Home Entertainment Tollywood బాబాయ్ రీఎంట్రీకి అబ్బాయ్ మాస్ట‌ర్‌ ప్లాన్‌

బాబాయ్ రీఎంట్రీకి అబ్బాయ్ మాస్ట‌ర్‌ ప్లాన్‌

బాబాయ్ హీరో అబ్బాయ్ ప్రొడ్యూస‌ర్

ప‌వర్‌స్టార్ ప‌వ‌న్ కల్యాణ్ రాజ‌కీయాల్లోకి ఎంట‌ర‌య్యాక మ‌ళ్లీ కెమెరా ముందుకు రార‌ని చాలా కాలంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ప‌వ‌న్ కూడా చాలా వేదిక‌ల‌పై మ‌ళ్లీ సినిమాల్లో న‌టించ‌డం క‌ష్ట‌మే అన్న సంకేతాల్ని అందించాడు. ఆయ‌తే గ‌త కొన్ని వారాలుగా ప‌వ‌న్ మ‌ళ్లీ మేక‌ప్ వేసుకోబోతున్నార‌ని, త‌న బాబాయ్‌ని భారీ రేంజ్‌లో తెర‌పై చూపించ‌డానికి అబ్బాయ్ రామ్‌చ‌ర‌ణ్ ప్లాన్ చేస్తున్నాడ‌ని సోష‌ల్ మీడియాలో తెగ ప్ర‌చారం జ‌రుగుతోంది. అటు రాజ‌కీయాల్ని, ఇటు సినిమాల్ని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు న‌డ‌వాల‌ని ప‌వ‌న్ గ‌త కొంత కాలంగా ఆలోచిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

ఆ కార‌ణంగానే త‌ర‌చూ సినిమా ఫంక్షన్‌ల‌కు ప‌వ‌న్ హాజ‌ర‌వుతూ త‌న ఎంట్రీ పై ఇండైరెక్ట్‌గా సంకేతాలు ఇస్తున్నారు. ప‌వ‌న్ రీఎంట్రీరి బ‌ల‌ప‌రుస్తూ ఇటీవ‌ల చిరంజీవి చేసిన ప్ర‌క‌ట‌న మ‌రింత ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. రామ్‌చ‌ర‌ణ్ నిర్మించిన `సైరా న‌ర‌సింహారెడ్డి` ఇటీవ‌ల విడుద‌లై భారీ విజ‌యాన్ని న‌మోదు చేసుకున్న విష‌యం తెలిసిందే. ఈ విజ‌యానందంలో చిరంజీవి, రామ్‌చ‌ర‌ణ్ రీసెంట్‌గా ఓ మీడియాతో ఇంట‌రాక్ట్ అయ్యారు. ఈ సంద‌ర్భంగా రామ్‌చ‌ర‌ణ్ త‌న‌కు `సైరా` లాంటి చిత్రాన్నిచ్చినందుకు గ‌ర్వంగా ఉంద‌న్న చిరు త‌న త‌మ్ముడు ప‌వ‌న్‌తో చ‌ర‌ణ్ సినిమా చేస్తే చూడాల‌ని వుంద‌ని త‌న మ‌న‌సులో మాట‌ని బయ‌ట‌పెట్టేశారు.

ఇప్ప‌టికే ప‌వ‌న్‌తో చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ని మ‌రో వాద‌న వినిపిస్తోంది. ప‌వ‌న్ ఓకే అంటాడా? లేదా అన్న‌ది ఆయ‌న నిర్ణ‌యంపైనే ఆధార‌ప‌డి వుంద‌ట. ఇదిలా వుంటే ప‌వ‌న్‌తో చాలా కాలంగా సినిమా చేయాల‌ని ఎదురుచూస్తున్న దిల్ రాజు మ‌ళ్లీప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టార‌ట‌. ఇప్ప‌టికే ప‌లు స్క్రిప్ట్ ల‌ని, ద‌ర్శ‌కుల‌ను ప‌వ‌న్ వ‌ద్ద‌కు పంపించార‌ని. అయితే ప‌వ‌న్ సంతృప్తి చెంద‌లేద‌ని, అన్నీ స‌వ్యంగా కుదిరితే ప‌వ‌న్ రీ ఎంట్రీ కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ లోనే వుంటుంద‌ని మెగా కాంపౌండ్ టాక్‌. వ‌దిన సురేఖ అంటే ప‌వ‌న్‌కు ఎంతో అభిమానం. అమ్మ కంటే ఎక్కువ ప్రేమాభిమానాలు ఉన్నాయి. ఆమె సినిమా చేయాల్సిందే అంటే ప‌వ‌న్ కు మ‌రో ఆప్ష‌న్ లేద‌ని చెప్పుకుంటున్నారు. అయితే రాజ‌కీయ కుట్ర‌ల కార‌ణంగా ప‌వ‌న్ సినిమాల్లోకి వ‌స్తే జ‌న‌సేన‌పై బుర‌ద జ‌ల్ల‌డం ఖాయం అన్న మీమాంస కొన‌సాగుతోంద‌న్న‌ చ‌ర్చా మెగాభిమానుల్లో సాగుతోంది.

Featured Posts

ఏపీలో భీభ‌త్సం సృష్టిస్తున్న నిజాముద్దీన్‌!

ఏపీలో నిజాముద్దీన్ భీభ‌త్సం సృష్టిస్తోంది. నిన్న‌ మొన్న‌టి వ‌ర‌కు తెలంగాణ కంటే చాలా త‌క్క‌వ పాజిటివ్ కేసులు న‌మోదైన ఏపీలో బుధ‌వారం ఒక్క‌సారిగా ప‌రిస్థితి మారిపోయింది. గురువారం ఒక్క‌రోజే ఏకంగా 21 పాజిటివ్...

All cardholders will get ration

Lambasting TDP party for playing cheap politics during the tough time of COVID 19 pandemic, Minister's for Civil Supplies Kodali Venkateswara Rao (Nani) emphasized...

జగన్‌ నిర్ణయానికి మద్దతిచ్చిన చంద్రబాబు!

ఉప్పు, నిప్పులా ఒకరిపై ఒకరు చిటపటలాడుతూ.. తీవ్ర విమర్శలు చేసుకునే అధికార, ప్రతిపక్ష నేతలు వారు. కానీ ఇప్పుడు ఒకరు తీసుకున్న కఠిన నిర్ణయానికి మరొకరు మద్దతుగా నిలిచారు. వందశాతం సమర్థించారు. పైగా...

Recent Posts

సీసీసీ నిధికి చేరిన 6 కోట్లు కార్మికుల అకౌంట్లోకి!

మెగాస్టార్ చిరంజీవి చైర్మ‌న్‌గా ఏర్పాటు చేసిన సీసీసీ (క‌రోనా క్రైసిస్ చారిటీ)కి ఇప్ప‌టి వ‌ర‌కు 6 కోట్ల‌కు మించి విరాళాలు అందాయి. చిరు, నాగ్‌, ప్ర‌భాస్‌, రామ్‌చ‌ర‌ణ్‌, మ‌హేష్‌, ఎన్టీఆర్‌, ద‌గ్గుబాటి ఫ్యామిలీ.....

రాజ‌మౌళి మ‌ళ్లీ దొరికిపోయాడా?

ద‌ర్శ‌క‌ధీర అంటూ జేజేలందుకుంటున్న రాజ‌మౌళి మ‌ళ్లీ దొరికిపోయాడా? అంటే అవున‌నే అంటున్నాయి టాలీవుడ్ వ‌ర్గాలు. జ‌క్క‌న్న తీస్తున్న `ఆర్ ఆర్ ఆర్‌` ఓ హాలీవుడ్ చిత్రానికి కాపీ అని తెలిసింది. `స్టూడెంట్ నెం.1`...

క‌రోనా సినిమాలు చూడొచ్చు క‌దా శేష్‌?

టైమ్ చూసి టైమ్ బాంబ్ లా ఏదో ఒక కొత్త‌ద‌నం ఉన్న సినిమాతో అభిమానుల ముందుకు రావ‌డం గూఢ‌చారి హీరో శేష్ ప్ర‌త్యేక‌త‌. ఇంత‌కుముందు గూఢ‌చారి అలాంటి సినిమానే. ఉన్న‌ట్టుండి ప‌రిమిత బ‌డ్జెట్...

ఇంట్లో క్వారంటైన్ అని చెప్పి కుర్ర‌హీరోతో బెడ్ రూమ్‌లో

క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని లాక్ డౌన్ చేసిన సంగ‌తి తెలిసిందే. అగ్ర రాజ్యం పేద రాజ్యం అనే తేడా లేకుండా అన్నిటినీ చుట్ట‌బెట్టేసింది. ఈ స‌మ‌యంలో సెల‌బ్రిటీ ప్ర‌పంచం.. సామాన్య ప్ర‌జ‌లు అనే...

ఏపీలో భీభ‌త్సం సృష్టిస్తున్న నిజాముద్దీన్‌!

ఏపీలో నిజాముద్దీన్ భీభ‌త్సం సృష్టిస్తోంది. నిన్న‌ మొన్న‌టి వ‌ర‌కు తెలంగాణ కంటే చాలా త‌క్క‌వ పాజిటివ్ కేసులు న‌మోదైన ఏపీలో బుధ‌వారం ఒక్క‌సారిగా ప‌రిస్థితి మారిపోయింది. గురువారం ఒక్క‌రోజే ఏకంగా 21 పాజిటివ్...

వైట్ల వ‌ర్సెస్ కోన‌: క‌త్తుల‌తో పొడుచుకునేంత లేదు కానీ!

దర్శ‌కుడు శ్రీనువైట్ల‌-రైట‌ర్ కొన వెంక‌ట్ జోడీ సూప‌ర్ స‌క్సెస్ ల గురించి తెలిసిందే. ఈ కాంబినేష‌న్ లో తెర‌కెక్కిన `ఢీ`..`రెడీ`.. `దూకుడు`..`బాద్ షా` బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాలు సాధించాయి. ఈ విజ‌యాల‌తోనే శ్రీ‌ను...

క‌రోనా సాయం: ద‌ర్శ‌క‌ధీరతో ఎవ‌రికీ ఏ ఉప‌యోగం లేదా?

క‌రోనా వైర‌స్ విజృంభ‌ణ నేప‌థ్యంలో టాలీవుడ్ నుంచి కేవ‌లం స్టార్ హీరోలు.. కొంత మంది చిన్న హీరోలు... డైరెక్ట‌ర్లు.. కొద్ది మంది సాంకేతిక నిపుణులు మాత్రమే విరాళాలిచ్చారు. కోట్లాది రూపాయ‌లు దండుకున్న ఏ...

హీరోల పెళ్లిళ్లే కాదు అంద‌రి పెళ్లిళ్లు వాయిదా!

పెళ్లి వేడుక అంటే సామూహికంగా జ‌రిగేది. బంధుమిత్రులు బంధాలు అనుబంధాలు అన్నిటికీ ఇదో వేదిక‌. అంతేకాదు ఇప్పుడున్న ప‌రిస్థితిలో పెళ్లి చేసుకోవ‌డం అంటే పెను ప్ర‌మాదంతో పెట్టుకున్న‌ట్టే. కోరి ముప్పు కొని తెచ్చుకున్న‌ట్టే....

ర‌చ్చకెక్కి హ‌ద్దులు దాటుతున్న మహేష్ ఫ్యాన్స్‌!

టాలీవుడ్‌లో ఒక హీరో సినిమా రిలీజ్ అవుతోంటే మ‌రో హీరో ఫ్యాన్స్ చేసే ర‌చ్చ ఈ మ‌ధ్య తారా స్థాయికి చేరుతోంది. ఈ సంక్రాంతికి ఇద్ద‌రు స్టార్ హీరోలు మ‌హేష్ నటించిన `సరిలేరు...

`పోకిరి` హాట్ గాళ్ ర‌చ్చ‌స్య ర‌చ్చ‌భ్య‌హ‌!

2006లో వ‌చ్చిన ఇండ‌స్ట్రీ బ్లాక్ బ‌స్ట‌ర్ `పోకిరి`. డ్యాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన ఈ చిత్రం మ‌హేష్ కెరీర్‌లోనే అత్యంత భారీ వ‌సూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమాతో టాలీవుడ్‌కి...