Home Entertainment Tollywood తెలంగాణ హైకోర్టులో సైరా వివాదంపై విచార‌ణ‌

తెలంగాణ హైకోర్టులో సైరా వివాదంపై విచార‌ణ‌

ఉయ్యాల వాడ వార‌సులు .. వ‌ద‌ల బొమ్మాళీ

గ‌త కొంత కాలంగా టాలీవుడ్ చుట్టూ వివాదాలు అలుముకుంటున్న విష‌యం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి న‌టించిన `సైరా` కూడా అందుకు మిన‌హాయింపు కాద‌ని తాజా స‌న్నివేశం చెబుతోంది. చిరు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెర‌పైకి వ‌చ్చిన ఈ చిత్రానికి ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి వార‌సులే విల‌న్‌లుగా మారారు. త‌మ వివాదం ఓ కొలిక్కి వస్తే త‌ప్ప సినిమాని విడుద‌ల చేయ‌కూడ‌ద‌ని ఏకంగా హైకోర్టును ఆశ్ర‌యించారు. 23 మంది వారసుల‌మైన త‌మ‌కు ఒక్కొక్కరికి 2 కోట్ల‌ చొప్పున 46 కోట్లు చెల్లిస్తామ‌ని చిత్ర నిర్మాత రామ్‌చ‌ర‌ణ్ మాటిచ్చాడ‌ని, తాజాగా ఆ మాట త‌ప్పాడ‌ని ఆరోపిస్తూ సినిమా విడుద‌ల‌ని నిలిపివేయాల‌ని కోర్టును ఆశ్ర‌యించారు. ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి వార‌సుల పిటీష‌న్‌ని స్వీక‌రించిన హైకోర్టు మంగ‌ళ‌వారం విచార‌ణ చేప‌ట్ట‌నుంది.

దీంతో `సైరా` సినిమా రిలీజ్‌పై నీలినీడ‌లు క‌మ్ముకున్నాయి. త‌మ‌కు న‌ష్ట‌ప‌రిహారం చెల్లించ‌కుండా త‌మ‌ని ఇబ్బందుల‌కు గురిచేస్తున్నార‌ని స‌ద‌రు పిటీష‌న్‌లో పేర్కొన‌డం క‌ల‌క‌లం రేపుతోంది. మా న‌ర‌సింహారెడ్డి క‌థ‌ని ఫ్రీగా తీసుకుని మ‌మ్మ‌ల్ని మోసం చేశార‌ని, న్యాయం కోసం పోరాడిన త‌మ‌పైనే అక్ర‌మ కేసులు పెట్టించార‌ని ఈ సంద‌ర్భంగా పిటీష‌న్‌లో పొందుప‌రిచారు. దీంతో చిరు క‌ల‌ల ప్రాజెక్ట్ `సైరా` చుట్టూ నీలి నీడ‌లు క‌మ్ముకుంటున్నాయి. ఇంత‌కీ `సైరా` రిలీజ్ వుంటుందా? అంటే నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న రామ్‌చ‌ర‌ణ్ ఎంత మేర న‌ష్ట‌ప‌రిహారం చెల్లించాల్సి వుంటుంది?. నిజంగానే చెల్లిస్తారా?.. 46కోట్ల డిమాండ్ సరైన‌దేనా? ఉయ్యాల‌వాడ వార‌సులు బ్లాక్ మెయిల్ చేస్తున్నారా.. న్యాయ‌బద్ధ‌మైన పోరాట‌మేనా? అన్న‌ది తెలియాలంటే రేప‌టి వ‌ర‌కు వేచి చూడాల్సిందే. 

Featured Posts

ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఎలా పని చేస్తాయి?

ప్రతీ శాఖకీ ఒక సెక్రటరీ ఉంటారు. ఆ శాఖకి మొత్తం బాధ్యత వారిదే. వీళ్ళకి రాజకీయాలతో పని లేదు. తమ తమ పరిధిలో వారి బాధ్యతలు వారు నిబద్ధతతో నిర్వర్తిస్తారు. అప్పుడప్పుడు రాజకీయ...

ఏపీలో భీభ‌త్సం సృష్టిస్తున్న నిజాముద్దీన్‌!

ఏపీలో నిజాముద్దీన్ భీభ‌త్సం సృష్టిస్తోంది. నిన్న‌ మొన్న‌టి వ‌ర‌కు తెలంగాణ కంటే చాలా త‌క్క‌వ పాజిటివ్ కేసులు న‌మోదైన ఏపీలో బుధ‌వారం ఒక్క‌సారిగా ప‌రిస్థితి మారిపోయింది. గురువారం ఒక్క‌రోజే ఏకంగా 21 పాజిటివ్...

జగన్‌ నిర్ణయానికి మద్దతిచ్చిన చంద్రబాబు!

ఉప్పు, నిప్పులా ఒకరిపై ఒకరు చిటపటలాడుతూ.. తీవ్ర విమర్శలు చేసుకునే అధికార, ప్రతిపక్ష నేతలు వారు. కానీ ఇప్పుడు ఒకరు తీసుకున్న కఠిన నిర్ణయానికి మరొకరు మద్దతుగా నిలిచారు. వందశాతం సమర్థించారు. పైగా...

Recent Posts

కొర‌టాల నిర్ణ‌యం షాకింగ్‌గా వుందే!

స‌మాజ హితం కోసం స్టార్ డైరెక్ట‌ర్ ఎవ‌రూ చేయ‌ని త్యాగానికి సిద్ధ‌ప‌డ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. ఆ ద‌ర్శ‌కుడు మ‌రెవ‌రో కాదు స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌. ఆయ‌న‌కు అభ్యుద‌య భావాలు ఎక్కువే. ర‌చ‌యిత‌,...

ప‌వ‌ర్‌స్టార్‌తో మాస్ మ‌హారాజా మల్టీస్టార‌ర్‌?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ కొంత విరామం త‌రువాత మ‌ళ్లీ సినిమాల జోరు పెంచారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు అనౌన్స్ చేస్తున్నాడు. `పింక్‌` రీమేక్ ఆధారంగా రూపొందుతున్న `వ‌కీల్‌సాబ్‌`తో మ‌ళ్లీ న‌టించ‌డం మొద‌లుపెట్టాడు. శ్రీ‌రామ్...

మెగాస్టార్ ఏంటీ ఇలా ట్విస్ట్ ఇచ్చాడు?

`సైరా` త‌రువాత మెగాస్టార్ చిరంజీవి ఓ భారీ చిత్రంలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. కొర‌టాల శివ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రానికి `ఆచార్య‌` అనే టైటిల్‌ని ఫిక్స్ చేసిన‌ట్టు స్వ‌యంగా చిరు వెల్ల‌డించారు. క్రేజీ...

పెళ్లి గురించి అడిగితే ఎదురుప్ర‌శ్నిస్తోంది!

కీర్తి సురేష్.. విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల్ని సొంతం చేసుకున్న హీరోయిన్. త‌న‌కు పెద్ద‌గా న‌ట‌న రాద‌ని విమ‌ర్షించిన వారి చేత `మ‌హాన‌టి` చిత్రంతో శ‌భాష్ అనిపించుకుంది. ఈ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపుని సొంతం...

చిరు ఆటోబ‌యోగ్ర‌ఫీ రాస్తున్నారు!

క‌రోనా వైర‌స్ కార‌ణంగా ప్ర‌పంచ వ్యాప్తంగా జ‌న‌జీవితం స్థంభించిపోయింది. దేశాల‌న్నీ అనూహ్యంగా లాక్‌డౌన్ ప్ర‌క‌టించ‌డంతో సామాన్యుల నుంచి సెల‌డ్రిటీలంతా ఇళ్ల‌కే ప‌రిమిత‌మైపోయారు. అయినా ఖాలీగా కూర్చోవ‌డం లేదు. ఎవ‌రికి తోచిన ప‌ని వారు...

క్వారెంటైన్‌లో ఇలా కూడా వుంటారా?

బాలీవుడ్ చిత్రం `ద‌స్త‌క్‌` చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది విశ్వ‌సుంద‌రి సుస్మితాసేన్‌. తొలి సినిమా ఆశించిన ఫ‌లితాన్ని అందించ‌లేక‌పోయింది. న‌ట‌న రాద‌ని విమర్శ‌లు వినినించాయి. ఆ త‌రువాత సినిమాల్లో న‌టించే ప్ర‌య‌త్నం చేసినా...

ఆ న‌టితో ఎఫైర్ నిజ‌మే.. ఒప్పుకున్నజ‌గ్గూభాయ్!

జ‌గ్గూభాయ్ ఉరాఫ్ జ‌గ‌ప‌తిబాబు తాజాగా ఓ క్రేజీ హీరోయిన్‌తో త‌న‌కున్న ఎఫైర్‌ని బ‌య‌ట‌పెట్ట‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. గ‌త కొన్నేళ్ల క్రితం జ‌గ‌ప‌తిబాబు అప్ప‌ట్లో బెంగ‌ళూరుకు చెందిన స్టార్ హీరోయిన్‌తో అత్యంత స‌న్నిహితంగా మెలిగిన...

మండే ఎండ‌లో క‌రోనా మంట‌ల్లా!

ఓవైపు క‌రోనా క‌ల్లోలం.. మ‌రోవైపు స‌మ్మ‌ర్ ఎటాక్. న‌డిమ‌ధ్య‌లో ప్ర‌జ‌లు బెంబేలెత్తిపోతున్నారు. క‌రోనా కోర‌లు చాచి విజృంభిస్తుంటే..భానుడు ప్ర‌తాపాన్ని చూపిస్తున్నాడు. భార‌త్ లో న‌మోద‌వుతున్న ఉష్ణోగ్ర‌త‌ల‌కి క‌రోనా కాస్త కంట్రోల్ లోనే ఉంటుంది....

`ఆహా` కోసం సీన్‌లోకి ట్ర‌బుల్ షూటర్!

అల్లు అర‌వింద్ ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్రారంభించిన ఓటీటీ `ఆహా`. భారీ రేంజ్‌లో ప్లాన్‌లు వేసి ఈ ఓటీటీని తెర‌పైకి తీసుకొచ్చారు. లాంచింగ్ కి ఏడాది నుంచే ప్లాన్‌లు గీసినా అది ప్రాక్టిక‌ల్‌గా మాత్రం అస్స‌లు...

ప్చ్‌.. బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ కెరీర్ డైల‌మాలో!

ఆర్.ఎక్స్ -100 ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తి కెరీర్ డైల‌మా ఇప్ప‌ట్లో క్లియ‌ర‌వ్వ‌దా? మ‌హాస‌ముద్రం ప్రాజెక్ట్ ఏడాది కాలంగా చ‌ర్చ‌ల‌ ద‌శ‌లోనే న‌లుగుతున్న సంగ‌తి తెలిసిందే. తొలుత ఈ ప్రాజెక్ట్ నాగ‌చైత‌న్య ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌డం...