Home Entertainment Tollywood సైరా ట్రైల‌ర్‌పై కామ‌న్ ఆడియెన్ రెస్పాన్స్ ఇదీ

సైరా ట్రైల‌ర్‌పై కామ‌న్ ఆడియెన్ రెస్పాన్స్ ఇదీ

ట్రైల‌ర్ బ్లాక్ బ‌స్ట‌ర్ అంటూ కితాబు

చిరు అభిమానులు, సినీ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన `సైరా` ట్రైల‌ర్ రానే వ‌చ్చింది. చిరు కెరీర్‌లోనే అత్యంత భారీ బ‌డ్జెట్‌తో నాలుగు భాష‌ల్లో రిలీజ్ అవుతున్న సినిమా కావ‌డం, ఫ్రీడం ఫైట‌ర్ జీవిత‌క‌థ‌తో తెర‌పైకి వ‌స్తున్న సినిమా కావ‌డంతో ఈ చిత్రంపై స‌ర్వ‌త్రా భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.  రామ్‌చ‌ర‌ణ్ ఈ చిత్ర ట్రైల‌ర్‌ని మొత్తం వంద స్క్రీన్‌ల‌పై ఏక‌కాలంలో నాలుగు భాష‌ల్లో విడుద‌ల చేశారు. బుధ‌వారం భారీ స్థాయిలో విడుద‌లైన థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌తో సినిమా ఏ స్థాయిలో వుండ‌బోతోంది అన్న‌దానిపై చాలా వ‌ర‌కు క్లారిటీ వ‌చ్చింది.
 
థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌లో చిరంజీవి న‌ట‌న‌, రోమాంచిత‌మైన యాక్ష‌న్ ఘ‌ట్టాలు.. ఆ స‌న్నివేశాల్ని చిత్రీక‌రించిన తీరు, సంగీతం, ఆనాటి కాలాన్ని ప్ర‌తిబింబించే కాస్ట్యూమ్స్‌, పాత్ర‌ల వేష‌ధార‌ణ‌, క‌ళా ద‌ర్శ‌కుడి ప్ర‌తిభ‌, సినిమాకు అత్యంత కీల‌క‌మైన వీఎఫ్ ఎక్స్ ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి. రోమాంచిత స‌న్నివేశాలు, విజువ‌ల్ గ్రాండీయ‌ర్‌, పాన్ ఇండియా ప్రేక్ష‌కుల్ని ఆక‌ర్షించే పేరున్న భారీ స్టార్ కాస్ట్ `సైరా` ట్రైల‌ర్‌ని ఓ రేంజ్‌లో నిల‌బ‌డేలా చేశాయి. ట్రైల‌ర్ చూసిన నెటిజ‌న్స్ ఇచ్చిన రివ్వ్యూస్ `సైరా` ట్రైల‌ర్ ప్రేక్ష‌కుల‌ని ఏ స్థాయిలో ఆక‌ట్టుకుందో తెలియ‌జేస్తోంది. ఇప్ప‌టికే కోటి వ్యూస్ దిశ‌గా దూసుకుపోతోంది ట్రైల‌ర్.
 
`సైరా` ట్రైల‌ర్ అంచ‌నాల‌ని మ‌రింత‌గా పెంచేసింద‌ని, యాక్ష‌న్ స‌న్నివేశాల్ని చూస్తుంటే భారీ స్థాయిలో చిత్రాన్ని రూపొందించిన‌ట్టుగా అర్థ‌మ‌వుతోందని కొంత మంది ట్వీట్ చేస్తే మ‌రికొంత మంది మాత్రం మెగాస్టార్ చిరంజీవి స్థాయికి త‌గ్గ‌ట్టుగా వుంద‌ని, తెర‌పై చిరు ప్రెజెన్స్ అద్భుతంగా వుంద‌ని, భావోద్వేగాల్ని మ‌ళ్లీ త‌ట్టి లేపార‌ని, ఇది తెలుగు ప్రేక్ష‌కుల కోస‌మే తీసిన సినిమా కాద‌ని, గ్లోబ‌ల్ ఆడియ‌న్స్‌కు చెప్పాల్సిన ఓ యోధుడి క‌థ అని మెజారిటీ వ‌ర్గాలు అభిప్రాయం వ్య‌క్తం చేశారు. సైరా చిత్రం క‌చ్చితంగా బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలుస్తుంద‌ని, చిరు క‌నిపించిన స‌న్నివేశాలు రోమాంచితంగా వున్నాయ‌ని ఓవ‌రాల్‌గా  ట్రైల‌ర్ `సైరా` బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌గా నిల‌వ‌బోతోంద‌నే సంకేతాల్ని అందించింద‌ని ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు

Featured Posts

ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఎలా పని చేస్తాయి?

ప్రతీ శాఖకీ ఒక సెక్రటరీ ఉంటారు. ఆ శాఖకి మొత్తం బాధ్యత వారిదే. వీళ్ళకి రాజకీయాలతో పని లేదు. తమ తమ పరిధిలో వారి బాధ్యతలు వారు నిబద్ధతతో నిర్వర్తిస్తారు. అప్పుడప్పుడు రాజకీయ...

ఏపీలో భీభ‌త్సం సృష్టిస్తున్న నిజాముద్దీన్‌!

ఏపీలో నిజాముద్దీన్ భీభ‌త్సం సృష్టిస్తోంది. నిన్న‌ మొన్న‌టి వ‌ర‌కు తెలంగాణ కంటే చాలా త‌క్క‌వ పాజిటివ్ కేసులు న‌మోదైన ఏపీలో బుధ‌వారం ఒక్క‌సారిగా ప‌రిస్థితి మారిపోయింది. గురువారం ఒక్క‌రోజే ఏకంగా 21 పాజిటివ్...

జగన్‌ నిర్ణయానికి మద్దతిచ్చిన చంద్రబాబు!

ఉప్పు, నిప్పులా ఒకరిపై ఒకరు చిటపటలాడుతూ.. తీవ్ర విమర్శలు చేసుకునే అధికార, ప్రతిపక్ష నేతలు వారు. కానీ ఇప్పుడు ఒకరు తీసుకున్న కఠిన నిర్ణయానికి మరొకరు మద్దతుగా నిలిచారు. వందశాతం సమర్థించారు. పైగా...

Recent Posts

#క‌రోనా: స‌్టార్ హీరోల‌తో నిర్మాత‌ల అత్య‌వ‌స‌ర భేటీ?

లాక్ డౌన్ నేప‌థ్యంలో షూటింగ్‌లేవీ అనుకున్న స‌మ‌యంలో పూర్తికాలేదు. షూటింగులు సహా రిలీజ్ ల‌ షెడ్యూల్స్ త‌ల‌కిందులైపోయాయి. అయితే దీనివ‌ల్ల అంద‌రి కంటే ఎక్కువ‌గా న‌ష్ట‌పోయేది నిర్మాత‌లే. ఒక రోజు షూటింగ్ నిలిచిపోయిందంటేనే...

క‌రోనా: సాయంలో ఆ న‌లుగురు డ‌మ్మీయేనా?

తెలుగు ప్ర‌జ‌లు విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ఉన్న‌ప్పుడు ప్ర‌తిసారీ టాలీవుడ్ స్పందించే తీరు ప్ర‌శంస‌లు అందుకుంటూనే ఉంది. ఒక ర‌కంగా ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో విప‌త్తులు వ‌చ్చినా మ‌న స్టార్లు ఉదారంగా విరాళాలు అందిస్తూ...

లాక్ డౌన్ ఉల్లంఘించి పిల్ల‌ర్ ని గుద్దిన హీరోయిన్

దాదాపు దేశం మొత్తం లాక్ డౌన్ కొనసాగుతోంది. ఏప్రిల్ 14 వ‌ర‌కూ గుమ్మం దాట‌డానికి వీల్లేని స్థితి. ముఖ్యంగా మెట్రో పాలిట‌న్ సిటీల్లో లాక్ డౌన్ ప‌క్కాగా అమ‌ల‌వుతోంది. అయినా కొన్ని చోట్ల...

పృథ్వీరాజ్ ఫేస్ బుక్ పోస్ట్ వైర‌ల్‌!

క‌రోనా ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న వేళ మ‌ల‌యాళ న‌టుడు పృథ్వీరాజ్ సుకుమార‌న్ జోర్డాన్‌లో చిక్కుకున్న విష‌యం తెలిసిందే. `ఆడుజీవితం` సినిమా షూటింగ్ కోసం 58 మంది యూనిట్ స‌భ్యుల‌తో జోర్డాన్ వెళ్లిన ఈ చిత్ర...

షాకింగ్ ట్విస్ట్‌: స్వ‌లింగ సంప‌ర్కుడితో హీరోయిన్ ఎఫైర్

ఒక‌రిని ప్రేమించి.. కొన్నాళ్ల పాటు స‌హ‌జీవ‌నం చేసి.. అటుపై క‌ల‌త‌ల‌తో విడిపోతే.. అప్పుడు అత‌డిని హిజ్రా అంటూ అవ‌మానించ‌డం స‌రైన‌దేనా? అత‌డు హిజ్రా అయితే అది ముందే తెలుసు క‌దా? ఇంత‌కాలం ఎందుక‌ని...

ఆవిడ‌ అక్క అయితే.. ప్ర‌భాస్ బావ గారు!

డార్లింగ్ ప్ర‌భాస్ కి ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే. అమెరికాలోనూ అత‌డికి వీరాభిమానులున్నారు. ఇక‌పోతే మిర్చి ఫేం రిచా గంగ‌పోధ్యాయ ప్ర‌స్తుతం అమెరికాలోనే ఉంటోంది. మిర్చి..మిర‌ప‌కాయ్..భాయ్ లాంటి సినిమాల్లో న‌టించిన...

లాక్ డౌన్ లో హీరోని అప్ప‌డిగిన హీరోయిన్!

ఎంకి చావు సుబ్బికొచ్చిన‌ట్టుగా ఉంది మ‌రి. ప్ర‌పంచం దేశాలు లాక్ డౌన్ సీన్ తో తీవ్రంగా న‌ష్ట‌పోయాయి. దీంతో అన్ని బిజినెస్ లు క్లోజ్ అయ్యాయి. ముఖ్యంగా సినిమా వినోద ప‌రిశ్ర‌మ‌లు ఖ‌తం...

RRR రిలీజ్ పై దాన‌య్య కాన్ఫిడెన్స్ ఏంట‌బ్బా!

లాక్ డౌన్ నేప‌థ్యంలో ఇండియాస్ మోస్ట్  అవైటెడ్ మూవీ RRR రిలీజ్ పై నీలి నీడ‌లు క‌మ్ముకున్న సంగ‌తి తెలిసిందే. క‌రోనా వైర‌స్ వ్యాప్తి కార‌ణంగా తాత్కలికంగా షూటింగ్ లు అన్నీ బంద్...

ప‌వ‌న్ – క్రిష్ సినిమాకు టైటిల్ ఫిక్స‌యిన‌ట్టేనా?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ రెండేళ్ల విరామం త‌రువాత మ‌ళ్లీ కెమెరా ముందుకొచ్చారు. జ‌న‌సేన పార్టీ కార్య‌క్ర‌మాల్లో బిజీగా గ‌డిపేసిన ప‌వ‌న్ మ‌రోసారి అభిమానులు కోరిక మేర‌కు మ‌ళ్లీ ఫేస్‌కి మేక‌ప్ వేసుకున్నారు. బాలీవుడ్ హిట్...

ప్చ్‌..! లాక్ డౌన్ ఎత్తేసినా ఆ డ‌జ‌ను రిలీజ్ డౌటే!

లాక్ డౌన్ పంచ్ కి థియేట‌ర్లు బంద్ అవ్వ‌డంతో సినిమాల రిలీజ్ ల‌న్నీ వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఇత‌ర ప‌రిశ్ర‌మ‌ల్లానే వినోద‌ప‌రిశ్ర‌మ అల్ల‌క‌ల్లోలం అయ్యింది. ప్ర‌స్తుతం మార్చిలో రిలీజ్ కావాల్సిన సినిమాల‌న్నీ...