Home Entertainment Tollywood 2019 సీనియ‌ర్ హీరోల పై సినీ రౌండ‌ప్‌

2019 సీనియ‌ర్ హీరోల పై సినీ రౌండ‌ప్‌

టాలీవుడ్ లో ఎంత మంది హీరోలు వ‌చ్చినా కూడా ఈ న‌లుగురు సీనియ‌ర్ హీరోల హ‌వా మాత్రం ఎప్ప‌టికీ కొన‌సాగుతూనే ఉంది. చిరంజీవి, బాల‌కృష్ణ‌, నాగార్జున‌, వెంక‌టేష్ వీళ్ళ‌కు ఎక్క‌డా క్రేజ్ మాత్రం త‌గ్గ‌లేదు. ఎంత యంగ్ హీరోలు వ‌చ్చినా కూడా వాళ్ళ దారి వాళ్ళ‌దే వీళ్ళ దారి వీళ్ళ‌దే అన్న‌ట్లు హిట్లు కొడుతున్నారు. ముందుగా చిరంజీవి విష‌యానికి వ‌స్తే సైరా న‌ర్సింహారెడ్డి చిత్రం విష‌యానికి వ‌స్తే స్వ‌తంత్ర‌పోరాట యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర్సిహారెడ్డి చిత్రంలో న‌టించి మంచి విజ‌యం సాధించారు. ఇక ఈ చిత్రం క‌థ ప‌రంగా హిట్ అయినా కూడా క‌లెక్ష‌న్లు ప‌రంగా పెద్ద‌గా రాబ‌ట్టుకోలేక‌పోయింది. ఇక ఈ చిత్ర నిర్మాత రాంచ‌ర‌ణ్ కాస్త న‌ష్ట‌పోయినట్లే. అలాగే ఇందులో చిరంజీవి, జ‌గ‌ప‌తిబాబు పాత్ర‌ల‌కు మంచి పేరు వ‌చ్చింది. సినిమా మొత్తం మిక్స్‌డ్ టాక్‌లో న‌డిచింది. అంటే ఎక్కువ‌గా క్లాస్ ప్రేక్ష‌కులు దీన్ని ఆద‌రించారు కాని మాస్ ఆడియ‌న్స్‌లోకి సినిమా పెద్ద‌గా వెళ్ల‌లేక‌పోయింద‌నే చెప్పాలి. ఈ చిత్రం ఒకేసారి అన్ని భాష‌ల్లో విడుద‌లైన తెలుగులో మాత్రమే హిట్ అనిపించుకుంది. మిగిలిన అన్ని భాష‌ల్లోనూ ఫ్లాప్ టాక్‌నే మిగిల్చింది.

బాల‌కృష్ణ‌కు చేదు అనుభ‌వం ఎదుర‌యింద‌నే చెప్పాలి. ఆయ‌న ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన త‌న తండ్రి బ‌యోపిక్ క‌థానాయ‌కుడు, మ‌హానాయ‌కుడు ఘోర ప‌రాజ‌యాల‌య్యాయ‌న్న విష‌యం తెలిసిందే. ఇక ప్ర‌స్తుతం ఆయ‌న రూల‌ర్‌తో కె.ఎస్‌. రాధా కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఈ నెల 20 న ప్రేక్ష‌కుల ముందుకు రానున్నారు. అలాగే బోయ‌పాటి కాంబినేష‌న్‌లో మ‌రో చిత్రం ఈ మ‌ధ్య‌నే ప్రారంభ‌మ‌యింది. మ‌రి ఈ రెండు చిత్రాల‌తో బాల‌య్య ప్రేక్ష‌కుల‌ను ఏ విధంగా ఆక‌ట్టుకుంటారో వేచి చూడాలి. ఇక‌పోతే ఈ మ‌ధ్య కాలంలో బాల‌య్య‌కు హిట్టు లేద‌నే చెప్పాలి. మ‌రి ఈ రెండు చిత్రాలైనా క‌నీసం బాల‌య్య‌కు ఊర‌ట‌నిస్తాయో లేదో. రాజ‌కీయంగా మాత్రం హిందూపురం నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచాడు.. పార్టీ ఓడినా బాల‌య్య గెల‌వడం అనేది మాత్రం ఆయ‌న‌కు కాస్త ఊర‌ట క‌లిగించింద‌నే చెప్పాలి.

ఇక విక్ట‌రీ వెంక‌టేష్ విష‌యానికి వ‌స్తే ఎఫ్‌2 సూప‌ర్ డూప‌ర్ హిట్ కొట్టింది. ఇక ఇటీవ‌లె త‌న మేన‌ల్లుడు నాగ‌చైత‌న్య‌తో క‌లిసి న‌టించిన వెంకీమామ చిత్రం మిక్స‌డ్ టాక్ వ‌చ్చినా వ‌సూళ్ళ ప‌రంగా ప‌ర్వాలేద‌నిపించుకుంది. ఇక ఈ సంవ‌త్స‌రంలో ఆయ‌న ఇద్ద‌రు హీరోల‌తో క‌లిసి మ‌ల్టీస్టార‌ర్ చేయ‌డం ప్ర‌శంస‌నీయం అనే చెప్పాలి. ఇక‌పోతే దాదాపు పెద్ద హీరోలు ఎవ్వ‌రూ కూడా మ‌ల్టీ స్టార‌ర్ చెయ్య‌డానికి పెద్ద‌గా ఇష్ట‌ప‌డ‌రు కానీ వెంక‌టేష్ అలాంటి విష‌యాల‌ను పెద్ద‌గా ప‌ట్టించుకోర‌నే చెప్పాలి. అలా మ‌ల్టీస్టార‌ర్‌లో చేసి కూడా హిట్ కొట్ట‌డం అలాగే త‌న పాత్ర‌కు మంచి గుర్తింపు రావ‌డం అనేది చాలా గ్రేట్ అనే చెప్పాలి.

ఇక ఈ సంవ‌త్స‌రం నాగార్జున‌కి చేదు అనుభ‌వం అనే చ‌ప్పాలి. ఆయ‌న న‌టించిన మ‌న్మ‌థుడు 2 చిత్రం పెద్ద డిజాస్ట‌ర్ అయింది. ఆయ‌న ఈ ఏజ్ లో మ‌రీ అంత రొమాంటిక్ చిత్రం చేయ‌డం సినిమాలో అన్నీ డ‌బుల్ మీనింగ్ డైలాగులు ఎక్కువ‌వ‌డంతో ఒక‌ర‌కంగా చ‌ప్పాలంటే ఆ సినిమాతో నాగ్ పరువంతా పోయింద‌నే చెప్పాలి. బిగ్‌బాస్ షోకి హోస్ట్‌గా చేశారు కానీ అనుకున్నంత పేరు మాత్రం రాలేదు. ప్ర‌స్తుతం హిందీలో బ్ర‌హ్మాస్త్ర మూవీతో బిజీగా ఉన్నారు.

Recent Post

శాసనమండలి రద్దు తొందరపాటు నిర్ణయమా?  

పుష్కరం క్రితం నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చేతులమీదుగా పునరుద్ధరించబడిన శాసనమండలి నేడు ఆయన కుమారుడి చేతులమీదుగా ఉనికిని కోల్పోవడం యాదృచ్చికం కావచ్చు.  దేశంలో ఇరవై రెండు రాష్ట్రాలు ఉంటె, కేవలం...

అమరావతి నిజంగా “కమ్మరావతి” అవకుండా పోతుందా?

భోగిమంటల్లో కాలిన నివేదికలే గొప్ప అమరావతి చారిత్రక నగరం. శాతవాహనుల నగరం. బౌద్దుల నగరం. అవన్నీ నిజమే. కానీ చంద్రబాబు ప్రభుత్వం నామకరణం చేసిన "అమరావతి"లో ఆ చారిత్రక నగరం ఉందా? ఈ...

వైఎస్ వివేకా డెత్ మిస్టరీ వీడేదెప్పుడు ?

మాజీ మంత్రి వై ఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురయిన విషయం తెలిసిందే. 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందే అయన పై హత్యాయత్నం జరగడం సంచలనం రేపింది. ఎంపీ గా ,...

అమ్మఒడి పేరుతొ దోచుకుంటున్నారు

అమ్మఒడి పేరుతొ నిరుపేదలను దోచుకుంటున్నారు అంటూ మండి పడుతున్నారు టిడిపి నేత చంద్రబాబు నాయుడు. ఆంధ్ర ప్రదేశ్ లో నిరుపేద కుటుంబాల వారు తమ పిల్లలను స్కూల్ కు పంపించేందుకు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన...

ప‌వ‌న్ కోసం బాలీవుడ్ హీరోయిన్‌?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ `పింక్‌` తెలుగు రీమేక్‌తో రెండేళ్ల విరామం తరువాత మ‌ళ్లీ కెమెరా ముందుకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. దిల్‌రాజు, బోనీక‌పూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా రాకెట్ స్పీడుతో షూటింగ్ జ‌రుపుకుంటోంది....

Featured Posts

అమరావతి నిజంగా “కమ్మరావతి” అవకుండా పోతుందా?

భోగిమంటల్లో కాలిన నివేదికలే గొప్ప అమరావతి చారిత్రక నగరం. శాతవాహనుల నగరం. బౌద్దుల నగరం. అవన్నీ నిజమే. కానీ చంద్రబాబు ప్రభుత్వం నామకరణం చేసిన "అమరావతి"లో ఆ చారిత్రక నగరం ఉందా? ఈ...

బిగ్ బ్రేకింగ్‌: గాయ‌ప‌డిన‌ ర‌జ‌నీకాంత్‌

త‌లైవా ర‌జ‌నీకాంత్ గాయ‌ప‌డ్డారు. ఓ డాక్యుమెంట‌రీ షూటింగ్ కోసం మైసూర్‌లోని బండీపూర్ అడ‌వుల‌కు వెళ్లిన ఆయ‌న అదుపు త‌ప్పి కింద‌ప‌డిపోవ‌డంతో స్వ‌ల్ప‌గాయాలైన‌ట్టు తెలుస్తోంది. గ‌త ఏడాది భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీలో డిస్క‌వ‌రీ...

రామ్‌చ‌ర‌ణ్ బ్రిటీష్ అధికారిగానా ఇదేం ట్విస్ట్‌?

`బాహుబ‌లి` విజ‌యంతో తెలుగు సినిమా స్వ‌రూప‌మే ప్రంచ య‌వ‌నిక‌పై స‌మూలంగా మారిపోయింది. టాలీవుడ్‌లో భారీ సినిమా వ‌స్తోందంటే దేశ వ్య‌ప్తంగా అటెన్ష‌న్ క్రియేట్ అవుతోంది. తాజాగా జ‌క్క‌న్న రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న`ఆర్ ఆర్ ఆర్‌`పై...

`వీ` పోస్ట‌ర్ టాక్‌: దేనిని క‌త్తిరించేశాడో ఏమిటో!

నేచుర‌ల్ స్టార్ నాని న‌టిస్తున్న 25వ‌ చిత్రం `వీ`. ఇంద్ర‌గంటి మోహ‌న కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో నాని రెండు విభిన్న పాత్ర‌లు పోషిస్తున్నాడు. ఒక పాత్ర‌లో విల‌న్ గా...

శాసన మండలి రద్దుతో వైసిపికి ప్లస్సెంత? మైనస్సైంత?

  అందరూ ఊహించినట్లుగానే శాసన మండలి రద్దు చేస్తూ శాసన సభలో తీర్మానం చేశారు.ఇక కేంద్రంలో ఉభయ సభలు ఆమోదించిన తదుపరి రాష్ట్ర పతికి వెళ్లి ఆమోద ముద్ర పడితే అంతటితో మండలి కథ...