HomeHoroscopeToday Horoscope : ఫిబ్రవరి 22nd సోమవారం మీ రాశి ఫలాలు

Today Horoscope : ఫిబ్రవరి 22nd సోమవారం మీ రాశి ఫలాలు

మేష రాశి : ఆలయాలు సందర్శిస్తారు !

విబేధాలను పరిష్కరించుకుంటారు. బంధువర్గంతో అనుకోని వివాదాలు. చేపట్టిన పనులను పూర్తి చేస్తారు. శ్రమాధిక్యం. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఆలయాలు సందర్శిస్తారు. దేవి ఖడ్గమాలా స్తోత్ర పారాయణం చేసుకోండి.

వృషభ రాశి: ధనలాభం !

వృత్తి వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. బంధువులతో సఖ్యత. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త పాటించండి. ఆప్తుల నుంచి ధనలాభం. వ్యవహారాలలో విజయం. క్రయవిక్రయాలలో లాభాలు. వ్యాపారాలలో ముందుకు సాగుతారు. శ్రీవిష్ణుసహస్రనామ పారాయణం చేసుకోండి.

మిధున రాశి: వ్యవహారాలలో విజయం !

చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. మిత్రులతో వివాదాలు. సన్నిహితులు ముఖ్యమైన సమాచారం అందిస్తారు. కుటుంబంలో చికాకులు. శ్రమ పెరుగుతుంది. కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు. హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి.

కర్కాటక రాశి: విద్యార్థులకు నూతనోత్సాహం !

విద్యార్థులకు నూతనోత్సాహం.ఆహ్వానాలు లభిస్తాయి. పనులు సకాలంలో పూర్తి అవుతాయి. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. సన్నిహితుల సాయం పొందుతారు. సోదరులతో సంతోషంగా ఉంటారు. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. రుద్ర కవచం పారాయణం చేసుకోండి.

సింహ రాశి: వ్యాపారాలలో పురోగతి !

ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కీలక నిర్ణయాలలో ఆచి తూచి వ్యవహరించండి. సన్నిహితుల సాయం పొందుతారు. రుణ బాధలు తీరతాయి. మిత్రులతో సంతోషంగా గడుపుతారు. వ్యాపారాలలో పురోగతి. ద్వాదశ జ్యోతిర్లింగ పారాయణం చేసుకోండి.

కన్య రాశి: ఆత్మీయులతో వివాదాలు !

పనులు వాయిదా వేస్తారు. విద్య పై ఆసక్తి పెరుగుతుంది. ధన, వస్తు లాభం పొందుతారు. ఆత్మీయులతో స్వల్ప వివాదాలు. ప్రారంభించిన వ్యవహారాలు సకాలంలో పూర్తిచేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. దూర ప్రయాణాలు. ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం పారాయణం చేసుకోండి.

Today February 22Nd 2021 Daily Horoscope In Telugu
today february 22nd 2021 daily horoscope in telugu

తుల రాశి: ప్రయాణాలు వాయిదా !

పనుల్లో జాప్యం. మానసిక ఆందోళనల పై పట్టు సాధిస్తారు. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. ప్రయాణాలు వాయిదా పడతాయి. శ్రీదక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేసుకోండి.

వృశ్చిక రాశి: బంధువులతో ఆనందం !

ప్రముఖులతో పరిచయాలు.మిత్రులతో వివాదాలు సమసిపోతాయి. పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెంచుకుంటారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. బంధువులతో ఆనందంగా ఉంటారు. కుటుంబ పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. శివపంచాక్షరీ స్తోత్రం పారాయణం చేసుకోండి.

ధనుస్సు రాశి: వ్యవహారాలలో విజయం !

ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. బంధువుల నుంచి శుభవార్తలు. అనుకోని ప్రయాణాలు. ఆర్థికాభివృద్ధి. ఆరోగ్య విషయంలో శ్రధ్ధా వహించండి.వ్యవహారాలలో విజయం. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. బంధువులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. శ్రీదుర్గా అష్టకం పారాయణం చేసుకోండి.

మకర రాశి: కుటుంబలో శుభకార్యాలు !

సన్నిహితులతో వివాదాలు.భాగస్వామ్య వ్యవహారాలు బాగుంటాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించండి. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. కుటుంబలో శుభకార్యాలు. శని స్తోత్ర పారాయణం చేసుకోండి.

కుంభ రాశి: ఇంటాబయటా అభివృద్ధి !

దూర ప్రాంతాల నుంచి విలువైన సమాచారం లభిస్తుంది. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఇంటాబయటా అభివృద్ధి సాధిస్తారు. పనులు వాయిదా వేస్తారు. బంధువులను కలుసుకుంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శ్రీకాలభైరవాష్టకం పారాయణం చేసుకోండి.

మీన రాశి: వ్యాపారాలలో పురోభివృద్ధి !

ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆస్తి వివాదాలు తీరతాయి. కొత్త పనులు ప్రారంభిస్తారు. రుణ వత్తిడి తీరుతుంది. వ్యాపారాలలో పురోభివృద్ధి. మానసికంగా ప్రశాంతతను పొందుతారు. ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. అనుకోని అవకాశాలు లభిస్తాయి. దేవీ ఖడ్గమాలా స్తోత్ర పారాయణ చేసుకోండి.

Related Posts

Gallery

Most Popular

Polls

Latest News