Home Politics ఏపీలోని నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్

ఏపీలోని నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్

ప్రభుత్వ రంగంలో అందరికి ఉద్యోగాలు కల్పించలేని పరిస్థితి ఉండడంతో ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ సిద్దమైంది. మరో భారీ ఉద్యోగ మేళాకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.  ఫిబ్రవరి 2, 9, 16 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో ఉద్యోగ మేళాలు నిర్వహించనున్నారు. ‘అడ్వాంటేజ్‌ కెరీర్‌ ఎక్స్ పో’ పేరుతో మెగా ఉద్యోగమేళాలు నిర్వహించనున్నట్టు ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ తెలిపింది. కాగా, గత నెల 23, 24 తేదీల్లోనూ మెగా ఉద్యోగ మేళాలు నిర్వహించింది.  

రెండో తేదీన ఫార్మా, హెల్త్ కేర్, మెడికల్‌, లైఫ్‌సైన్స్‌ రంగాలకు చెందిన 150కిపైగా సంస్థలు మేళాలో పాల్గొననున్నాయి. బీఎస్సీ, బీఫార్మసీ, ఇంటర్, ఎంఎస్సీ, ఎంఫార్మసీ చేసిన అభ్యర్థులు మేళాకు హాజరుకావొచ్చు. అలాగే,  9న ఐటీ, ఎలక్ట్రానిక్స్‌, టెలీ కమ్యూనికేషన్స్‌, బీపీవో, ఆటోమొబైల్‌, కన్‌స్ట్రక్షన్ రంగాలకు సంబంధించిన సంస్థలు మేళాలో పాల్గొంటాయి. చివరిగా ఈ నెల 16న జరగనున్న మేళాలో సెక్యూరిటీ సర్వీసెస్, లాజిస్టిక్స్‌, బ్యాంకింగ్‌ తదితర రంగాలకు సంబంధించిన సంస్థలు పాల్గొంటాయి.

నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కార్పొరేషన్ పేర్కొంది. మరిన్ని వివరాలకు https://www.apssdc.in/home/AdvantageAP వెబ్‌సైట్‌లోకి వెళ్లి తమ వివరాలను రిజిస్టర్ చేసుకోవాలని సూచించింది.         

అత్యంత ప్రజాధారణ

తెలుగురాజ్యం ప్రత్యేకం

తాజా వార్తలు

‘మిస్టర్ ఫర్ ఫెక్ట్’ కథ కాపీనే, కోర్ట్ తీర్పు

‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’ (2011) కాపీ వివాదం కోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే. 2019 జనవరిలో కోర్టు ఆదేశాల మేరకు 4117/ 2018 గా చార్జిషీట్ నమోదు చేసిన మాదాపూర్ పోలీసులు దిల్ రాజుకు...

‘కేజీయఫ్‌ 2’ లో నటించాలని ఉందా?

కన్నడ,తెలుగు,తమిళ, హిందీ భాషల్లో సంచలన విజయం సాధించిన భారీ చిత్రం కేజీయఫ్‌. యంగ్ హీరో యష్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు సీక్వెల్‌ పనులు ప్రారంభించారు. చిత్రయూనిట్‌. తొలి...

తెలుగు టీవీ యాంకర్ పై కేసు, తాగి ఆమె ఏం చేసిందంటే..

తెలుగు టీవి యాంక‌ర్ ప్ర‌శాంతి పై ఉప్ప‌ల్ పోలీసులు కేసు న‌మోదు చేసారు. సంతోష్ ఉఫాద్యాయ్ అనే వ్య‌క్తితో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించ‌డంతో ఆమెపై కేసు న‌మోదైంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆదివారం సన్‌రైజర్స్‌...

సల్మాన్ ‘భారత్’ ట్రైలర్‌ టాక్

సల్మాన్‌ ఖాన్‌ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘భారత్‌’ ట్రైలర్‌ వచ్చేసింది. Ode To My Father అనే కొరియా చిత్రానికి రీమేక్ గా వస్తున్న ఈ చిత్రంలో సల్మాన్‌ను ఐదు విభిన్నమైన...

జయప్రద ఒక అనార్కలి, ఈ సారి నోరు జారింది ఆజంఖాన్ కొడుకు

హీరోయిన్ జయప్రద మూడో సారి లోక్ సభ లో ప్రవేశించేందుకు ఈ సారి చాలా తీవ్రమైన పోటీ ఎదుర్కొంటున్నారు. ఈ ప్రయత్నం కూడా ఉత్తరప్రదేశ్ నుంచే చేస్తున్నారు. ఈ సారి బిజెపి అభ్యర్థిగా...

పార్టీల ఎన్నికల ఖర్చు రూ 10 వేల కోట్లా ?

మొన్న జరిగిన ఎన్నికల్లో అన్నీ పార్టీలు కలిసి పెట్టిన ఖర్చు రూ 10 వేల కోట్లుగా అనంతపురం టిడిపి ఎంపి జేసి దివాకర్ రెడ్డి పెద్ద బాంబే పేల్చారు. ఈ పార్టీ అని...

స్పీకర్ భవనంపై కొత్త వివాదం

ఆయనెప్పుడూ ప్రజా జీవితంలో విలువల గురించే మాట్లాడుతుంటారు. ఎంఎల్ఏల ప్రవర్తనా నియమావళి గురించే లెక్షర్లిస్తుంటారు. కానీ తాను మాత్రం ఏమీ పట్టనట్లుంటారని వైసిపి నేతలంటున్నారు. ఈపాటికే ఆయనెవరో అర్దమైపోయుండాలి. అవును ఆయనే ఏపి...

‘జెర్సీ’పై విజయ్ దేవరకొండ ట్వీట్ వైరల్

నాని నటించిన లేటెస్ట్ మూవీ 'జెర్సీ' బాక్సాఫీసు వద్ద సంచలన విజయం అందుకుంది. శ్రద్ధా శ్రీనాథ్‌ హీరోయిన్ గా గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని.... సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మించింది....

మైండ్ దొబ్బిందా..ఆ సినిమా రీమేక్ ఏంటి?

హిట్టైన సినిమాని ఎవరైనా రీమేక్ చేస్తారు..డిజాస్టర్ సినిమాని రీమేక్ చేసి హిట్ కొట్టినవాడే మొగాడు అనుకున్నారో ఏమో కాని ఇప్పుడు తమిళంలో అలాంటి ప్రయత్నమే ఒకటి జరుగుతోందని వినికిడి. బంధాలు, ఆత్మీయతలు, అనురాగాలు...

సిఎస్ సమీక్షలంటే అధికారపార్టీ భయపడుతోందా ?

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం చేస్తున్న సమీక్షలతో ప్రభుత్వంలోని ముఖ్యులు  భయపడుతున్నారా ? మంత్రి యనమల రామకృష్ణుడి వ్యాఖ్యలు చూస్తుంటే అందరిలోను అవే అనుమానాలు పెరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం  ఆర్దికశాఖ...
 Nate Gerry Jersey