Home Entertainment Tollywood వీళ్ళ వార‌స‌త్వాలను మించిపోయారుగా...?

వీళ్ళ వార‌స‌త్వాలను మించిపోయారుగా…?

నందమూరి మూడో తరం నట వారసుడు జూనియర్ ఎన్టీఆర్.. తెలుగు ఇండస్ట్రీలో తాతకు తగ్గ మనవడిగా తన సత్తా చూపెడుతున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస హిట్లతో తన సత్తా చాటుతున్న ఏకైక నంద‌మూరి హీరో జూనియ‌ర్ ఎన్టీఆర్‌. సినిమాల ఎంపికలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటాడు జూనియర్ ఎన్టీఆర్. కెరియ‌ర్ మొద‌టి నుంచి కూడా ఎవ్వ‌రి బ్యాక్ రౌండ్ లేకుండా త‌న సొంత టాలెంట్‌తో టాలీవుడ్‌లో ఒక సుస్థిర స్థానాన్ని నిలుపుకున్నాడు. ఎన్టీఆర్ తర్వాత నందమూరి ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోలు వచ్చినా ఎన్టీఆర్ రూపం అందిపుచ్చుకుని సీనియర్ ఎన్టీఆర్ మళ్లీ పుట్టాడు రా అన్నంత ఫేమస్ అయ్యాడు జూనియర్. సీనియ‌ర్ ఎన్టీఆర్ పోలీక‌లు చాలా వ‌ర‌కు జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు త‌న రూపంలోనే కాకుండా న‌ట‌న‌లోనూ క‌న‌ప‌డ‌తాయి. ఏ పాత్ర చేసినా ఇట్టే ప్రేక్ష‌కుల‌ను ఆకట్టుకుంటాడు. త‌న‌దైన శైలిలో థియేట‌ర్ లో ప్రేక్ష‌కులను క‌ట్టిప‌డేస్తాడు. ఇటు మాస్, ఆటు క్లాస్ ఏ పాత్ర‌నైనా అవ‌లీల‌గా పోషించ‌గ‌ల్ల ఏకైక స‌త్తా ఉన్న హీరో ఎన్టీఆర్. అయితే సినిమాల్లోనే కాక ఇటు రాజ‌కీయాల్లోనూ త‌న స‌త్తా చాటాల‌ని చాలా మంది ఆశిస్తున్నారు. కానీ ప్ర‌స్తుతం జూనియ‌ర్ ఎన్టీఆర్ మాత్రం త‌న ఫోక‌స్ మొత్తం సినిమాల పైనే పెట్టాడు. గ‌తంలో ఒక‌సారి ఆయ‌న టాడిపి నుంచి ప్ర‌చారం చేసిన విష‌య‌ము తెలిసిందే.

ఘ‌ట్ట‌మ‌నేని మ‌హేష్ సూప‌ర్‌స్టార్ హీరో కృష్ణ త‌న‌యుడిగా చైల్డ్ ఆర్టిస్ట్‌గా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన విష‌యం తెలిసిందే. అయితే హీరోగా ముందు కెరియ‌ర్ మొద‌లుపెట్టిన మ‌హేష్‌బాబు అన్న‌య్య‌ ర‌మేష్‌బాబు ప‌ర్వాలేద‌నిపించుకన్నాడు. కానీ మ‌హేష్ 1999లో రాజ‌కుమారుడు చిత్రంతో హీరోగా అడుగు పెట్టి అక్క‌డి నుంచి త‌న అందం అభిన‌యంతో ప్రేక్ష‌కుల గుండెల్లో నిలిచిపోయాడు. ఒక్క‌డు చిత్రంతో స‌డెన్‌గా మ‌హేష్‌కెరియ‌ర్ ఒక్క‌సారిగా మారిపోయింది. కృష్ణ త‌ర్వాత తిరిగి అదే స్థాయిలో ఆ రేంజ్ పేరు తెచ్చుకున్న హీరో మ‌హేష్‌బాబుకే వ‌చ్చింది. సినిమా సినిమాకు కొత్త‌ద‌నంతోపాటు ప్ర‌యోగాల‌కు ఎప్పుడూ సిద్ధ‌మే అన్న‌ట్లు ఉంటాయి అయ‌న చిత్రాలు. ముఖ్యంగా తెలుగు సినిమాకు ఓవ‌ర్సీస్ మార్కెట్ పెంచింది మ‌హ‌ష్ సినిమాలే అని చెప్ప‌వ‌చ్చు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మ‌హేష్ ఏరియా వైజ్ రికార్డులు కూడా ఉన్నాయి. అప్ప‌ట్లో కృష్ణ‌కి ఎంత పేరు ఉందో అంత‌కు మించి టాలీవుడ్‌లో మ‌హేష్ క్రేజ్‌ను సంపాదించారు.

ప్ర‌భాస్ వ‌ర్షం చిత్రంతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టాడు. పెదనాన్న ఉప్పలపాటి ప్రభాస్ రాజు నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ పెదనాన్న ను మించిన రారాజుగా ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు.
ప్రభాస్.. ఈ పేరు వింటే చాలు.. ఆరడుగుల అందగాడు కళ్లముందు కదులుతాడు. తెలుగు సిల్వర్ స్క్రీన్ మీద ఏక్ నిరంజన్‌లా దూసుకుపోతున్న మిస్టర్ పర్‌ఫెక్ట్. టాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ఛత్రపతి. మాస్ ప్రేక్షకులకు రెబల్. క్లాస్ ఆడియన్స్‌కు డార్లింగ్. బాహుబలితో నేషనల్ వైడ్ స్టార్ స్టేటస్ సంపాదించుకున్న వెండితెర బాహుబలి. రీసెంట్‌గా ‘సాహో’ అంటూ ఆడియన్స్‌ను పలకరించాడు ప్రభాస్‌. ముందులో ఎక్కువ‌గా మాస్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్న ప్ర‌భాస్‌. త‌ర్వాత త‌న‌దైన శైలితో అటు మాస్‌, ఇటు క్లాస్ ప్రేక్ష‌కుల గుండెల్లో నిలిచిపోయాడు. ఇలా ఈ ముగ్గురు హీరోలు తమ కుటుంబాల వారసత్వ లను ఘనంగా నిలబెడుతున్నారు.

Featured Posts

కరోనా విపత్తులో కూడా కరకట్ట రాజకీయం చేస్తున్న రాధాకృష్ణ!

సాధారణంగా మామూలు ప్రజలకు ఉగాది, శ్రీరామనవమి, దసరా, దీపావళి లాంటివి పండుగలు.  కానీ, క్షుద్రజ్యోతి రాధాకృష్ణకు మాత్రం కరోనా అనే ఒక మహమ్మారి అతి పెద్ద పండుగ.  అందులోనూ తన యజమానికి బద్ధశత్రువు...

జగన్‌ నిర్ణయానికి మద్దతిచ్చిన చంద్రబాబు!

ఉప్పు, నిప్పులా ఒకరిపై ఒకరు చిటపటలాడుతూ.. తీవ్ర విమర్శలు చేసుకునే అధికార, ప్రతిపక్ష నేతలు వారు. కానీ ఇప్పుడు ఒకరు తీసుకున్న కఠిన నిర్ణయానికి మరొకరు మద్దతుగా నిలిచారు. వందశాతం సమర్థించారు. పైగా...

వీరికి  లాక్ డౌన్ వర్తించదా?

 ప్రపంచంలోని నూట తొంభై అయిదు దేశాలను గడగడలాడిస్తూ, ఇప్పటివరకు పద్దెనిమిది వేలమంది ప్రాణాలను తీసి, లక్షలాదిమందికి ఆసుపత్రుల పాలు చేసిన భయంకరమైన కరోనా వైరస్ (కోవిద్ 19 ) ఆ రెండుమూడు గ్రామాల...

Recent Posts

బ్ర‌హ్మాజీ హీరోయిన్స్‌ని త‌గులుకున్నాడేంటి?

న‌టుడు బ్ర‌హ్మాజీ హీరోయిన్‌ల తీరుపై అసంతృప్తిని వ్య‌క్తం చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న నేప‌థ్యంలో అంత‌టా లాక్ డౌన్ విధించారు. మ‌న దేశంలోనూ ఇదే ప‌రిస్థితి కొన‌సాగుతోంది. దీని...

బ‌న్నీ స్టెప్పుల‌కు బాలీవుడ్ బుట్ట‌బొమ్మ కూడా ఫిదా!

బాలీవుడ్ హాట్ బుట్ట బొమ్మ దిషా ప‌టాని. అల్లు అర్జున్ న‌టించిన `అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రంలోని `బుట్ట‌బొమ్మ‌..` పాట‌కు ఫిదా అయిపోయింది. ఈ పాట‌లో అల్లు అర్జున్ వేసిన స్టెప్పుల‌కు దిషా మెస్మ‌రైజ్...

విజ‌య్ ఇంట్లో కావాల‌నే క‌రోనా ప‌రీక్ష‌లా?

త‌మిళ నాడులో రాజ‌కీయ క‌క్ష సాధింపులు స‌ర్వ‌సాధార‌ణం. జ‌య‌ల‌లిత, క‌రుణానిధిల హ‌యాంలో ఒక వ‌ర్గాన్ని మ‌రో వ‌ర్గం ఇబ్బందుల‌కు గురిచేయ‌డం, లేని కేసులు బ‌నాయించ‌డం తెలిసిందే. వీరి త‌రువాత ఇప్పుడు హీరో విజ‌య్...

మధ్య తరగతి వారే దేశానికి సాయం చేయాలా?

కరోనా కోసం ఎవరికి తోచినంత వారు మానవతా ధృక్పథంతో సాయం చేయాలని కోరుతూ... ప్రధాని నుంచి స్థానిక అధికారుల వరకూ ప్రతి రోజూ విజ్ఞప్తులు వినిపిస్తూనే ఉన్నాయి. సీఎంఆర్ఎఫ్, పీఎంఆర్ఎఫ్ అంటూ రోజూ...

ఆంధ్రప్రదేశ్‌‌‌ ఆదాయం రూ.2 కోట్లు కూడా లేదు!

కరోనా మహమ్మారి ప్రజల ప్రాణాలతోనే కాదు రాష్ట్ర ఆర్థికను సంక్షోభంలోకి నెట్టింది. ఓ వైపు ఆదాయం లేకపోవడం..కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల ఖర్చులు వెరసి ఇప్పటికే ఖజానా ఖాళీకాగా.. ఉద్యోగులకు జీతాలు...

కరోనా విపత్తులోనూ కుళ్లు రాజకీయాలు మానుకోలేదు!

చంద్రబాబు పేరు చెప్తే ఆవేశంలో ఊగిపోయే వైకాపా ఎమ్మెల్యే, మంత్రి కొడాలి నాని మరోసారి బాబుపై తీవ్ర విమర్శలకు దిగారు. చావులను రాజకీయాలకు వాడుకునే టీడీపీ నేతలు.. కరోనాకు భయపడి ప్రాణాలను కాపాడుకునేందుకు...

ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి అదుపుతప్పుతోందా?

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు 1000 ఎప్పుడో దాటేశాయి. కేసుల సంఖ్య తక్కువగా ఉన్నా మరణాల రేటు మాత్రం ఇతర దేశాలతో పోల్చితే భారత్‌లో ఎక్కువగా ఉంది. అలాగే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి.....

వీసారే సెటైర్లు కేసీఆర్‌ మీదేనా..!

వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ఎవరిని విమర్శించాలి అన్నా నేరుగా.. ఘాటుగానే విమర్శిస్తున్నారు. అందులోనూ చంద్రబాబు, లోకేష్ అయితే ఇక ఆయన పదాలు మామూలుగా ఉండవు.. అయితే తాజాగా ఆయన చేసిన సెటైర్లు చూస్తే.....

జన’సేన’కు ఇది తగునా..?

కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ఎంతటి కఠిన చర్యలు తీసుకుంటున్నా తెలుగు రాష్ట్రాల్లో కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. మరో వైపు రాష్ట్రాల ఖజానాలు ఖాళీ అయిపోతున్నాయి. ఇలాంటి తరుణంలో రాజకీయాలకు అతీతంగా అంతా...

ఈ స‌మ‌యంలో చైత‌న్య ఏం చేస్తున్నాడు?

క‌రోనా వైర‌స్ ప్ర‌బ‌లుతున్న నేప‌థ్యంలో దేశం మొత్తం లాక్ డౌన్ విధించిన విష‌యం తెలిసిందే. ఈ స‌మ‌యంలో ఎవ‌రూ బ‌య‌టికి రావ‌ద్ద‌ని ఇళ్ల‌కే ప‌రిమితం కావాల‌ని ప్ర‌భుత్వం, పోలీసులు క‌రాకండీగా చెబుతున్నారు. దీంతో...