Home Entertainment Tollywood స‌న్నీని చూస్తుంటే... కుర్రాళ్ళ‌కు నిద్ర‌ప‌ట్ట‌ట్లేదు

స‌న్నీని చూస్తుంటే… కుర్రాళ్ళ‌కు నిద్ర‌ప‌ట్ట‌ట్లేదు

స‌న్నీలియోన్ ఈ పేరు వింటే చాలు కుర్రాళ్ళ గుండెల్లో రైళ్ళు ప‌రుగెడ‌తాయి. ఈ ఒక్క పేరు చాలు బాక్సాఫీస్ షేక్ అయిపోవ‌డానికి. సినిమా ఎలా ఉంద‌నే మాట‌తో వాళ్ల‌కు ప‌నిలేదు.. స‌న్నీ సినిమా అంటే ఎలా ఉన్నా కూడా నిర్మాత‌ల‌కు వ‌ర్క‌వుట్ అవుతుందంతే. అదే ఆమెలో ఉన్న ప్ర‌త్యేక‌త‌. స‌న్నీ కోస‌మే సినిమాకు వెళ్లే ఆడియ‌న్స్ ల‌క్ష‌ల్లో ఉంటారు. అందుకే ఎన్ని ఫ్లాపులు వ‌చ్చినా కూడా స‌న్నీలియోన్ క్రేజ్ మాత్రం ఎప్పుడూ అలాగే ఉంటుంది. ఇక ఈమెను తెలుగు ఇండ‌స్ట్రీకి తీసుకురావ‌డానికి.. ఇక్క‌డ ఆమెతో సినిమాలు చేయ‌డానికి మ‌న ద‌ర్శ‌క నిర్మాత‌లు కూడా బాగానే ప్ర‌య‌త్నిస్తున్నారు.

ఇక ఇదిలా ఉంటే ఇటీవ‌లె స‌న్నీ హ‌ల్లో జీ అంటూ ఓ ఐటెమ్ సాంగ్‌తో కుర్రాళ్ళ మ‌తిపోగొడుతుంది. సన్నీ ప్రధాన పాత్రలో ‘రాగిని ఎంఎంఎస్ రిటర్న్స్ సీజన్ 2’ అనే వెబ్‌సిరీస్ తెరకెక్కుతోంది. ప్రముఖ బాలీవుడ్ గాయని కనికా కపూర్ ఈ పాటను పాడారు. ఈ పాట వీడియోను తాజాగా విడుదల చేశారు. ఏఎల్‌టీ బాలాజీ సంస్థ బ్యానర్‌పై ఏక్తా కపూర్ ఈ సిరీస్‌ను నిర్మిస్తున్నారు. ఇందులో ప్రముఖ నటుడు నవదీప్ కీలక పాత్రలో నటించారు. ఇక ఈ పాట విషయానికొస్తే.. అదిరిపోయే డ్రెస్సుల్లో సన్నీ స్టెప్పులతో అదరగొట్టింది.

‘హల్లో జీ’ అంటూ సాగుతున్న ఈ పాటలో సన్నీ తన అంద‌చందాల‌తో, స్టెప్పులతో సెగలు పుట్టిస్తోంది. ఐటెం సాంగ్స్‌కి పెట్టింది పేరు సన్నీ. సన్నీ చేసే ఐటెం సాంగ్స్‌కు మార్కెట్‌లో ఉండే డిమాండే వేరు. పాట విడుదలైన నిమిషంలోనే 26వేల మందికి పైగా దీనిని వీక్షించారు. ఇలాంటి సాంగ్స్‌తోనే సన్నీ బాలీవుడ్‌లో పాపులర్ అయింది. ఇక ఫ్యాన్స్‌కి ఈ పాటను చూడగానే నిద్రపట్టదేమో. అన్న‌ట్లు ఉన్నాయి స‌న్నీ స్టెప్పులు. బాలీవుడ్‌లో కేవలం ఐటెం సాంగ్స్‌ చేసేవారు ముగ్గురే ఉన్నారు. . వారిలో మలైకా అరోరా ఖాన్, నోరా ఫతేహి, సన్నీ లియోన్. ‘ఛయ్య ఛయ్య’ పాటతో మలైకా ఎప్పుడో తనని తాను ప్రూవ్ చేసేసుకున్నారు. నోరా ఫతేహీ కూడా గట్టి పోటీనిస్తున్నారు. కానీ సన్నీ లియోన్‌కు మాత్రం ఆమెకు ఆమే పోటీ అని నిరూపించారు.

Recent Post

శాసనమండలి రద్దు తొందరపాటు నిర్ణయమా?  

పుష్కరం క్రితం నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చేతులమీదుగా పునరుద్ధరించబడిన శాసనమండలి నేడు ఆయన కుమారుడి చేతులమీదుగా ఉనికిని కోల్పోవడం యాదృచ్చికం కావచ్చు.  దేశంలో ఇరవై రెండు రాష్ట్రాలు ఉంటె, కేవలం...

అమరావతి నిజంగా “కమ్మరావతి” అవకుండా పోతుందా?

భోగిమంటల్లో కాలిన నివేదికలే గొప్ప అమరావతి చారిత్రక నగరం. శాతవాహనుల నగరం. బౌద్దుల నగరం. అవన్నీ నిజమే. కానీ చంద్రబాబు ప్రభుత్వం నామకరణం చేసిన "అమరావతి"లో ఆ చారిత్రక నగరం ఉందా? ఈ...

వైఎస్ వివేకా డెత్ మిస్టరీ వీడేదెప్పుడు ?

మాజీ మంత్రి వై ఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురయిన విషయం తెలిసిందే. 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందే అయన పై హత్యాయత్నం జరగడం సంచలనం రేపింది. ఎంపీ గా ,...

అమ్మఒడి పేరుతొ దోచుకుంటున్నారు

అమ్మఒడి పేరుతొ నిరుపేదలను దోచుకుంటున్నారు అంటూ మండి పడుతున్నారు టిడిపి నేత చంద్రబాబు నాయుడు. ఆంధ్ర ప్రదేశ్ లో నిరుపేద కుటుంబాల వారు తమ పిల్లలను స్కూల్ కు పంపించేందుకు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన...

ప‌వ‌న్ కోసం బాలీవుడ్ హీరోయిన్‌?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ `పింక్‌` తెలుగు రీమేక్‌తో రెండేళ్ల విరామం తరువాత మ‌ళ్లీ కెమెరా ముందుకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. దిల్‌రాజు, బోనీక‌పూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా రాకెట్ స్పీడుతో షూటింగ్ జ‌రుపుకుంటోంది....

Featured Posts

అమరావతి నిజంగా “కమ్మరావతి” అవకుండా పోతుందా?

భోగిమంటల్లో కాలిన నివేదికలే గొప్ప అమరావతి చారిత్రక నగరం. శాతవాహనుల నగరం. బౌద్దుల నగరం. అవన్నీ నిజమే. కానీ చంద్రబాబు ప్రభుత్వం నామకరణం చేసిన "అమరావతి"లో ఆ చారిత్రక నగరం ఉందా? ఈ...

బిగ్ బ్రేకింగ్‌: గాయ‌ప‌డిన‌ ర‌జ‌నీకాంత్‌

త‌లైవా ర‌జ‌నీకాంత్ గాయ‌ప‌డ్డారు. ఓ డాక్యుమెంట‌రీ షూటింగ్ కోసం మైసూర్‌లోని బండీపూర్ అడ‌వుల‌కు వెళ్లిన ఆయ‌న అదుపు త‌ప్పి కింద‌ప‌డిపోవ‌డంతో స్వ‌ల్ప‌గాయాలైన‌ట్టు తెలుస్తోంది. గ‌త ఏడాది భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీలో డిస్క‌వ‌రీ...

రామ్‌చ‌ర‌ణ్ బ్రిటీష్ అధికారిగానా ఇదేం ట్విస్ట్‌?

`బాహుబ‌లి` విజ‌యంతో తెలుగు సినిమా స్వ‌రూప‌మే ప్రంచ య‌వ‌నిక‌పై స‌మూలంగా మారిపోయింది. టాలీవుడ్‌లో భారీ సినిమా వ‌స్తోందంటే దేశ వ్య‌ప్తంగా అటెన్ష‌న్ క్రియేట్ అవుతోంది. తాజాగా జ‌క్క‌న్న రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న`ఆర్ ఆర్ ఆర్‌`పై...

`వీ` పోస్ట‌ర్ టాక్‌: దేనిని క‌త్తిరించేశాడో ఏమిటో!

నేచుర‌ల్ స్టార్ నాని న‌టిస్తున్న 25వ‌ చిత్రం `వీ`. ఇంద్ర‌గంటి మోహ‌న కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో నాని రెండు విభిన్న పాత్ర‌లు పోషిస్తున్నాడు. ఒక పాత్ర‌లో విల‌న్ గా...

శాసన మండలి రద్దుతో వైసిపికి ప్లస్సెంత? మైనస్సైంత?

  అందరూ ఊహించినట్లుగానే శాసన మండలి రద్దు చేస్తూ శాసన సభలో తీర్మానం చేశారు.ఇక కేంద్రంలో ఉభయ సభలు ఆమోదించిన తదుపరి రాష్ట్ర పతికి వెళ్లి ఆమోద ముద్ర పడితే అంతటితో మండలి కథ...