూరప్రయాణాలు !

ఈరోజు శ్రమ అధికంగా ఉంటుంది. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. బాధ్యతలను మోయాల్సి ఉంటుంది. వ్యాపారాలు మందగిస్తాయి. ఈరోజు అన్ని పనులను అనుకున్నట్లు పూర్తి చేయగలుగుతారు. దూరప్రయాణాలు. గోవింద నామలు పారాయణం చేసుకోండి.

కన్య రాశి: సన్నిహితులతో ఆనందం !

ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పనులు పూర్తి అవుతాయి. తొందరపాటు వల పొరపాట్లు జరిగే అవకాశం ఉంటుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. చర్చల్లో మీదే పై చేయి అవుతుంది. ఉద్యోగాలు అనుకూలిస్తాయి. శ్రీ రాజరాజేశ్వరి అష్టకం పారాయణం చేసుకోండి.

తులా రాశి: ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి !

ఈరోజు బిజీగా గడుస్తుంది. పరిచయాలు పెరుగుతాయి. విందువినోదాలు. మీ పాత స్నేహితులతోను, పరిచయస్తులతోను మాట్లాడతారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. దైవదర్శనాలు. అప్పులు ఇచ్చేముందు ఆలోచించుకుని ఇవ్వండి. ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. శివానందలహరి పారాయణం చేసుకోండి.

today february 27th 2021 daily horoscope in telugu
today february 27th 2021 daily horoscope in telugu

వృశ్చిక రాశి: కుటుంబ సభ్యులతో వివాదాలు !

ఈరోజు వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. ఖర్చులని తగ్గించుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు. వ్యాపారాలు మెరుగ్గా ఉంటాయి. విద్యార్థులకు ఈరోజు కలిసి వచ్చే రోజు. శివపంచాక్షరీ స్తోత్రం పారాయణం చేసుకోండి.

ధనుస్సు రాశి: రుణాలు చేస్తారు !

కొత్త పనులను ప్రారంభించే ముందు ఉత్సాహంతో పని చేస్తారు. రుణాలు చేస్తారు. బంధువులతో విభేదాలు. అత్యుత్సాహంతో ఎలాంటి పనులను చేయకండి. పని చేసే సమయంలో శ్రద్ధ వహించండి. శ్రీరామనామాన్ని 108 సార్లు జపించండి.

మకర రాశి: పలుకుబడి పెరుగుతుంది !

ఈరోజు మెరుగ్గా ఉంటుంది. విలువైన వస్తువులు సేకరిస్తారు. పనులను కొత్తగా చేయాలనీ ఆశిస్తారు. సంఘంలో గౌరవం. సంయమనంతో, అవగాహనాతో వ్యవహరించండి. పలుకుబడి పెరుగుతుంది. వాదనలు మానేసుకోండి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. శ్రీసూక్తపారాయణం చేయండి.

కుంభ రాశి: ఈరోజు సంతోషంగా ఉంటారు !

ఈరోజు సంతోషంగా గడుస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. అవసరం లేని ఖర్చుల్ని తగ్గించగలుగుతారు. శ్రీలక్ష్మీగణపతి ఆరాధన చేయండి.

మీన రాశి: వ్యాపారాలలో అనుభవం !

ఈరోజు బిజీగా ఉంటారు. కుటుంబంలో చికాకులు. ఈరోజు అవసరానికి మీకు డబ్బు అందుతుంది. ఇంటాబయటా ఒత్తిడులు. ఉద్యోగ, వ్యాపారాలలో మీకు అనుభవం లభిస్తుంది. కుటుంబంతో కలిసి గడుపుతారు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. శివుడికి పంచామృతాభిషేకం చేయండి.