HomeNews'షుగర్'కి బదులుగా వీటిని వాడండి... రిజల్ట్ అమోఘం!

‘షుగర్’కి బదులుగా వీటిని వాడండి… రిజల్ట్ అమోఘం!

బరువు తగ్గించుకోవటం అంత తేలికైన విషయం కాదు. ఎంతో శ్రమపడాలి, ఎక్కువగా సమయాన్ని కేటాయించాలి. ఇంత చేసినా ఒకోసారి అనుకున్న విధంగా ఫలితాన్ని పొందలేము. అన్నిటికన్నా పంచదార వల్ల ఎక్కువ బరువు పెరుగుతామని అందరికి తెలుసా? పంచదారకు అడిక్ట్ అవుతామని మీకు తెలుసా? ఒక సర్వే ప్రకారం కొకైన్ కన్నా పంచదారనే ఎక్కువ అడిక్టివ్ అని నిర్ధారణ అయింది. అందుకే తీపి వస్తువులను తినకుండా ఉండటం కష్టంగా ఉంటుంది. అలాంటి షుగర్ ని తొలగించి దానికి బదులుగా ప్రత్యామ్నాయ పదార్థాలను ఉపయోగించి బరువును తేలికగా తగ్గించుకోవచ్చు.

Jaggery E1627909245419 | Telugu Rajyam

బెల్లం: షుగర్ కు మంచి ప్రత్యామ్నాయంగా బెల్లాన్ని మన దేశంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఏ తీపి వస్తువులో లేనటువంటి పోషక విలువలు బెల్లంలో ఉంటాయి. బెల్లం సహజ పద్దతిలో రక్త శుద్ధి చేస్తుంది. జీవక్రియని పెంచటంలోనూ, కాలేయాన్ని డిటాక్స్ చేయటంలోనూ, మలబద్దకాన్ని తగ్గించటంలోనూ బెల్లం బాగా పనిచేస్తుంది. చర్మ సంబంధిత సమస్యలను కూడా బెల్లం దూరం చేస్తుంది.

Health Benefits Of Patika Bellam | Telugu Rajyam

పటిక బెల్లం : మన భారతీయులు ఎప్పటినుండో పటిక బెల్లాన్ని వాడుతున్నారు. ఇది అచ్చంగా షుగర్ వంటి టేస్ట్ కలిగి ఉండి ఆరోగ్యానికి చాలా మంచిది. పటిక బెల్లాన్ని అనేక కెమికల్స్ తో కలిపి ప్రాసెస్ చేసి రిఫైన్డ్ షుగర్ తయారుచేస్తారు. ఇందులో ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. శరీరాన్నిచల్లగా ఉంచటమే కాక హిమోగ్లోబిన్ ను పెంచుతుంది. టీ, కాఫీ, జ్యూస్, స్వీట్స్ లాంటి వాటిలో దీనిని ఉపయోగించుకోవచ్చు.

Honey I Shrunk The Tests India Retains Just One Of Three Major Quality Parameters Prompting Adulteration Fears Wrbm Large | Telugu Rajyam

తేనె: తేనెలో ఉండే పోషకాలను మానవ శరీరం పూర్తిగా తీసుకోగలదు. తినే వస్తువుతో తేనెను కలిపి తీసుకోవటం వలన తేలికగా జీర్ణమవుతుంది. యాంటీ బాక్టీరియల్, యాంటీఆక్సిడెంట్ల గుణాల కలిగిన తేనె షుగర్ కు చక్కని ప్రత్యామ్నాయం. గుండెను ఆరోగ్యాంగా, బ్రెయిన్ ని షార్ప్ గా, బాడీని ఫిట్ గా ఉంచుతుంది. ప్రతి వస్తువుతో తేనెను కలిపి తీసుకోవచ్చు. వేడి నీటిలో నిమ్మరసం, తేనె కలిపి తీసుకుంటే సులభంగా బరువు తగ్గించుకోవచ్చు.

Sweet Talk On Stevia | Telugu Rajyam

స్టీవియా: స్టీవియా మొక్క ఆకుల నుండి దీనిని తయారుచేస్తారు. నేచురల్ స్వీటనర్ గా స్టీవియా బాగా పనిచేస్తుంది. ఇది జీరో కెలొరీస్ కలిగి ఉంటుంది. ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అవుతుంది. దీని గ్లైసమిక్ ఇండెక్స్ (GI)- 0 ఉండటం వలన బ్లడ్ షుగర్ లెవెల్ ను పెంచదు. బరువు తగ్గించుకోటానికి బాగా ఉపయోగపడుతుంది. మార్కెట్లో స్టీవియా మాత్రల రూపంలో, పొడి రూపంలోనూ ఇది దొరుకుతుంది.

Download 15 | Telugu Rajyam

కోకోనట్ షుగర్: దీనిని కొబ్బరి కాయల నుండి కెమికల్స్ ఉపయోగించకుండా శుద్ధి చేసి తయారు చేస్తారు. ఈజీ గా జీర్ణమవటమేకాక ఇందులో ఐరన్, పొటాషియం,జింక్, కాల్షియం ఉంటాయి. షుగర్ గ్లైసమిక్ ఇండెక్స్ (GI) 68 తో పోలిస్తే కోకోనట్ షుగర్ GI-35 చాలా తక్కువగా ఉంటుంది. పాలు, పెరుగు, కేక్స్, బ్రేక్ ఫాస్ట్ వంటలలో చక్కగా ఉపయోగించుకోవచ్చు.

Unnamed 1 | Telugu Rajyam

డేట్స్ షుగర్: దీనిని ఖర్జురాలతో తయారు చేస్తారు. ఖర్జురాలు సహజంగా తియ్యగా ఉంటాయి. పంచదార షుగర్ కు చక్కని ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు. దీనిని ఇంట్లో కూడా తేలికగా ఎవరైనా తయారు చేసుకోవచ్చు. ఖర్జురాలను బాగా ఎండబెట్టి గ్రైండ్ చేసుకుని జల్లించుకుంటే డేట్స్ షుగర్ తయారవుతుంది. ఇందులో ఎక్కువగా మినరల్స్, ఫైబర్, విటమిన్స్ ఉంటాయి. డేట్స్ షుగర్ తీసుకోవటం వల్ల కొలెస్ట్రాల్ తగ్గటమేకాక, బోన్ డెన్సిటీ పెరుగుతుంది. దీని GI- 45 నుండి 50 వరకు ఉంటుంది.

Related Posts

Gallery

Most Popular

Polls

Latest News