Home Entertainment Tollywood `మా`లో గొడ‌వ‌ల‌ లొల్లి .. న‌రేష్ వ‌ర్సెస్ రాజ‌శేఖ‌ర్

`మా`లో గొడ‌వ‌ల‌ లొల్లి .. న‌రేష్ వ‌ర్సెస్ రాజ‌శేఖ‌ర్

మా అసోసియేష‌న్‌లో అస‌లేం జ‌రుగుతోంది?

మూవీ ఆర్టిస్టుల సంఘం(మా) లొల్లేంటి? ఎంతో హుందాగా ఉండాల్సిన సంఘం కాస్తా.. ఎందుక‌ని గొడ‌వ‌లు ఛీత్కారాల‌తో ద‌ద్ద‌రిల్లుతోంది? కొత్త అధ్య‌క్షుడు న‌రేష్‌ దుర‌హంకారం క‌మిటీని ఇబ్బంది పెడుతోందా? అత‌డికి జీవిత, రాజ‌శేఖ‌ర్ బృందం పూర్తి యంటీగా మారారా? ఇంత‌కీ న‌టి హేమ ఎటువైపు? ఇలాంటి సందేహాల‌న్నిటికీ తెలిసీ స‌మాధానం చెప్ప‌క‌పోయావో నీ బుర్ర వెయ్యి చెక్క‌ల‌వుతుంది విక్ర‌మార్కా..

విక్ర‌మార్కా నిజం చెప్పు

చెట్టు దిగిన విక్ర‌మార్కుడు ఏదీ దాచుకోకుండా ఇలా చెప్పాడు. మూవీ ఆర్టిస్టుల సంఘాన్ని చేజిక్కించుకునేందుకు గ‌త అధ్య‌క్షుడు శివాజీరాజాపై ర‌క‌ర‌కాల నిందారోప‌ణ‌లు చేసిన సీనియర్ న‌రేష్ మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు సాయంతో ఓట్ల రూపంలో అధికారాన్ని గుంజుకోగ‌లిగాడు. అయితే క‌మిటీలో ఇత‌ర స‌భ్యుల మెప్పు కానీ.. లేదా ఆర్టిస్టుల మెప్పు కానీ పొంద‌డంలో అత‌డు తీవ్రంగా విఫ‌ల‌మ‌య్యాడ‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఏడాది కాలంలో అత‌డు చేసిందేమీ లేద‌న్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. దాదాపు 900 మంది ఆర్టిస్టులు ఉన్న ఈ సంఘంలో అత‌డి వ‌ల్ల ఎవ‌రికీ ఏ లాభం లేద‌న్న చ‌ర్చా హీటెక్కిస్తోంది. దీంతో క‌మిటీ ఉపాధ్య‌క్షుడు- ట్రెజ‌ర‌ర్ స‌హా అంద‌రూ అధ్య‌క్షుడు న‌రేష్ కి షోకాజ్ నోటీస్ ఇచ్చేందుకు రెడీ అవుతుండ‌డం హాట్ టాపిక్ గా మారింది. హీరో రాజ‌శేఖ‌ర్ అధ్య‌క్షత‌న న‌రేష్ ప్ర‌త్య‌ర్థులంతా ఏక‌మై రివ‌ల్యూష‌న్ తీసుకువ‌స్తున్నార‌ని తెలుస్తోంది. అయితే ఈ ర‌హ‌స్య‌మంత‌నాల్లో ఏం మాట్లాడుకున్నారు? అన్న‌ది తెలియాల్సి ఉంది.

అధ్య‌క్షుడు న‌రేష్ కి షోకాజ్ ఎందుకు?

అస‌లు మా అధ్య‌క్షుడికి షోకాజ్ ఇచ్చేంత నేరం ఏం చేశాడు? అంటే.. అత‌డికి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రాజ‌శేఖ‌ర్ కి మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటోంది. జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ జీవిత రాజ‌శేఖ‌ర్ సైతం అధ్య‌క్షుడు అంటే మండి ప‌డిపోతోంద‌ట‌. ఇక వీళ్ల‌కు హేమ జ‌త క‌ల‌వ‌డంతో ఇంకేం ఉంది అగ్గి మీద గుగ్గిల‌మై అంతా ఏక‌మైపోయార‌ట‌. అయితే ఎవ‌రు ఏం చేసినా ఎంతో గౌర‌వ‌ప్ర‌దంగా ఇన్నేళ్ల పాటు కొన‌సాగిన సంఘం ప‌రువు తీయొద్దు రామ‌చంద్రా! అంటూ మొర పెట్టుకుంటున్నారు ఆర్టిస్టులు.

Recent Posts

వెంకీ స్టోరీ మాస్ రాజా ద‌గ్గ‌రికి!

ఒక హీరో కోసం అనుకున్న క‌థ అక్క‌డ వ‌ర్క‌వుట్ కాక‌పోతే వెంట‌నే మ‌రో హీరో ద‌గ్గ‌రికి వెళ్ల‌డం ఇండ‌స్ట్రీలో వెరీ కామ‌న్‌. అలా చేతులు మారిన క‌థ‌లు కొంత మందికి బ్లాక్ బ‌స్ట‌ర్‌ల‌ని,...

మ‌హేష్‌కు బాలీవుడ్ ఆఫ‌ర్‌?

`స‌రిలేరు నీకెవ్వ‌రు` బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌రువాత మ‌హేష్ ఫ్యామిలీతో క‌లిసి యుఎస్‌కి వెకేష‌న్‌కి వెళ్లిన విష‌యం తెలిసిందే. వంశీ పైడిప‌ల్లి చిత్రాన్ని ప‌క్క‌న పెట్టి మైత్రీ మూవీమేక‌ర్స్‌కి ఓ భారీ ఫ్యామిలీ...

బాల‌య్య కోసం రీమిక్స్ సాంగ్‌!

బాల‌కృష్ణ కెరీర్ ప‌రిస్థితి ప్ర‌స్తుతం ఏమీ బాగాలేదు. తండ్రి బ‌యోపిక్ అంటూ హ‌డావిడి చేసినా ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. పేరు మాట అటుంచితే ఎన్టీఆర్ బ‌యోపిక్ భారీ నష్టాల‌ని తెచ్చిపెట్టింది. దీని త‌రువాత చేసిన...

క్రిష్ క్రేజీ హీరోయిన్‌ని ఫిక్స్ చేశాడు!

రెండేళ్ల విరామం త‌రువాత ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ మ‌ళ్లీ వ‌రుస ప్రాజెక్ట్‌ల‌తో వేగం పెంచారు. దిల్ రాజుతో క‌లిసి బోనీ క‌పూర్ నిర్మిస్తున్న బాలీవుడ్ హిట్ ఫిల్మ్ `పింక్‌` రీమేక్‌లో న‌టిస్తున్నారు. ఈ మూవీ...

మ‌హేష్ అతిథి పాత్ర‌కు సై అనేసిన‌ట్టేనా?

చిరంజీవి హీరోగా కొర‌టాల శివ ఓ భారీ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. చిరు 152వ చిత్రంగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో న‌క్స‌లైట్ నేప‌థ్యాన్ని, దేవా దాయ శాఖ‌లో జ‌రిగిన ఓ కుంభ‌కోణాన్ని కొర‌టాల శివ...

ప్ర‌భాస్ – నాగ్ అశ్విన్ చిత్రం పాన్ ఇండియా కాదా?

వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్‌లో ప్ర‌భాస్ చేయ‌బోతున్న తాజా చిత్రాన్ని చిత్ర బృందం బుధ‌వారం ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. వైజ‌యంతీ మూవీస్ 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేప‌థ్యంలో అత్యంత భారీ స్థాయిలో ప్ర‌తిష్టాత్మ‌కంగా...

సీఎం జ‌గ‌న్‌తో టాలీవుడ్ నిర్మాత‌ల భేటి!

ఉన్న‌ట్టుండి ఏపీ సీఎంపై టాలీవుడ్ నిర్మాత‌ల‌కు ప్రేమ పుట్టుకొచ్చింది. తాడేప‌ల్లిగూడెంలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌తో ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు. దీని వెన‌క ఏదో పెద్ద మ‌త‌ల‌బే వుంద‌ని...

క్రేన్ ఘ‌ట‌న‌పై శంక‌ర్ షాకింగ్ ట్వీట్‌!

`ఇండియ‌న్‌-2` సినిమా షూటింగ్ జ‌రుగుతుండ‌గా 150 అడుగుల ఎత్తునుంచి లైటింగ్ కోసం ఏర్పాటు చేసిన క్రేన్ విరిగిప‌డ‌టంతో ఘోర ప్ర‌మాదం జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు సిబ్బంది అక్క‌డిక‌క్క‌డే మృతి...

జగన్ ప్రభుత్వానికి రాయిటర్స్ నేర్పిన పాఠం

తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మీడియాకు ఒక రాజకీయ మరియు వ్యాపార ఎజెండా ఉంది. ఈ రెండు కారణాలే కాకుండా 2000 దశకం తర్వాత నుండి కులం కూడా...

మీడియాను నియంత్రించాలా?

ఒక రాజకీయ విశ్లేషకుడిగా,  రచయితగా,  ప్రజాస్వామ్య ప్రేమికుడిగా మీడియాను నియంత్రించాలనుకునే ఆలోచనలను నేను తిరస్కరిస్తాను.  మీడియా అనేది ప్రజాస్వామ్యానికి ఆలంబన.  మీడియా అనేది మత్తేభాలలాంటి  ప్రభుత్వ దుర్విధానాలను అదుపులో ఉంచే పదునైన అంకుశం. ...

Featured Posts

జగన్ ప్రభుత్వానికి రాయిటర్స్ నేర్పిన పాఠం

తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మీడియాకు ఒక రాజకీయ మరియు వ్యాపార ఎజెండా ఉంది. ఈ రెండు కారణాలే కాకుండా 2000 దశకం తర్వాత నుండి కులం కూడా...

మీడియాను నియంత్రించాలా?

ఒక రాజకీయ విశ్లేషకుడిగా,  రచయితగా,  ప్రజాస్వామ్య ప్రేమికుడిగా మీడియాను నియంత్రించాలనుకునే ఆలోచనలను నేను తిరస్కరిస్తాను.  మీడియా అనేది ప్రజాస్వామ్యానికి ఆలంబన.  మీడియా అనేది మత్తేభాలలాంటి  ప్రభుత్వ దుర్విధానాలను అదుపులో ఉంచే పదునైన అంకుశం. ...

ఆంధ్ర ప్రదేశ్ లో ముఖ్యమంత్రికి ప్రధాన శత్రువు ఎవరు?

కారణాలు ఏవైనా కావచ్చు. కొన్ని వివాదాస్పద నిర్ణయాలు తీసుకొని వుండవచ్చు. అవి కాస్తా పక్కన బెడితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తొమ్మిది నెలల కాలంలో రాష్ట్రంలోని అన్ని ప్రతి పక్షాలు...