Home Entertainment Tollywood ర‌ష్మిక మ‌హేష్‌కు ప్ల‌స్సా... పూజ బ‌న్నీకి మైన‌స్సా...?

ర‌ష్మిక మ‌హేష్‌కు ప్ల‌స్సా… పూజ బ‌న్నీకి మైన‌స్సా…?

సంక్రాంతి బ‌రిలో రాబోతున్న చిత్రాల్లో ఒక‌టి సూప‌ర్‌స్టార్ మ‌హేష్ న‌టించిన‌`స‌రిలేరునీకెవ్వ‌రు` మ‌రొక‌టి స్టైలిష్‌స్టార్ అల్లుఅర్జున్ న‌టించిన `అల‌వైకుంట‌పురంలో` చిత్రాలు. ఇవి రెండూ కూడా సంక్రాంతి బ‌రిలో నిలుచున్నాయి. ఒక‌పోతే ఒక చిత్రానికి మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించగా మరొక‌టి హ్యాట్రిక్ యంగ్ డైరెక్ట‌ర్ అనిల్ రావి పూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇక ఇటీవ‌లె విడుద‌లైన `స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రం నుంచి రెండు పాట‌లు విడుద‌ల‌వ్వ‌గా అవి రెండూ ప్రేక్ష‌కుల‌ను అనుకున్న స్థాయిలో అల‌రించ‌లేక‌పోయాయి. ఒక‌ర‌కంగా చెప్పాలంటే మ‌హేష్ సినిమాకు ఆడియో మైన‌స్ అనే చెప్పాలి. స‌రిలేరు సాంగ్స్‌కు అంత క్రేజ్ రాలేదు. బ‌ట్ బ‌య‌ట ట్రెండింగ్‌లోనూ , ట్రేడ్ వ‌ర్గాల్లోనూ, న్యూట్ర‌ల్ జ‌నాల్లోనూ స‌రిలేరుకే ఎక్కువ క్రేజ్ ఉంది. మొన్న‌టి వ‌ర‌కు మెసేజ్ ఓరియంటెడ్ చిత్రాల్లో న‌టించిన మ‌హేష్ కు ఈ చిత్రంతో కాస్త మాసీగా ఎంట‌ర్ టైన్ చెయ్య‌నున్నారు. ఇక ప్రేక్ష‌కులు దీన్ని ఏవిధంగా తీసుకుంటారన్న‌ది తెర మీదే చూడాలి మ‌రి.

అల్లు అర్జున్ విష‌యానికి వ‌స్తే తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఇప్ప‌టికే ఆయ‌న చిత్రం నుంచి విడుద‌లైన అన్ని పాట‌లు హిట్ అయ్యాయి. కాక‌పోతే గ‌తంలో ఆయ‌న న‌టించిన నాపేరుసూర్య హిట్ కాలేదు. ఆ త‌ర్వాత ఆయ‌న చాలా గ్యాప్ త‌ర్వాత తిరిగి ఈ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నారు. మరి ఈ చిత్రంతో ఆయ‌న ఏ విధంగా ఉండ‌బోతున్నారు అన్న‌ది వేచి చూడాలి. ఏది ఏమైనా అల్లుఅర్జున్ సినిమాకు కొంత లోపం మాత్రం కనిపిస్తుంది. ఆ లోపాన్ని అధిగమించేందుకు అల్లు అర్జున్‌ కొత్త ఎత్తుగడల్ని ప్లాన్‌ చేయాల్సిందే.

టైమ్‌ చాలా తక్కువగా వుంది.. అలాగే ప్ర‌మోష‌న్స్ విష‌యానికి వ‌స్తే మహేష్‌ సినిమా ప్రచారంలో దూసుకుపోతోంది.. ఆ జోరు ‘అల వైకుంఠపురం’ విషయంలో అంతగా కన్పించకపోవడం ఆశ్చర్యకరమే మరి. మొత్తంగా చూస్తే అల్లు అర్జున్‌ స్టామినా సరిపోవడంలేదన్న చర్చకు ‘అల వైకుంఠపురములో’ టీం అలసత్వమే ఆస్కారం ఇస్తోందన్నది నిర్వివాదాంశం

టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ సూపర్ స్టార్ మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రానికి సంగీతం సమకూర్చుతున్న విషయం తెలిసిందే. మొదటి సింగిల్ ‘మైండ్ బ్లాక్’ మాస్ నంబర్ కి ప్రేక్షకుల నుండి అంత‌గా రెస్నాన్స్ రాలేదు. రెండ‌వ పాట‌ ‘సూర్యుడివో చంద్రుడివో` అన్న పాట కూడా ఎక్క‌డా విన‌ప‌డ‌డం లేదు. ఇక అల‌వైకుంఠ‌పురంలో చిత్రానికి థ‌మ‌న్ సంగీతాన్నందించ‌గా విడుద‌లైన అన్ని పాట‌ల‌కు అద్భుత‌మైన స్పంద‌న ల‌భిస్తుంది. రాములో రాములో అంటూ కుర్రాళ్ళ‌ను ఉర్రూత‌లూగిస్తుంది. త‌ర్వాత సామ‌జ‌వ‌ర‌మ‌గ‌న ఇలా అన్ని పాట‌లు దాదాపుగా హిట్స్ అనే చెప్పాలి. ఇక దీన్ని బ‌ట్టి దేవి కాస్త వెన‌క‌ప‌డ్డ‌ట్టే అనిపిస్తుంది.

ఇక‌క్రేజీ హీరోయిన్ ర‌ష్మిక, మ‌హేష్ ల జంట మొద‌టిసారి అయిన‌ప్ప‌టికీ చూడ‌టానికి చాలా క్రేజీగా ఉంటుంది. అలాగే బ‌న్నీ, పూజాల జంట గ‌త‌లంలో ఆల్రెడీ డీజే లో చూశాం. వారిద్ద‌రి జంట ప‌ర్వాలేదు. తిరిగి మ‌ళ్ళీ పూజాతో బ‌న్నీ జ‌త‌క‌ట్ట‌డం పెద్ద‌గా కొత్త‌గా ఏమీ అనిపించ‌డం లేదు.

Recent Post

శాసనమండలి రద్దు తొందరపాటు నిర్ణయమా?  

పుష్కరం క్రితం నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చేతులమీదుగా పునరుద్ధరించబడిన శాసనమండలి నేడు ఆయన కుమారుడి చేతులమీదుగా ఉనికిని కోల్పోవడం యాదృచ్చికం కావచ్చు.  దేశంలో ఇరవై రెండు రాష్ట్రాలు ఉంటె, కేవలం...

అమరావతి నిజంగా “కమ్మరావతి” అవకుండా పోతుందా?

భోగిమంటల్లో కాలిన నివేదికలే గొప్ప అమరావతి చారిత్రక నగరం. శాతవాహనుల నగరం. బౌద్దుల నగరం. అవన్నీ నిజమే. కానీ చంద్రబాబు ప్రభుత్వం నామకరణం చేసిన "అమరావతి"లో ఆ చారిత్రక నగరం ఉందా? ఈ...

వైఎస్ వివేకా డెత్ మిస్టరీ వీడేదెప్పుడు ?

మాజీ మంత్రి వై ఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురయిన విషయం తెలిసిందే. 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందే అయన పై హత్యాయత్నం జరగడం సంచలనం రేపింది. ఎంపీ గా ,...

అమ్మఒడి పేరుతొ దోచుకుంటున్నారు

అమ్మఒడి పేరుతొ నిరుపేదలను దోచుకుంటున్నారు అంటూ మండి పడుతున్నారు టిడిపి నేత చంద్రబాబు నాయుడు. ఆంధ్ర ప్రదేశ్ లో నిరుపేద కుటుంబాల వారు తమ పిల్లలను స్కూల్ కు పంపించేందుకు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన...

ప‌వ‌న్ కోసం బాలీవుడ్ హీరోయిన్‌?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ `పింక్‌` తెలుగు రీమేక్‌తో రెండేళ్ల విరామం తరువాత మ‌ళ్లీ కెమెరా ముందుకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. దిల్‌రాజు, బోనీక‌పూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా రాకెట్ స్పీడుతో షూటింగ్ జ‌రుపుకుంటోంది....

Featured Posts

అమరావతి నిజంగా “కమ్మరావతి” అవకుండా పోతుందా?

భోగిమంటల్లో కాలిన నివేదికలే గొప్ప అమరావతి చారిత్రక నగరం. శాతవాహనుల నగరం. బౌద్దుల నగరం. అవన్నీ నిజమే. కానీ చంద్రబాబు ప్రభుత్వం నామకరణం చేసిన "అమరావతి"లో ఆ చారిత్రక నగరం ఉందా? ఈ...

బిగ్ బ్రేకింగ్‌: గాయ‌ప‌డిన‌ ర‌జ‌నీకాంత్‌

త‌లైవా ర‌జ‌నీకాంత్ గాయ‌ప‌డ్డారు. ఓ డాక్యుమెంట‌రీ షూటింగ్ కోసం మైసూర్‌లోని బండీపూర్ అడ‌వుల‌కు వెళ్లిన ఆయ‌న అదుపు త‌ప్పి కింద‌ప‌డిపోవ‌డంతో స్వ‌ల్ప‌గాయాలైన‌ట్టు తెలుస్తోంది. గ‌త ఏడాది భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీలో డిస్క‌వ‌రీ...

రామ్‌చ‌ర‌ణ్ బ్రిటీష్ అధికారిగానా ఇదేం ట్విస్ట్‌?

`బాహుబ‌లి` విజ‌యంతో తెలుగు సినిమా స్వ‌రూప‌మే ప్రంచ య‌వ‌నిక‌పై స‌మూలంగా మారిపోయింది. టాలీవుడ్‌లో భారీ సినిమా వ‌స్తోందంటే దేశ వ్య‌ప్తంగా అటెన్ష‌న్ క్రియేట్ అవుతోంది. తాజాగా జ‌క్క‌న్న రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న`ఆర్ ఆర్ ఆర్‌`పై...

`వీ` పోస్ట‌ర్ టాక్‌: దేనిని క‌త్తిరించేశాడో ఏమిటో!

నేచుర‌ల్ స్టార్ నాని న‌టిస్తున్న 25వ‌ చిత్రం `వీ`. ఇంద్ర‌గంటి మోహ‌న కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో నాని రెండు విభిన్న పాత్ర‌లు పోషిస్తున్నాడు. ఒక పాత్ర‌లో విల‌న్ గా...

శాసన మండలి రద్దుతో వైసిపికి ప్లస్సెంత? మైనస్సైంత?

  అందరూ ఊహించినట్లుగానే శాసన మండలి రద్దు చేస్తూ శాసన సభలో తీర్మానం చేశారు.ఇక కేంద్రంలో ఉభయ సభలు ఆమోదించిన తదుపరి రాష్ట్ర పతికి వెళ్లి ఆమోద ముద్ర పడితే అంతటితో మండలి కథ...