Home Entertainment Tollywood 2019లో ఈ హీరోల‌కు ఫ్లాపులు లేవా...?

2019లో ఈ హీరోల‌కు ఫ్లాపులు లేవా…?

టాలీవుడ్ అయినా బాలీవుడ్ అయినా జ‌యాప‌జ‌యాలు అనేవి కామ‌న్‌. అయితే వాటిలో కొన్ని ఫ్లాపులు వ‌చ్చిన‌ప్పుడు మాత్రం హీరోలు మ‌ళ్ళీ దాని నుంచి బ‌య‌ట‌ప‌డ‌డానికి కాస్త ఎక్కువ స‌మ‌య‌మే ప‌డుతుంది. ఇక కొందరు హీరోలకు 2019 బాగా కలిసొచ్చింది. ఎప్పట్నుంచో వేధిస్తున్న ఫ్లాపుల నుంచి వాళ్లు బయటపడ్డ హీరోలు ఈ సంవ‌త్స‌రంలో ఎక్కువే ఉన్నార‌ని చెప్ప‌వ‌చ్చు. ఈ ఏడాది వాళ్లు నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు సాధించాయి. ఇందులో అందరికంటే ముందున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. ఈయన ఐదేళ్ల నిరీక్షణ తర్వాత `రాక్షసుడు` సినిమాతో విజయం సాధించాడు. ఈ చిత్రానికి తొలిరోజే టాక్ అద్భుతంగా రావడంతో మంచి వసూళ్లే రాబట్టింది. చివరికి అమ్మిన దానికంటే రెండు కోట్లు ఎక్కువే తీసుకొచ్చి లాభాలు రాబట్టింది. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్.

 

ఇక నేను శైలజ తర్వాత రామ్ ఎన్నో చిత్రాల్లో న‌టించారు కానీ స‌రైన హిట్ మాత్రం రాలేదు. రామ్.. 2019లో `ఇస్మార్ట్ శంకర్‌`తో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. పూరీ తెరకెక్కించిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. ఇప్పటికే 75 కోట్ల గ్రాస్.. 38 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. సాయి ధరమ్ తేజ్ తన పేరు మార్చుకుని హిట్ కొట్టాడు. `సుప్రీమ్` తర్వాత అరడజన్ ఫ్లాపులు ఇచ్చిన ఈ హీరో.. ధరమ్ పీకేసి సాయి తేజ్ అంటూ వచ్చిన `చిత్రలహరి` సినిమాతో విజయం అందుకున్నాడు. ఈ సినిమాతో పాటు ఇప్పుడు వచ్చిన `ప్రతిరోజూ పండగే` సినిమా కూడా మంచి విజయమే సాధించింది. ఈ చిత్రం నాలుగు రోజుల్లోనే ఏకంగా 14 కోట్ల షేర్ వసూలు చేసింది.

 

నాగచైతన్య కూడా చాలా ఏళ్ళ తర్వాత బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. `రారండోయ్ వేడుక చూద్దాం` తర్వాత చేసిన `యుద్ధం శరణం`, `సవ్యసాచి` సినిమాలు ఫ్లాప్ అవ్వ‌గా… `శైలజా రెడ్డి అల్లుడు`, ప‌ర్వాలేద‌నిపించుకుంది. ఈ ఏడాది మజిలీ సినిమాతో హిట్ కొట్టాడు చైతూ. ఈ సినిమా దాదాపు 35 కోట్ల వరకు షేర్ వసూలు చేసింది. ఈ సినిమాతో పాటు వెంకీ మామ కూడా మంచి విజయమే సాధించింది. ఈ చిత్రం కూడా 32 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. కళ్యాణ్ రామ్ కూడా ఈ ఏడాది హిట్ కొట్టాడు. ఈయన నటించిన `118` సినిమా మంచి విజయం అందుకుంది. 10 కోట్ల బిజినెస్ చేసిన ఈ చిత్రం 11 కోట్లు వసూలు చేసిన‌ట్లు స‌మాచారం.

 

ఇక వెంకటేష్ కూడా 2019లో రెండు విజయాలు అందుకున్నాడు. ఒక‌టి అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన `ఎఫ్‌2` చిత్ర‌మ‌యితే మ‌రొక‌టి ఇటీవ‌లె విడుద‌లైన బాబి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం `వెంకీ మామా`తో విజయాలు అందుకున్నాడు. ఈ రెండు చిత్రాలూ నిర్మాతలకు లాభాలు తీసుకొచ్చాయి. నాని కూడా రెండు ఫ్లాపుల తర్వాత 2019లో విజయం అందుకున్నాడు. కృష్ణార్జున యుద్ధం, దేవదాస్ తర్వాత ఈ ఏడాది నటించిన `జెర్సీ` సినిమాతో విమర్శకుల ప్రశంసలతో పాటు విజయం కూడా అందుకున్నాడు. కానీ `గ్యాంగ్ లీడర్` సినిమాతో దారుణంగా నిరాశ పరిచాడు న్యాచురల్ స్టార్. మొత్తానికి ఈ ఏడాది కుర్ర హీరోలతో పాటు సీనియర్లు కూడా పోటీప‌డి ఫ్లాప్‌ల నుంచి బ‌య‌ట‌ప‌డి హిట్లు కొట్టారు. మొత్తానికి ఈ 2019 సినిమావాళ్ళ‌కు బాగానే క‌లిసొచ్చింద‌ని చెప్ప‌వ‌చ్చు.

Recent Posts

ఇంటికొచ్చి ఇస్తా అన్న ఆ — ఎక్కడ?

కోవిడ్-19 విజృంభనతో దేశం మొత్తం లాక్ డౌన్ అయిపోయింది. ఈ సమయంలో ప్రజలకు ఇబ్బందులు రాకుండా నిత్యావసరాలు, అలాగే రేషన్ వంటి వాటిని అందించేందుకు తమ వంతుగా ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్...

ఆ మాజీ ఎమ్మెల్యే రాజకీయ భవిష్యత్తు ముగినట్టేనా?

దశాబ్దాలుగా కమ్యూనిస్టులకు కోటలుగా ఉన్న ప్రాంతాలు ఇప్పుడు కనుమరుగవుతున్నాయి. మూస సిద్ధాంతాలతో మసకబారుతున్నాయి. మచ్చలేని ప్రజా నాయకులుగా వెలిగిన వారు.. పలుమార్లు ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచిన వారు.. ఇప్పుడు ఆర్థిక స్థోమత లేక...

సబ్బం హరి ఆ పని చేయడం వల్లే జగన్‌ దూరం పెట్టారా?

మంచి మాటకారిగా పేరు తెచ్చుకున్న మాజీ ఎంపీ సబ్బం హరి మాటలు.. ఇప్పుడు టీడీపీ అనుకూల మీడియాకు మంచి సరుకుగా, జగన్‌పై విమర్శలు సంధించేందుకు అస్త్రాలుగా మారుతున్నాయి. సమయం, సందర్బం అంటూ ఏదీ...

హాట్ యాంక‌ర్‌కి మెగా ఆఫ‌ర్‌!

హాట్ యాంక‌ర్ రంగ‌మ్మ‌త్త అన‌సూయ‌కు మ‌రో మెగా ఆఫ‌ర్ త‌గిలిన‌ట్టు తెలిసింది. `రంగ‌స్థ‌లం`లో రంగ‌మ్మ‌త్త‌గా గోల్డెన్ ఛాన్స్ కొట్టేసి ఓ ద‌శ‌లో రామ్‌చ‌ర‌ణ్‌నే డామినేట్ చేసిన అన‌సూయ‌కు ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిత్రంలో...

పుట్టిన రోజు లేదు .. పెళ్లీ కూడా వాయిదా!

ప్ర‌పంచం క‌రోనా వైర‌స్ కార‌ణంగా అల్ల క‌ల్లోలం అవుతోంది. ఎక్క‌డ చూసినా క‌రోనా మ‌ర‌ణాలే. దేశం క‌రోనా కార‌ణంగా భ‌యంతో కంపించిపోతోంది. ఈ ప‌రిస్థితుల్లో ముఖ్య‌మైన కార్య‌క్రమాల‌న్నింటినీ జ‌నం వాయిదా వేసుకుంటున్నారు. కొన్నింటిని...

`ఉప్పెన‌`కు క‌త్తెరేస్తున్న ద‌ర్శ‌కుడు!

సాయిధ‌ర‌మ్‌తేజ్ త‌మ్ముడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం `ఉప్పెన‌`. మైత్రీ మూవీమేక‌ర్స్‌తో క‌లిసి సుకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఆయ‌న శిష్యుడు బుచ్చిబాబు ఈ చిత్రం ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం...

అల్లు అర్జున్ ప్లాన్‌కి క‌రోనా దెబ్బ‌!

2020... ఈ ఇయ‌ర్ హీరో అల్లు అర్జున్‌కు.. క‌రోనా వైర‌స్‌కు చాలా స్పెష‌ల్ ఇయ‌ర్‌. మాన‌వాళికి మాత్రం కాళ‌రాత్రుల్ని ప‌రిచ‌యం చేస్తున్న ఇయ‌ర్. ఈ ఏడాది అల్లు అర్జున్ `అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రంతో...

తెలంగాణలో కరోనా తొలి మరణం వెనుక భయానక వాస్తవాలు!

తెలంగాణలో కోవిడ్-19 తొలి మరణం నమోదైంది. నాంపల్లికి చెందిన 74 ఏళ్ల వృద్ధుడు మరణించిన అనంతరం.. చేసిన పరీక్షల్లో అతనికి కరోనా పాజిటివ్ అని తేలింది. పెద్ద వయసు కాబట్టి కరోనా వైరస్‌...

బీటలు వారుతోన్న తెలుగు దేశం పునాదులు..

తెలుగు దేశం పార్టీ.. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కాదు, దేశ రాజకీయాల్లో ఓ నూతన ఓరవడికి శ్రీకారం చుట్టిన ప్రాంతీయ కెరటం. తెలుగువారి 'ఆత్మగౌరవ' నినాదంతో 1982 మార్చి 9న విశ్వవిఖ్యాత నటుడు నందమూరి...

కరోనా విపత్తులో కూడా కరకట్ట రాజకీయం చేస్తున్న రాధాకృష్ణ!

సాధారణంగా మామూలు ప్రజలకు ఉగాది, శ్రీరామనవమి, దసరా, దీపావళి లాంటివి పండుగలు.  కానీ, క్షుద్రజ్యోతి రాధాకృష్ణకు మాత్రం కరోనా అనే ఒక మహమ్మారి అతి పెద్ద పండుగ.  అందులోనూ తన యజమానికి బద్ధశత్రువు...

Featured Posts

కరోనా విపత్తులో కూడా కరకట్ట రాజకీయం చేస్తున్న రాధాకృష్ణ!

సాధారణంగా మామూలు ప్రజలకు ఉగాది, శ్రీరామనవమి, దసరా, దీపావళి లాంటివి పండుగలు.  కానీ, క్షుద్రజ్యోతి రాధాకృష్ణకు మాత్రం కరోనా అనే ఒక మహమ్మారి అతి పెద్ద పండుగ.  అందులోనూ తన యజమానికి బద్ధశత్రువు...

జగన్‌ నిర్ణయానికి మద్దతిచ్చిన చంద్రబాబు!

ఉప్పు, నిప్పులా ఒకరిపై ఒకరు చిటపటలాడుతూ.. తీవ్ర విమర్శలు చేసుకునే అధికార, ప్రతిపక్ష నేతలు వారు. కానీ ఇప్పుడు ఒకరు తీసుకున్న కఠిన నిర్ణయానికి మరొకరు మద్దతుగా నిలిచారు. వందశాతం సమర్థించారు. పైగా...

వీరికి  లాక్ డౌన్ వర్తించదా?

 ప్రపంచంలోని నూట తొంభై అయిదు దేశాలను గడగడలాడిస్తూ, ఇప్పటివరకు పద్దెనిమిది వేలమంది ప్రాణాలను తీసి, లక్షలాదిమందికి ఆసుపత్రుల పాలు చేసిన భయంకరమైన కరోనా వైరస్ (కోవిద్ 19 ) ఆ రెండుమూడు గ్రామాల...