Home Entertainment Tollywood రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజికల్ ట్రీట్!

రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజికల్ ట్రీట్!

టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ సంక్రాంతి కానుకగా రాబోతున్న సూపర్ స్టార్ మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రానికి సంగీతం సమకూర్చుతున్న విషయం తెలిసిందే. మొదటి సింగిల్ ‘మైండ్ బ్లాక్’ మాస్ నంబర్ కి ప్రేక్షకుల నుండి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈరోజు సాయంత్రం ‘సూర్యుడివో చంద్రుడివో’ సెకండ్ సింగిల్ ను విడుదల చేయనున్నారు.

అయితే ఈ రోజు షూటింగ్‌ జరుపుకుంటున్న మూడు వేరువేరు సినిమాల పాటల గురించి తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఈరోజు వెల్లడించారు దేవిశ్రీ ప్రసాద్. అందులో సూపర్ స్టార్ మహేష్ ‘సరిలేరునీకెవ్వరు’ నుండి ఒక డాన్స్ నంబర్, వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ మూవీ నుండి ఒక రొమాంటిక్ మెలోడీ, కీర్తి సురేష్ తదుపరి చిత్రం నుండి ప్రత్యేకమైన కాన్సెప్ట్ బేస్డ్ సాంగ్ ఈ రోజు షూటింగ్ జరుపుకుంటున్నాయి. ప్రస్తుతం ‘సరిలేరు నీకెవ్వరు’ రీ రికార్డింగ్ పనుల్లో బిజీ గా ఉన్నారు దేవిశ్రీ ప్రసాద్. జనవరి 11, 2020 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకి సిద్ధమవుతున్న సరిలేరు నీకెవ్వరు లో రష్మిక హీరోయిన్ గా నటిస్తుండగా, లేడీ అమితాబ్ విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ మాస్ ఎంటర్టైనర్ కి రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుండి ప్రతి సోమవారం ఈ సినిమా విడుదల అయ్యేంత వరకు ఈ చిత్రానికి సంబంధించిన ఏదో ఒక అప్డేట్ ఇవ్వనున్నట్టు ఈ చిత్ర యూనిట్ ప్రకటించింది. మొత్తానికి సంక్రాంతి సినిమా ప్రచార రేసులో వెనకబడ్డ ఈ సినిమా ఇక నుండి సోషల్ మీడియా వేదికగా దూకుడు చూపించబోతుంది. తమిళనాడు, కేరళలో జరిగే ఔట్‌డోర్‌ షెడ్యూల్‌తో నవంబర్‌ నెలాఖరు వరకు ఆల్‌మోస్ట్‌ షూటింగ్‌ పార్ట్ మొత్తం పూర్త‌యింది. సంక్రాంతి కానుకగా వరల్డ్‌వైడ్‌గా చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

Recent Posts

ఎన్నాళ్ల కెన్నాళ్ల‌కు దేవీకి బంప‌ర్ ఆఫ‌ర్!

టాలీవుడ్ రాక్‌స్టార్ దేవిశ్రీ‌ప్ర‌సాద్‌. త‌న‌దైన సంగీతంతో హుషారెత్తించే సంగీతం దేవీ సొంతం. తెలుగులో టాప్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా క్రేజ్‌ని సొంతం చేసుకున్న దేవి గ‌త కొంత కాలంగా తెలుగులో త‌న ప‌ట్టుని...

ఇద్ద‌రు క్రాక్‌లు త‌న‌తో ట‌చ్‌లో వున్నార‌ట‌!

క‌రోనా వైర‌స్‌ ప్ర‌బ‌లుతున్న నేప‌థ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్‌ని విధించిన విష‌యం తెలిసిందే. సామాన్యుల నుంచి స్టార్ వ‌ర‌కు ఇంటికే ప‌రిమిత‌మైపోయారు. ఇంట్లో వుండి కాల‌క్షేపం చేయ‌డం మొద‌లుపెట్టారు. అయితే త్రిష...

అంద‌రిది ఓ దారైతే వ‌ర్మ‌ది మ‌రోదారి!

క‌రోనా వైర‌స్ కార‌ణంగా జ‌నం భ‌యంతో ఇళ్ల‌కే ప‌రిమిత‌మైపోయారు. దేశ వ్యాప్తంగా క‌రోనా క‌ట్ట‌డి కోసం లాక్ డౌన్‌ని ప్ర‌క‌టించారు. దీంతో ఎక్క‌డి జ‌నం అక్క‌డే.. వీఐపీ లేదు, స్టార్ సెల‌బ్రిటీ లేదు..సామాన్యుడు...

కుల‌వృత్తిలో `కేజీఎఫ్` మ్యూజిక్ డైరెక్ట‌ర్‌!

`కేజీఎఫ్ చాప్ట‌ర్ 1`దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. ప్ర‌శాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంతో హీరో యష్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. క‌న్న‌డ చిత్రాల్లోనే స‌రికొత్త చ‌రిత్ర సృష్టించిన ఈ...

ఇంటికొచ్చి ఇస్తా అన్న ఆ — ఎక్కడ?

కోవిడ్-19 విజృంభనతో దేశం మొత్తం లాక్ డౌన్ అయిపోయింది. ఈ సమయంలో ప్రజలకు ఇబ్బందులు రాకుండా నిత్యావసరాలు, అలాగే రేషన్ వంటి వాటిని అందించేందుకు తమ వంతుగా ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్...

ఆ మాజీ ఎమ్మెల్యే రాజకీయ భవిష్యత్తు ముగినట్టేనా?

దశాబ్దాలుగా కమ్యూనిస్టులకు కోటలుగా ఉన్న ప్రాంతాలు ఇప్పుడు కనుమరుగవుతున్నాయి. మూస సిద్ధాంతాలతో మసకబారుతున్నాయి. మచ్చలేని ప్రజా నాయకులుగా వెలిగిన వారు.. పలుమార్లు ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచిన వారు.. ఇప్పుడు ఆర్థిక స్థోమత లేక...

సబ్బం హరి ఆ పని చేయడం వల్లే జగన్‌ దూరం పెట్టారా?

మంచి మాటకారిగా పేరు తెచ్చుకున్న మాజీ ఎంపీ సబ్బం హరి మాటలు.. ఇప్పుడు టీడీపీ అనుకూల మీడియాకు మంచి సరుకుగా, జగన్‌పై విమర్శలు సంధించేందుకు అస్త్రాలుగా మారుతున్నాయి. సమయం, సందర్బం అంటూ ఏదీ...

హాట్ యాంక‌ర్‌కి మెగా ఆఫ‌ర్‌!

హాట్ యాంక‌ర్ రంగ‌మ్మ‌త్త అన‌సూయ‌కు మ‌రో మెగా ఆఫ‌ర్ త‌గిలిన‌ట్టు తెలిసింది. `రంగ‌స్థ‌లం`లో రంగ‌మ్మ‌త్త‌గా గోల్డెన్ ఛాన్స్ కొట్టేసి ఓ ద‌శ‌లో రామ్‌చ‌ర‌ణ్‌నే డామినేట్ చేసిన అన‌సూయ‌కు ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిత్రంలో...

పుట్టిన రోజు లేదు .. పెళ్లీ కూడా వాయిదా!

ప్ర‌పంచం క‌రోనా వైర‌స్ కార‌ణంగా అల్ల క‌ల్లోలం అవుతోంది. ఎక్క‌డ చూసినా క‌రోనా మ‌ర‌ణాలే. దేశం క‌రోనా కార‌ణంగా భ‌యంతో కంపించిపోతోంది. ఈ ప‌రిస్థితుల్లో ముఖ్య‌మైన కార్య‌క్రమాల‌న్నింటినీ జ‌నం వాయిదా వేసుకుంటున్నారు. కొన్నింటిని...

`ఉప్పెన‌`కు క‌త్తెరేస్తున్న ద‌ర్శ‌కుడు!

సాయిధ‌ర‌మ్‌తేజ్ త‌మ్ముడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం `ఉప్పెన‌`. మైత్రీ మూవీమేక‌ర్స్‌తో క‌లిసి సుకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఆయ‌న శిష్యుడు బుచ్చిబాబు ఈ చిత్రం ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం...

Featured Posts

కరోనా విపత్తులో కూడా కరకట్ట రాజకీయం చేస్తున్న రాధాకృష్ణ!

సాధారణంగా మామూలు ప్రజలకు ఉగాది, శ్రీరామనవమి, దసరా, దీపావళి లాంటివి పండుగలు.  కానీ, క్షుద్రజ్యోతి రాధాకృష్ణకు మాత్రం కరోనా అనే ఒక మహమ్మారి అతి పెద్ద పండుగ.  అందులోనూ తన యజమానికి బద్ధశత్రువు...

జగన్‌ నిర్ణయానికి మద్దతిచ్చిన చంద్రబాబు!

ఉప్పు, నిప్పులా ఒకరిపై ఒకరు చిటపటలాడుతూ.. తీవ్ర విమర్శలు చేసుకునే అధికార, ప్రతిపక్ష నేతలు వారు. కానీ ఇప్పుడు ఒకరు తీసుకున్న కఠిన నిర్ణయానికి మరొకరు మద్దతుగా నిలిచారు. వందశాతం సమర్థించారు. పైగా...

వీరికి  లాక్ డౌన్ వర్తించదా?

 ప్రపంచంలోని నూట తొంభై అయిదు దేశాలను గడగడలాడిస్తూ, ఇప్పటివరకు పద్దెనిమిది వేలమంది ప్రాణాలను తీసి, లక్షలాదిమందికి ఆసుపత్రుల పాలు చేసిన భయంకరమైన కరోనా వైరస్ (కోవిద్ 19 ) ఆ రెండుమూడు గ్రామాల...