Home Entertainment Tollywood అక్టోబ‌ర్ 1న సవ్యసాచి టీజర్ విడుదల...

అక్టోబ‌ర్ 1న సవ్యసాచి టీజర్ విడుదల…

నాగ‌చైత‌న్య, నిధి అగ‌ర్వాల్ జంట‌గా చందూమొండేటి తెర‌కెక్కిస్తున్న సినిమా స‌వ్యసాచి. ఇప్ప‌టికే ఈ చిత్ర షూటింగ్ పూర్త‌యింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ లో బిజీగా ఉన్నారు చిత్ర‌యూనిట్. సినిమా చాలా అద్భుతంగా వ‌చ్చింద‌ని.. క‌చ్చితంగా ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తుంద‌ని ధీమాగా చెబుతున్నారు ద‌ర్శ‌కుడు చందూమొండేటి. ఈ చిత్ర టీజ‌ర్ అక్టోబ‌ర్ 1 ఉద‌యం 10 గంట‌ల‌కు విడుద‌ల చేయ‌బోతున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. నాగ‌చైత‌న్య ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌ని ఓ కొత్త జోన‌ర్ లో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు ద‌ర్శ‌కుడు చందూ. భార‌తంలో అర్జునుడికి ఉన్నట్లే.. స‌వ్య‌సాచిలో హీరోకు కూడా రెండు చేతుల‌కు స‌మాన‌మైన బ‌లం ఉంటుంది. అందుకే స‌వ్య‌సాచి టైటిల్ పెట్టారు. ఈ చిత్రంతోనే మాధ‌వ‌న్ తెలుగు ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అవుతున్నారు. భూమిక చావ్లా, వెన్నెల కిషోర్, స‌త్య, రావు ర‌మేష్ కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి యంయం కీర‌వాణి సంగీతం అందిస్తున్నారు. యువ‌రాజ్ సినిమాటోగ్ర‌ఫీ అందించారు. మైత్రి మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ పై న‌వీన్ యేర్నేని, వై ర‌విశంక‌ర్, మోహ‌న్ చెర‌కూరి(సివిఎం) నిర్మిస్తున్నారు. న‌వంబ‌ర్ లో స‌వ్య‌సాచి ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. 

 

న‌టీన‌టులు:

నాగ‌చైత‌న్య‌, నిధి అగ‌ర్వాల్, ఆర్ మాధ‌వ‌న్, భూమికా చావ్లా, వెన్నెల కిషోర్, స‌త్య, రావు ర‌మేష్, తాగుబోతు ర‌మేష్ త‌దిత‌రులు 

 

సాంకేతిక నిపుణులు:

క‌థ, మాట‌లు, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌కుడు: చ‌ందూ మొండేటి

నిర్మాత‌లు: న‌వీన్ యేర్నేని, ర‌విశంక‌ర్ వై, మోహ‌న్ చెరుకూరి(సివిఎం)

స‌హ నిర్మాత‌: ప‌్ర‌వీణ్ ఎం

లైన్ ప్రొడ్యూస‌ర్: పిటి గిరిధ‌ర్ రావు

కో డైరెక్ట‌ర్: చ‌ల‌సాని రామారావు

సిఈఓ: చిరంజీవి(చెర్రీ)

సంగీతం: ఎంఎం కీర‌వాణి

ఆర్ట్: రామ‌కృష్ణ‌

సినిమాటోగ్ర‌ఫీ: యువ‌రాజ్

ఎడిట‌ర్: కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు 

ఫైట్స్: రామ్ ల‌క్ష్మ‌ణ్

పిఆర్ఓ: వ‌ంశీ శేఖ‌ర్

 

 

Featured Posts

ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఎలా పని చేస్తాయి?

ప్రతీ శాఖకీ ఒక సెక్రటరీ ఉంటారు. ఆ శాఖకి మొత్తం బాధ్యత వారిదే. వీళ్ళకి రాజకీయాలతో పని లేదు. తమ తమ పరిధిలో వారి బాధ్యతలు వారు నిబద్ధతతో నిర్వర్తిస్తారు. అప్పుడప్పుడు రాజకీయ...

ఏపీలో భీభ‌త్సం సృష్టిస్తున్న నిజాముద్దీన్‌!

ఏపీలో నిజాముద్దీన్ భీభ‌త్సం సృష్టిస్తోంది. నిన్న‌ మొన్న‌టి వ‌ర‌కు తెలంగాణ కంటే చాలా త‌క్క‌వ పాజిటివ్ కేసులు న‌మోదైన ఏపీలో బుధ‌వారం ఒక్క‌సారిగా ప‌రిస్థితి మారిపోయింది. గురువారం ఒక్క‌రోజే ఏకంగా 21 పాజిటివ్...

జగన్‌ నిర్ణయానికి మద్దతిచ్చిన చంద్రబాబు!

ఉప్పు, నిప్పులా ఒకరిపై ఒకరు చిటపటలాడుతూ.. తీవ్ర విమర్శలు చేసుకునే అధికార, ప్రతిపక్ష నేతలు వారు. కానీ ఇప్పుడు ఒకరు తీసుకున్న కఠిన నిర్ణయానికి మరొకరు మద్దతుగా నిలిచారు. వందశాతం సమర్థించారు. పైగా...

Recent Posts

ఎక్క‌డి వాళ్లు అక్క‌డే..కానీ షార్ట్‌ఫిల్మ్ రెడీ!

ది గ్రేట్ పీపుల్ మేడ్ గ్రేట్ థింగ్స్ అన్న‌ట్టు భార‌తీయ తెర‌పై అద్భుతాలు సృష్టించిన వారంతా క‌లిసి `ఫ్యామిలీ` పేరుతో ఓ అద్భుతాన్ని సృష్టించారు. క‌రోనా వైర‌స్ కార‌ణంగా ప్ర‌పంచం వ‌ణికిపోతున్న వేళ...

మంచు మ‌నోజ్‌కి మండేలా చేసిందెవ‌రు?

క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోంది. ఏ దేశం గురించి విన్నా క‌రోనా మ‌ర‌ణ‌మృదంగ‌మే. దీని భారీ ఉంచి భ‌య‌ట‌ప‌డాలంటే నివార‌ణ ఒక్క‌టే మార్గ‌మ‌ని, అంతా ఇంటి ప‌ట్టునే వుండాల‌ని దేశాల‌న్నీ లాక్‌డౌన్‌ని ప్ర‌క‌టించాయి....

త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ ఇంట్లో విషాదం

ప్ర‌ముఖ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ మాతృమూర్తి కృష్ణ‌వేణి (94) సోమ‌వారం మృతి చెందారు. ఆమె గ‌త కొంత కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ తండ్రి త‌మ్మారెడ్డి కృష్ణ‌మూర్తి నిర్మాత కూడా....

ఆ ఇద్ద‌రికి అనిల్ రావిపూడి షాకిస్తున్నాడా?

`ఎఫ్‌2` బ్లాక్ బ‌స్ట‌ర్ అంటే ఇప్ప‌టికీ ఎవ‌రూ న‌మ్మ‌రు. సింపుల్ లైన్‌తో, జ‌బ‌ర్ద‌స్ట్ కామెడీ స్కిట్‌ల‌ని త‌ల‌పించే సీన్‌ల‌తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ని సొంతం చేసుకున్నాడు అనిల్ రావిపూడి. ఇది సినిమానేనా? అని...

కీర్తి పెళ్లి వార్త‌ల సృష్టిక‌ర్త దొరికిపోయాడు!

సావిత్ర జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కిన `మ‌హాన‌టి` చిత్రంతో హీరోయిన్ కీర్తి సురేష్ స్థాయే మారిపోయింది. ఈ సినిమాతో ఉత్త‌మ న‌టిగా జాతీయ పుర‌స్కారాన్ని సొంతం చేసుకున్న కీర్తి ప్ర‌స్తుతం వ‌రుస చిత్రాల్లో...

రాజీవ్ క‌న‌కాల కుటుంబంలో విషాదం

న‌ట‌డు రాజీవ్ క‌న‌కాల సోద‌రి...యాంక‌ర్ సుమ ఆడ‌ప‌డుచు శ్రీల‌క్ష్మి మృతి చెందారు. గ‌త‌కొంత కాలంగా క్యాన్స‌ర్ తో బాధ‌ప‌డుతోన్న ఆమె సోమ‌వారం ఓ ప్ర‌యివేటు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ క‌న్ను మూసారు. శ్రీల‌క్ష్మి...

అక్కినేని కోడ‌లిని..త్రిష‌ని కెలికిన శ్రీ‌రెడ్డి!

కాస్టింగ్ కౌచ్ వివాదంతో టాలీవుడ్‌లో సంచ‌ల‌నం సృష్టించింది శ్రీ‌రెడ్డి. `మా`లో శివాజీరాజా త‌నకు స‌భ్య‌త్వం ఇవ్వ‌లేదంటూ నానా హంగామా చేసి అర్థ‌న‌గ్న ప్ర‌ద‌ర్శ‌న‌తో దేశ వ్యాప్తంగా క‌ల‌క‌లం స‌ష్టించింది. అక్క‌డి నుంచి అదే...

మేము సైతం అంటూ మెగా స్ఫూర్తితో ల‌ఘుచిత్రం

క‌రోనా సాయానికి ఒక్కొక్క‌రు ఒక్కోలా ముందుకొస్తున్నారు. సెల‌బ్రిటీలంతా ఎంతో స్ఫూర్తివంతంగా త‌మ‌వంతు సాయం చేస్తున్నారు. జ‌నాల్ని అప్ర‌మ‌త్తం చేస్తున్నారు. ఈ విష‌యంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.. అటు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్...

క‌రోనా పాజిటివ్‌.. న‌టికి షాకిచ్చిన అధికారులు!

ఓ న‌టి అపార్ట్‌మెంట్‌లో కారోనా పాజిటివ్.. రంగంలోకి దిగిన అధికారులు అపార్ట‌మెంట్‌ని మూసివేసి షాకిచ్చారు. ముంబాయిలోని మ‌ల‌ద్ ప్రాంతంలో ఓ అపార్ట్‌మెంట్ వుంది. అందులో బుల్లితెర‌తో పాటు సినిమాల్లో న‌టించే అంకిత లోఖండేతో...

అయ్యో క‌రోనా ఇవేం బెడ్ రూమ్ రాస‌లీల‌లు!

క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారీ దెబ్బ‌కు ప్ర‌పంచం అల్ల‌క‌ల్లోల‌మ‌వుతోంది. ఈ మ‌హమ్మారిని త‌రిమి కోట్టాలంటే ఎవ‌రికి వారు వ్య‌క్తిగ‌తంగా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని ఓవైపు ప్ర‌భుత్వాలు హెచ్చ‌రిస్తున్నాయి. సామాజిక దూరం పాటించి క‌రోనాని త‌రిమి కొడ‌దాం...