Home Entertainment Tollywood సాహో వ‌ర్సెస్ సైరా.. వార్ న‌డుస్తోందా?

సాహో వ‌ర్సెస్ సైరా.. వార్ న‌డుస్తోందా?

* హెల్తీ కాంపిటీటివ్ స్పిరిట్
* రికార్డులు బ్రేక్ చేసేది ఎవ‌రు? ఎవ‌రి స‌త్తా ఎంత‌?

కేవ‌లం నెల‌రోజుల గ్యాప్ తో `ఇండియాస్ మోస్ట్ అవైటెడ్` అని చెబుతున్న రెండు భారీ టాలీవుడ్ చిత్రాలు రిలీజ్ బ‌రిలో దిగుతున్నాయి. ఈ రెండిటి మ‌ధ్యా అన్ని విష‌యాల్లో వార్ న‌డుస్తోంద‌ని ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల్లో వాడి వేడిగా చ‌ర్చ సాగుతోంది. ఇరు సినిమాల‌కు భారీ కాస్టింగ్ ని ఎంపిక చేసుకున్నారు. అలాగే హాలీవుడ్ రేంజ్ సాంకేతిక నిపుణులు ప‌ని చేస్తున్నారు. భారీ వీఎఫ్ఎక్స్-గ్రాఫిక్స్ వ‌ర్క్ కోసం ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న టాప్ టెక్నీషియ‌న్లు ప‌ని చేస్తున్నారు. పైగా ఈ రెండిటిలోనూ యాక్ష‌న్ కంటెంట్ యూనిక్ గా డిజైన్ చేశారు. ఇక బ‌డ్జెట్ల ప‌రంగానూ ఇంచుమించు 350 కోట్ల మేర పెట్టుబ‌డులు పెడుతుండ‌డం ఆస‌క్తిక‌రం. సాహో చిత్రానికి 350 కోట్ల బ‌డ్జెట్ పెట్టామ‌ని ప్ర‌భాస్ చెప్పుకొచ్చారు. దీంతో ఓ చానెల్ ఇంట‌ర్వ్యూలో సురేంద‌ర్ రెడ్డి సైతం `సాహో`కి ఏమాత్రం త‌గ్గ‌ని బ‌డ్జెట్ సైరాకి వెచ్చించామ‌ని వెల్ల‌డించ‌డం ఆస‌క్తి రేకెత్తించింది. అంటే `సైరా`కు దాదాపు 300-350 కోట్ల బ‌డ్జెట్ పెడుతున్నార‌ని స‌న్నివేశం చెబుతోంది. ఈ రెండు సినిమాల్ని క‌థాంశాల ప‌రంగా జోన‌ర్ ప‌రంగానూ పోల్చి చూడొద్ద‌ని ఇప్ప‌టికే అభిమానుల‌కు సందేశం అందింది. ఇక ఈ రెండు సినిమాల్ని జాతీయ అంత‌ర్జాతీయ స్థాయిలో రిలీజ్ చేయాల‌న్న‌ది ముంద‌స్తు ప్లాన్. అందుకు త‌గ్గ‌ట్టే విజువ‌ల్ గ్రాండియారిటీ ఉన్న క‌థ‌ల్ని ఎంచుకుని షూటింగుల‌కు వెళ్లారు. అంతే వండ‌ర్ ఫుల్ గా యాక్ష‌న్ – వార్ స‌న్నివేశాల్ని తెర‌కెక్కించార‌ని ఇటీవ‌ల రిలీజైన విజువ‌ల్స్ తెలిపాయి. సాహో టీజ‌ర్, ట్రైల‌ర్, మేకింగ్ వీడియోలు వండ‌ర్ ఫుల్ అంటూ కాంప్లిమెంట్లు ద‌క్కాయి. అంత‌కుమించి `సైరా` మేకింగ్ వీడియో పై ప్ర‌శంస‌లు కురిశాయి. న‌టీన‌టుల ఎంపిక మొద‌లు ప్ర‌తిదాంట్లో సాహో, సైరా చిత్రాల కోసం యూనివ‌ర్శ‌ల్ అప్పీల్ కోసం త‌ప‌న ప‌డ్డార‌ని విజువ‌ల్స్ చెబుతున్నాయి.

<

p style=”text-align: justify”>ఇక ఇటీవలి కాలంలో సాహో ప్ర‌చారం చూస్తున్న‌దే. దేశంలోని న‌గ‌రాల‌న్నిటినీ సాహో టీమ్ చుట్టేసి ప్ర‌చారం చేస్తోంది. హైద‌రాబాద్ రామోజీ ఫిలింసిటీలో అత్యంత భారీగా సాహో ప్రీరిలీజ్ ఈవెంట్ ని నిర్వ‌హించారు. మునుపెన్న‌డూ చూడ‌నంత గ్రాండియ‌ర్ గా దాదాపు 3కోట్ల ఖ‌ర్చుతో స్టేజీ నిర్మించి సాహో వ‌ర‌ల్డ్ ని డిస్ ప్లే చేశారు. యువి సంస్థ ప్ర‌మోష‌న‌ల్ స్ట్రాట‌జీ చూశాక‌.. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ కంపెనీ అధినేత రామ్ చ‌ర‌ణ్ సైతం సైరా: న‌ర‌సింహారెడ్డి ప్ర‌చారంలో ఏమాత్రం త‌గ్గ కూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్నార‌ట‌. అంటే సాహోని మించి ప్రీరిలీజ్ వేడుక మొద‌లు ప్ర‌తిదీ చేయ‌నున్నారు. సాహో త‌ర‌హాలోనే ఇండియాలోని అన్ని మెట్రో న‌గ‌రాల్లో సైరా చిత్రానికి ప్రచారం చేయ‌నున్నారు. నేటి నుంచే ఈ ప్ర‌చార యుద్ధం లో వేగం పెంచుతున్నారు. నేటి మ‌ధ్యాహ్నం 2.45 గంట‌ల‌కు సైరా టీజ‌ర్ ని రిలీజ్ చేస్తున్నారు. ఈనెల 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న చిరంజీవి అభిమాన సంఘాలు ఆ రేంజులోనే సైరా చిత్రాన్ని ప్ర‌మోట్ చేయాల‌ని నిర్ణ‌యించాయిట‌. ఈ చిత్రాన్ని యూనివ‌ర్శ‌ల్ అప్పీల్ ఉన్న సినిమాగా ప‌బ్లిసిటీ చేస్తున్నారు. సాహో ఆర్.ఎఫ్‌.సి ఈవెంట్ ని మించి హైద‌రాబాద్ లో ప్లాన్ చేయ‌నున్నార‌ట‌. అలాగే ముంబై స‌హా మెట్రో న‌గ‌రాల్లో ఈవెంట్ల‌ను అదిరిపోయే రేంజులో ప్లాన్ చేస్తున్నార‌ని తెలుస్తోంది. మొత్తానికి బ‌డ్జెట్ .. కాస్టింగ్ లోనే కాదు.. ప్ర‌తిదాంట్లో సాహో వ‌ర్సెస్ సైరా వార్ న‌డుస్తోంద‌ని అభిమానుల్లో చ‌ర్చ సాగుతోంది. అయితే రెండు భారీ చిత్రాల్ని అత్యంత క్వాలిటీతో అభిమానుల ముందుకు తెచ్చేందుకే ఈ తాప‌త్ర‌యం. ఇక రిలీజ్ స‌హా ప్ర‌తిదాంట్లో సాహో, సైరా బృందాలు ముందే మాట్లాడుకుని పోటీ లేకుండా రిలీజ్ చేస్తుండ‌డం ఆస‌క్తిక‌రం. ప్ర‌స్తుతం ఈ రెండు సినిమాల భారీ త‌నం గురించి అభిమానుల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. సాహో ఆగ‌స్టు 30న రిలీజ‌వుతుంటే అక్టోబ‌ర్ 2న మెగాభిమానుల‌కు ట్రీటిచ్చేందుకు సైరా సిద్ధ‌మ‌వుతోంది. విజువ‌ల్ ఫెస్టివ‌ల్స్ కోసం ఆ రెండు తేదీల్ని అభిమానులు లాక్ చేసుకోవాల్సిందే. ప్ర‌పంచ సినీయ‌వ‌నిక‌పై తెలుగు వాడి గౌర‌వాన్ని పెంచుతూ.. అంతా గ‌ర్వించేలా రెండు గొప్ప చిత్రాలు టాలీవుడ్ నుంచి వ‌స్తున్నాయి. వీటికి ప్రేక్ష‌కాద‌ర‌ణ ఆ స్థాయిలోనే ఉంటుంద‌ని ఆకాంక్షిద్దాం.

Recent Post

స‌క్సెస్ కోసం అందాల రాక్ష‌సి శ్ర‌మిస్తోంది!

`అందాల రాక్ష‌సి` సినిమాతో పేరు తెచ్చుకున్నా లావ‌ణ్య త్రిపాఠికి రావాల్సిన క్రేజ్ ఇంకా ద‌క్క‌లేద‌నే చెప్పాలి. భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, సోగ్గాడే చిన్నినాయ‌నా. శ్రీ‌న‌స్తు శుభ‌మ‌స్తు, అర్జున్ సుర‌వ‌రం వంటి చిత్రాల్లో న‌టించినా...

మెగా హీరో కోసం రంగంలోకి దిల్‌రాజు – యువీ!

`చిత్ర‌ల‌హ‌రి` సినిమాతో మ‌ళ్లీ ట్రాక్‌లోకి వ‌చ్చాడు మెగా మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్‌తేజ్‌. ఇటీవ‌ల `ప్ర‌తీరోజు పండ‌గే` చిత్రంతో మ‌రో హిట్‌ని త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఈ రెండు చిత్రాలు అందించిన స‌క్సెస్ ఆనందంలో వున్న...

రానా కోసం నందిత వ‌చ్చేసింది!

`నీది నాది ఒకే క‌థ‌` ఫేమ్ వేణు ఊడుగుల తెర‌కెక్కిస్తున్న చిత్రం `విరాట‌ప‌ర్వం`. రానా, సాయి ప‌ల్ల‌వి హీరో హీరోయిన్‌లుగా న‌టిస్తున్నారు. ఉత్త‌ర తెలంగాణ‌లో పీపుల్స్ వార్ ఉద్య‌మానికి సంబంధించిన కీల‌క సంఘ‌ట‌న‌లు...

టాప్ లెస్‌గా పోజులిచ్చిన కియారా!

నెట్‌ఫ్లిక్స్ కోసం అనురాగ్ క‌శ్య‌ప్ రూపొందించిన వెబ్ సిరీస్ `ల‌స్ట్ స్టోరీస్‌`. ఇందులో ఓ భాగాన్ని క‌ర‌ణ్ జోహార్ రూపొందించాడు. మేఘాగా న‌టించిన కియారా అద్వానీ న న‌ట‌న‌తో దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం...

జ‌క్క‌న్నకు భారీ షాక్.. ఈ సారి మ‌రో లీక్‌!

రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న `ఆర్‌ ఆర్ ఆర్‌` రిలీజ్‌కు ముందే సోస‌ల్ మీడియ‌లో వైర‌ల్‌గా మారుతోంది. సినిమా మొద‌లైన ద‌గ్గ‌రి నుంచి ఈ చిత్రానికి సంబంధించి ఏదో ఒక‌టి లీక్ అవుతూనే వుంది. క్యారెక్ట‌ర్స్...

రూ 150 కోట్లు … అందుకే సిబిఐ వద్దన్నారా?

 "ఆంధ్ర ప్రదేశ్ లో ఒక ప్రముఖ వ్యక్తికి రూ 150 కోట్లు చెల్లించిన ఆధారాలు లభించాయి." "మూడు ప్రధాన కాంట్రాక్టు కంపెనీలు హవాలా ఏజెంట్లు, బ్రోకర్లతో నల్లధనాన్ని విదేశీ పెట్టుబడుల రూపంలో తెచ్చిన...

అమ్మ‌కానికి రామానాయుడు స్టూడియో?

అమ్మ‌కానికి రామానాయుడు స్టూడియో సిద్ధ‌మ‌వుతోంది. గ‌త కొన్ని ద‌శాబ్దాల పాటు రామానాయుడు హ‌యంలో ఓ వెలుగు వెలిగిన స్టూడియో ఇది. ఇక్క‌డ చిన్న సినిమాల నుంచి స్టార్స్ చిత్రాల వ‌ర‌కు ఓపెనింగ్‌లు జ‌రుపుకున్నాయి....

ఫ‌స్ట్‌నైట్ ప్లేస్ అంటూ శ్రీ‌రెడ్డి షాకింగ్ పోస్ట్!

శ్రీ‌రెడ్డి.. కాస్టింగ్ కౌచ్ వివాదంతో వెలుగులోకి వ‌చ్చిన పేరిది. త‌న‌కు `మా`లో స‌భ్య‌త్వం ఇవ్వ‌లేద‌ని వ‌ర్మ ఇచ్చిన ప్లాన్ ప్ర‌కారం ఇండస్ట్రీలో ర‌చ్చ‌కు తెర‌లేపి సెల‌బ్రిటీ అయిపోయింది. ప‌నిలో ప‌నిగా ముందు అనుకున్న...

CAA NPR NRC ముఖ్యమంత్రి మెడ మీద కత్తిలా వున్నాయా?

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం CAA (పౌర సత్వ సవరణచట్టాన్ని) తీవ్ర అభ్యంతరాల మధ్య చట్ట సభల్లో ఆమోదించింది. ఏదో విధంగా కాశ్మీర్ లో ఆర్టికల్ 370 ని నిర్వీర్యం చేసింది. సిఎఎని ఆధారం...

కేంద్రం హామీతో జోష్ లో ముఖ్యమంత్రి

వికేంద్రీకరణ సిఆర్డీఏ రద్దు బిల్లులకు శాసన మండలిలో బ్రేక్ పడటంతో ముఖ్యమంత్రి తానూహించినట్లు ముందుకు పోయే వీలు లేకుండా పోయింది. ఈ దశలో కేంద్రం సాయం లేనిదే బయట పడటం కుదరదని భావించే ముఖ్యమంత్రి...

Featured Posts

రూ 150 కోట్లు … అందుకే సిబిఐ వద్దన్నారా?

 "ఆంధ్ర ప్రదేశ్ లో ఒక ప్రముఖ వ్యక్తికి రూ 150 కోట్లు చెల్లించిన ఆధారాలు లభించాయి." "మూడు ప్రధాన కాంట్రాక్టు కంపెనీలు హవాలా ఏజెంట్లు, బ్రోకర్లతో నల్లధనాన్ని విదేశీ పెట్టుబడుల రూపంలో తెచ్చిన...

అదే విషం..అదే పైత్యం..అదే ఆక్రోశం

ఎప్పటిలాగే భేతాళుడు విక్రమార్కుడి భుజం పైకి ఎక్కినట్లు ఎప్పటిలాగే రాధాకృష్ణ ఈవారం కూడా తన ఆక్రోశాన్ని కక్కేసాడు.  కాకపొతే ఈసారి కొంచెం నిర్వేదం, కొంత అయోమయం, కొంత ఖేదం పొగలు కక్కాయి.  చంద్రబాబు...

వైసిపి- బిజెపి పొత్తు! ఒక్క రోజులోనే పలు యూ టర్న్ లు!

మంత్రి బొత్స సత్యనారాయణ సంచలనాలకు కేంద్ర బిందువుగా మారారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా చేరిన తర్వాత బహు బోల్డ్ గా తయారై ముఖ్యమంత్రికి ముందే ప్రభుత్వ విధానాలే కాకుండా పార్టీ పాలసీ...

ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన సఫలమా? విఫలమా?

రెండు రోజుల క్రితం ఒక సారి తిరిగి శుక్ర శనివారాలు రెండు రోజులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో మకాం బెట్టి ప్రధాన మంత్రిని హోం మంత్రిని న్యాయ శాఖ మంత్రిని కలసి...

జగన్ అమిత్ షా చర్చల ఎజెండా ఏమిటి?

దీర్ఘ విరామం తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలిశారు. వాస్తవంలో ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. ముఖ్యమంత్రులు ప్రధాన మంత్రిని తరచూ కలుసుకొంటూ వుంటారు. కాని ముఖ్యమంత్రి ప్రధానిని...