Home Entertainment Tollywood `శ్రీనివాస క‌ళ్యాణం` స‌క్సెస్‌పై కాన్ఫిడెంట్‌గా ఉన్నాం - దిల్‌రాజు 

`శ్రీనివాస క‌ళ్యాణం` స‌క్సెస్‌పై కాన్ఫిడెంట్‌గా ఉన్నాం – దిల్‌రాజు 

ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై యూత్‌స్టార్ నితిన్ హీరోగా రాశీ ఖ‌న్నా, నందితా శ్వేత హీరోయిన్స్‌గా.. నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ మూవీ డైరెక్ట‌ర్ స‌తీశ్ వేగేశ్న ద‌ర్శ‌క‌త్వంలో హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు, శిరీశ్‌, ల‌క్ష్మ‌ణ్ నిర్మించిన ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ `శ‌త‌మానం భ‌వ‌తి`. ఆగ‌స్ట్ 9న సినిమా ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. ఈ సంద‌ర్భంగా చిత్ర‌యూనిట్ స్పెష‌ల్ మూవీ ప్రీమియ‌ర్‌ను వీక్షించారు. అనంత‌రం …..

సినిమా చాలా బాగా వ‌చ్చింది.. ప్రేక్ష‌కుల రెస్పాన్స్ కోసం వెయిటింగ్ 

హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ – “స‌తీశ్ పాయింట్ చెప్పిన‌ప్పుడు … జ‌య‌సుధ‌గారు, నితిన్, ప్రకాశ్‌రాజ్‌గారు అంద‌రూ ఫోన్ చేసి క‌థ బావుంద‌ని చెప్పారు. శ‌త‌మానం భ‌వ‌తి త‌ర్వాత నేను, స‌తీశ్ చేసిన ట్రావెల్. సినిమా బావుంద‌ని అంద‌రూ చెబుతున్నారు. సినిమా చాలా బాగా వ‌చ్చింది. ప్రేక్ష‌కుల రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఈరోజు మేం ప‌డ్డ క‌ష్టానికి రేపు రాబోయే రిజ‌ల్ట్ గురించి ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నాం.అయితే సినిమా హిట్ అవుతుంద‌ని కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. ఈ సంద‌ర్బంలో క‌ళామందిర్ క‌ల్యాణ్‌గారి స‌పోర్ట్‌తో .. శ్రావ‌ణ మాసంలో పెళ్లి చేసుకోబోతున్న జంట‌ల‌కు మా శ్రీనివాస క‌ళ్యాణం టీమ్ ప‌ట్టు వ‌స్త్రాల‌ను అందించ‌బోతుంది.  మీ వెడ్డింగ్ కార్డ్ పంపిస్తే.. మేం ప‌ట్టు వ‌స్త్రాలు పంపిస్తున్నాం. కొన్ని సెల‌క్టెడ్ జంట‌ల‌కు మా యూనిట్ నేరుగా ప‌ట్టు వ‌స్త్రాల‌ను అందిస్తాం“ అన్నారు. 

 

నా కెరీర్‌లోనే టాప్ మూవీ

యూత్‌స్టార్ నితిన్ మాట్లాడుతూ – “నా కెరీర్‌లో టాప్ 5 సినిమాల్లో ఇదొక‌టి అవుతుంద‌ని ఆడియో ఫంక్ష‌న్ రోజు చెప్పాను. కానీ ఇప్పుడు సినిమా చూసిన త‌ర్వాత టాప్ వ‌న్ మూవీ అయ్యేలా ఉంద‌నిపిస్తుంది. సినిమా చూసిన త‌ర్వాత అంద‌రూ వారి జీవితాల‌ను క‌నెక్ట్ చేసుకుని ఆనంద బాష్పాలు రాల్చారు. సినిమా త‌ర్వాత దిల్‌రాజుగారికి మీ బ్యాన‌ర్‌లో బెస్ట్ హిట్ అవుతుంద‌ని చెప్పాను. ఈరోజు బ‌య్య‌ర్లు కూడా అదే చెబుతున్నారు. స‌తీశ్‌గారికి థాంక్స్‌“ అన్నారు. 

 

సినిమా విడుద‌ల త‌ర్వాత మాట్లాడుతా…

చిత్ర ద‌ర్శ‌కుడు స‌తీశ్ వేగేశ్న మాట్లాడుతూ – “సినిమా విడుద‌లైన త‌ర్వాత సినిమా గురించి.. అందులో న‌టించిన వారి గురించి మాట్లాడితే క‌రెక్ట్‌గా ఉంటుంద‌ని భావిస్తున్నాను“ అన్నారు. 

 

హీరోయిన్ రాశీ ఖ‌న్నా మాట్లాడుతూ – “సినిమా చూసిన త‌ర్వాత చాలా ఎమోష‌న‌ల్ అయిపోయాను. చిన్న‌పిల్ల‌లు నుండి పెద్ద వారి వర‌కు సినిమా న‌చ్చుతుంది. నా కెరీర్‌లో బెస్ట్ మూవీ అవుతుంది. ఇందులో భాగ‌మైనందుకు ఆనందంగా ఉంది. స‌తీశ్‌గారికి హ్యాట్సాఫ్‌. ఇది సినిమా కాదు. ఓ ఎక్స్‌పీరియెన్స్‌“ అన్నారు. 

 

హీరోయిన్ నందితా శ్వేత మాట్లాడుతూ – “సినిమాలో ప‌ద్మావ‌తి అనే క్యారెక్ట‌ర్ చేశాను. నా పేవ‌రేట్ క్యారెక్ట‌ర్‌. వ్య‌క్తిగ‌తంగా మ‌న పెళ్లి, సంప్ర‌దాయాలు గురించి తెలుసుకున్నాను. దిల్‌రాజు, శిరీశ్‌, ల‌క్ష్మ‌ణ్‌గారికి, స‌తీశ్‌గారికి థాంక్స్‌“ అన్నారు. 

 

స‌హ‌జ న‌టి జ‌య‌సుధ మాట్లాడుతూ – “పెళ్లి, మ‌న సంప్ర‌దాయాలు, బాంధ‌వ్యాల గురించి తెలియ‌జేసే సినిమా ఇది. చాలా ప్లెజెంట్‌గా సినిమా చేశాం. అంద‌మైన సినిమా ఇది. ఆగ‌స్ట్ 9న సినిమాను విడుద‌ల చేస్తున్నాం. మంచి సినిమాల‌ను నిర్మించే దిల్‌రాజుగారు మ‌రిన్ని మంచి సినిమాలు చేయాల‌ని కోరుకుంటున్నాను. ప్రేమ‌, బంధాలు, బాంధ‌వ్యాలు గురించి గొప్ప‌గా చూపించిన చిత్ర‌మిది. నితిన్ ఎక్స్‌ట్రార్డిన‌రీగా న‌టించారు. రాశీఖ‌న్నా, నందితా అంద‌రూ చ‌క్క‌గా నటించారు. డైరెక్ట‌ర్ స‌తీశ్‌గారు ఒక్కొక్క‌రికీ ఒక్కొక్క చ‌క్క‌టి స‌న్నివేశాన్ని క్రియేట్ చేశారు. ఇలాంటి సినిమాలో సినిమా న‌టించినందుకు గ‌ర్వంగా ఉంది“ అన్నారు. 

 

సితార మాట్లాడుతూ – “33 సంవ‌త్స‌రాలుగా నేను సినిమాలు చేస్తున్నాను. అయితే నా హృద‌యానికి ద‌గ్గ‌రైన సినిమాలు కొన్ని మాత్ర‌మే. అలాంటి సినిమాల్లో శ్రీనివాస కళ్యాణం ఒక‌టి. వండ‌ర్‌ఫుల్ మూవీ. సినిమా చూసిన పెళ్లికానీ వారు పెళ్లి చేసుకోవాల‌నే కోరిక పుడుతుంది. ఇలాంటి మంచి సినిమాలు చేసే అవ‌కాశాన్ని ఆ వేంక‌టేశ్వ‌రుడు  క‌ల్పించాల‌ని కోరుకుంటున్నాను. చాలా ఎమోష‌న్స్ ఉన్న సినిమా. ప్లెజెంట్‌గా ఉంటుంది. నితిన్ గ్రేట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. త‌న కెరీర్‌లో మంచి టర్నింగ్ పాయింట్ అవుతుంది. రాశీఖ‌న్నా, నందిత‌లు చ‌క్క‌గా న‌టించారు“ అన్నారు. 

 

సీనియ‌ర్ న‌రేశ్ మాట్లాడుతూ – “ఈవాళ పెళ్లి అనేది బిజినెస్ అయిపోయింది. కానీ పెళ్లి అంటే ఓ ప్ర‌మాణం అని చెప్పే ఏకైక దేశం భార‌త‌దేశం. మ‌న జీవితంలో ఓ గొప్ప మూమెంట్ పెళ్లి. అలాంటి పెళ్లిని ఇంత అందంగా చూపించిన చిత్ర‌మిది. ఏ సినిమాలో పెళ్లిని ఇంత గొప్ప‌గా చూపించ‌లేదు. తెలుగులో ఏ భాష‌లో తీసినా హిట్ అయ్యే సినిమా ఇది. లైఫ్ టైమ్ హిట్ అవుతుంది. మెముర‌బుల్ హిట్ అవుతుంది. నితిన్‌కి `అఆ`ని క్రాస్ చేసే సినిమా అవుతుంది. న‌టుడిగా ప‌ది మెట్టు నితిన్ పైకెదిగాడు. రాశీఖ‌న్నా అద్భుత‌మైన క్యారెక్ట‌ర్‌ను క‌మిట్‌మెంట్‌తో చేసింది. పాటల్లో తెలుగుద‌నంతో మిక్కీ మంచి సంగీతాన్ని అందించారు. సమీర్‌రెడ్డి ప్ర‌తి స‌న్నివేశాన్ని అద్భుతంగా విజువ‌లైజ్ చేశారు. దిల్‌రాజుగారితో నా సెకండ్ ఇన్నింగ్స్‌లో నాలుగో సినిమా చేస్తున్నాను. బొమ్మ‌రిల్లులా ఈ సినిమా గుర్తుండిపోతుంది. శ‌త‌మానం భ‌వ‌తి కానీ శ్రీనివాస‌క‌ళ్యాణం సినిమాల‌ను చూస్తే.. వినోదంతో పాటు టెక్నాల‌జీని క‌లిసి హ్యుమ‌న్ క‌నెక్ట్‌తో సినిమా చేసే ద‌ర్శ‌కుడు స‌తీశ్‌. మ‌రో నేష‌న‌ల్ అవార్డ్ వ‌స్తుంద‌నుకుంటున్నాను. కె.విశ్వ‌నాథ్‌గారితో త‌ర్వాత మ‌న క‌ల్చ‌ర్‌ను క‌లిపి సినిమాలు తీసే ద‌ర్శ‌కుడు స‌తీశ్ వేగేశ్న‌“ అన్నారు. 

 

Recent Post

స‌క్సెస్ కోసం అందాల రాక్ష‌సి శ్ర‌మిస్తోంది!

`అందాల రాక్ష‌సి` సినిమాతో పేరు తెచ్చుకున్నా లావ‌ణ్య త్రిపాఠికి రావాల్సిన క్రేజ్ ఇంకా ద‌క్క‌లేద‌నే చెప్పాలి. భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, సోగ్గాడే చిన్నినాయ‌నా. శ్రీ‌న‌స్తు శుభ‌మ‌స్తు, అర్జున్ సుర‌వ‌రం వంటి చిత్రాల్లో న‌టించినా...

మెగా హీరో కోసం రంగంలోకి దిల్‌రాజు – యువీ!

`చిత్ర‌ల‌హ‌రి` సినిమాతో మ‌ళ్లీ ట్రాక్‌లోకి వ‌చ్చాడు మెగా మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్‌తేజ్‌. ఇటీవ‌ల `ప్ర‌తీరోజు పండ‌గే` చిత్రంతో మ‌రో హిట్‌ని త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఈ రెండు చిత్రాలు అందించిన స‌క్సెస్ ఆనందంలో వున్న...

రానా కోసం నందిత వ‌చ్చేసింది!

`నీది నాది ఒకే క‌థ‌` ఫేమ్ వేణు ఊడుగుల తెర‌కెక్కిస్తున్న చిత్రం `విరాట‌ప‌ర్వం`. రానా, సాయి ప‌ల్ల‌వి హీరో హీరోయిన్‌లుగా న‌టిస్తున్నారు. ఉత్త‌ర తెలంగాణ‌లో పీపుల్స్ వార్ ఉద్య‌మానికి సంబంధించిన కీల‌క సంఘ‌ట‌న‌లు...

టాప్ లెస్‌గా పోజులిచ్చిన కియారా!

నెట్‌ఫ్లిక్స్ కోసం అనురాగ్ క‌శ్య‌ప్ రూపొందించిన వెబ్ సిరీస్ `ల‌స్ట్ స్టోరీస్‌`. ఇందులో ఓ భాగాన్ని క‌ర‌ణ్ జోహార్ రూపొందించాడు. మేఘాగా న‌టించిన కియారా అద్వానీ న న‌ట‌న‌తో దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం...

జ‌క్క‌న్నకు భారీ షాక్.. ఈ సారి మ‌రో లీక్‌!

రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న `ఆర్‌ ఆర్ ఆర్‌` రిలీజ్‌కు ముందే సోస‌ల్ మీడియ‌లో వైర‌ల్‌గా మారుతోంది. సినిమా మొద‌లైన ద‌గ్గ‌రి నుంచి ఈ చిత్రానికి సంబంధించి ఏదో ఒక‌టి లీక్ అవుతూనే వుంది. క్యారెక్ట‌ర్స్...

రూ 150 కోట్లు … అందుకే సిబిఐ వద్దన్నారా?

 "ఆంధ్ర ప్రదేశ్ లో ఒక ప్రముఖ వ్యక్తికి రూ 150 కోట్లు చెల్లించిన ఆధారాలు లభించాయి." "మూడు ప్రధాన కాంట్రాక్టు కంపెనీలు హవాలా ఏజెంట్లు, బ్రోకర్లతో నల్లధనాన్ని విదేశీ పెట్టుబడుల రూపంలో తెచ్చిన...

అమ్మ‌కానికి రామానాయుడు స్టూడియో?

అమ్మ‌కానికి రామానాయుడు స్టూడియో సిద్ధ‌మ‌వుతోంది. గ‌త కొన్ని ద‌శాబ్దాల పాటు రామానాయుడు హ‌యంలో ఓ వెలుగు వెలిగిన స్టూడియో ఇది. ఇక్క‌డ చిన్న సినిమాల నుంచి స్టార్స్ చిత్రాల వ‌ర‌కు ఓపెనింగ్‌లు జ‌రుపుకున్నాయి....

ఫ‌స్ట్‌నైట్ ప్లేస్ అంటూ శ్రీ‌రెడ్డి షాకింగ్ పోస్ట్!

శ్రీ‌రెడ్డి.. కాస్టింగ్ కౌచ్ వివాదంతో వెలుగులోకి వ‌చ్చిన పేరిది. త‌న‌కు `మా`లో స‌భ్య‌త్వం ఇవ్వ‌లేద‌ని వ‌ర్మ ఇచ్చిన ప్లాన్ ప్ర‌కారం ఇండస్ట్రీలో ర‌చ్చ‌కు తెర‌లేపి సెల‌బ్రిటీ అయిపోయింది. ప‌నిలో ప‌నిగా ముందు అనుకున్న...

CAA NPR NRC ముఖ్యమంత్రి మెడ మీద కత్తిలా వున్నాయా?

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం CAA (పౌర సత్వ సవరణచట్టాన్ని) తీవ్ర అభ్యంతరాల మధ్య చట్ట సభల్లో ఆమోదించింది. ఏదో విధంగా కాశ్మీర్ లో ఆర్టికల్ 370 ని నిర్వీర్యం చేసింది. సిఎఎని ఆధారం...

కేంద్రం హామీతో జోష్ లో ముఖ్యమంత్రి

వికేంద్రీకరణ సిఆర్డీఏ రద్దు బిల్లులకు శాసన మండలిలో బ్రేక్ పడటంతో ముఖ్యమంత్రి తానూహించినట్లు ముందుకు పోయే వీలు లేకుండా పోయింది. ఈ దశలో కేంద్రం సాయం లేనిదే బయట పడటం కుదరదని భావించే ముఖ్యమంత్రి...

Featured Posts

రూ 150 కోట్లు … అందుకే సిబిఐ వద్దన్నారా?

 "ఆంధ్ర ప్రదేశ్ లో ఒక ప్రముఖ వ్యక్తికి రూ 150 కోట్లు చెల్లించిన ఆధారాలు లభించాయి." "మూడు ప్రధాన కాంట్రాక్టు కంపెనీలు హవాలా ఏజెంట్లు, బ్రోకర్లతో నల్లధనాన్ని విదేశీ పెట్టుబడుల రూపంలో తెచ్చిన...

అదే విషం..అదే పైత్యం..అదే ఆక్రోశం

ఎప్పటిలాగే భేతాళుడు విక్రమార్కుడి భుజం పైకి ఎక్కినట్లు ఎప్పటిలాగే రాధాకృష్ణ ఈవారం కూడా తన ఆక్రోశాన్ని కక్కేసాడు.  కాకపొతే ఈసారి కొంచెం నిర్వేదం, కొంత అయోమయం, కొంత ఖేదం పొగలు కక్కాయి.  చంద్రబాబు...

వైసిపి- బిజెపి పొత్తు! ఒక్క రోజులోనే పలు యూ టర్న్ లు!

మంత్రి బొత్స సత్యనారాయణ సంచలనాలకు కేంద్ర బిందువుగా మారారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా చేరిన తర్వాత బహు బోల్డ్ గా తయారై ముఖ్యమంత్రికి ముందే ప్రభుత్వ విధానాలే కాకుండా పార్టీ పాలసీ...

ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన సఫలమా? విఫలమా?

రెండు రోజుల క్రితం ఒక సారి తిరిగి శుక్ర శనివారాలు రెండు రోజులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో మకాం బెట్టి ప్రధాన మంత్రిని హోం మంత్రిని న్యాయ శాఖ మంత్రిని కలసి...

జగన్ అమిత్ షా చర్చల ఎజెండా ఏమిటి?

దీర్ఘ విరామం తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలిశారు. వాస్తవంలో ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. ముఖ్యమంత్రులు ప్రధాన మంత్రిని తరచూ కలుసుకొంటూ వుంటారు. కాని ముఖ్యమంత్రి ప్రధానిని...