Home Entertainment Tollywood ప‌వ‌న్ సినిమాకి హీరోయిన్లు దొరికేశార‌ట‌!

ప‌వ‌న్ సినిమాకి హీరోయిన్లు దొరికేశార‌ట‌!

సినిమాల్లో ఒక వెలుగు వెలిగి, ఆ తరువాత ప్రజా సేవ మీద ఉన్నటువంటి మక్కువతో రాజకీయాల్లోకి వచ్చి, ఒక రాజకీయ పార్టీని స్థాపించి, జయాపజయాలతో సంబంధం లేకుండా రాష్ట్రంలోని ప్రజలందరితో కలిసిపోరాడ‌టానికి జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్, ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి ఎన్నికల తరువాత ఇకమీదట సినిమాలు చేయబోనని అధికారికంగా ప్రకటించారు. కాగా అభిమానుల కోరిక మేరకు పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాలు చేయడానికి అంగీకరించారు. కాగా పవన్ తన రీ ఎంట్రీ సినిమాను ఎలాంటి కథ తో చేస్తాడనే అంశం గత కొద్దీ రోజులుగా చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి.

కాగా పవన్ కళ్యాణ్ చేయబోయే సినిమా ఎట్టకేలకు ఖరారయింది. హిందీ లో సూపర్ హిట్ అయిన పింక్ రీమేక్ లో నటించనున్నారని సమాచారం. కాగా ఈ చిత్రానికి తెలుగులో వేణు శ్రీ రామ్ దర్శకత్వం వహిస్తుండగా, దిల్ రాజు, బోని కపూర్ లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇకపోతే ఈ చిత్రంలో ఎవరు హీరోయిన్లుగా నటిస్తున్నారు అనే అంశం ఆసక్తికరంగా మారింది. కాగా ఈ చిత్రంలో మలయాళీ ముద్దుగుమ్మ నివేద థామస్, తెలుగమ్మాయి అంజలి రెండు కీలక పాత్రలు చేయడానికి ఒప్ప్పుకున్నారని, మరొక కీలక పాత్రకు మాతృకలో నటించిన తాప్సిని తీసుకోడానికి ప్రయత్నాలు చేస్తున్నార‌ని సమాచారం. కానీ తదితర వివరాలు అన్ని కూడా అధికారికంగా వెల్లడవ్వాల్సి ఉంది.

ఇక హీరోయిన్ల విష‌యానికి వ‌స్తే అంత పెద్ద క్రేజ్ ఉన్న హీరోన్లు ఎవ‌రూ క‌నిపించ‌డం లేదు. నివేదా థామ‌స్ చూడ‌డానికి బాగానే ఉన్నా అంత పెద్ద హిట్ల‌యితే ఏమీ లేవు. ఇక అంజ‌లి గురించి తెలిసిన విష‌య‌మే. ఈ మ‌ధ్య కాలంలో పెద్దగా సినిమాలు ఏమీ లేవు. ఇక తాప్సీ విష‌యానికి వ‌స్తే ఈ మ‌ధ్య కాలంలో టాలీవుడ్ లో ఆమె సినిమాలు ఏమీ లేవు. బాలీవుడ్ లోనే ఎక్కువ‌గా చేస్తుంది. మ‌రి వీళ్ళ‌ని తీసుకోవ‌డానికి గ‌ల కార‌ణాలేంటో తెలియ‌లేదు. ఏది ఏమైన‌ప్ప‌టికీ ప‌వ‌న్‌కు ఈ చిత్రం మ‌ళ్ళీ రీ ఎంట్రీ లాంటిది. ఇక ఇది ఎలా ఉండ‌బోతుంది అన్న‌ది తెర మీదే చూడాలి.

Recent Post

వైఎస్ వివేకా డెత్ మిస్టరీ వీడేదెప్పుడు ?

మాజీ మంత్రి వై ఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురయిన విషయం తెలిసిందే. 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందే అయన పై హత్యాయత్నం జరగడం సంచలనం రేపింది. ఎంపీ గా ,...

అమ్మఒడి పేరుతొ దోచుకుంటున్నారు : చంద్రబాబు

అమ్మఒడి పేరుతొ నిరుపేదలను దోచుకుంటున్నారు అంటూ మండి పడుతున్నారు టిడిపి నేత చంద్రబాబు నాయుడు. ఆంధ్ర ప్రదేశ్ లో నిరుపేద కుటుంబాల వారు తమ పిల్లలను స్కూల్ కు పంపించేందుకు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన...

ప‌వ‌న్ కోసం బాలీవుడ్ హీరోయిన్‌?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ `పింక్‌` తెలుగు రీమేక్‌తో రెండేళ్ల విరామం తరువాత మ‌ళ్లీ కెమెరా ముందుకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. దిల్‌రాజు, బోనీక‌పూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా రాకెట్ స్పీడుతో షూటింగ్ జ‌రుపుకుంటోంది....

`ఆర్ ఆర్ ఆర్‌`లో మ‌రో హీరోయిన్‌?

రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న విజువ‌ల్ వండ‌ర్ `ఆర్ ఆర్ ఆర్‌`. ఈ సినిమా ప్ర‌క‌టించిన ద‌గ్గ‌రి నుంచి రోజుకో వార్త హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ కొమ‌రంభీం పాత్ర‌లో, అల్లూరి సీతారామ‌రాజుగా రామ్‌చ‌ర‌ణ్ న‌టిస్తున్న...

విశాఖ రాజధానిని చేస్తే సమస్యలు తప్పవు : జిఎన్ రావు కమిటీ

ఆంధ్ర ప్రదేశ్ లో మూడు రాజధానుల అంశం మొత్తానికి చివరి దశకు చేరుకున్నట్టే. శాసన మండలిలో మూడు రాజధానులకు అనుగుణంగా బిల్లు ప్రవేశకా పెట్టకపోవడంతో జగన్ సర్కార్ శాసన మండలి రద్దు దిశగా...

Featured Posts

బిగ్ బ్రేకింగ్‌: గాయ‌ప‌డిన‌ ర‌జ‌నీకాంత్‌

త‌లైవా ర‌జ‌నీకాంత్ గాయ‌ప‌డ్డారు. ఓ డాక్యుమెంట‌రీ షూటింగ్ కోసం మైసూర్‌లోని బండీపూర్ అడ‌వుల‌కు వెళ్లిన ఆయ‌న అదుపు త‌ప్పి కింద‌ప‌డిపోవ‌డంతో స్వ‌ల్ప‌గాయాలైన‌ట్టు తెలుస్తోంది. గ‌త ఏడాది భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీలో డిస్క‌వ‌రీ...

రామ్‌చ‌ర‌ణ్ బ్రిటీష్ అధికారిగానా ఇదేం ట్విస్ట్‌?

`బాహుబ‌లి` విజ‌యంతో తెలుగు సినిమా స్వ‌రూప‌మే ప్రంచ య‌వ‌నిక‌పై స‌మూలంగా మారిపోయింది. టాలీవుడ్‌లో భారీ సినిమా వ‌స్తోందంటే దేశ వ్య‌ప్తంగా అటెన్ష‌న్ క్రియేట్ అవుతోంది. తాజాగా జ‌క్క‌న్న రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న`ఆర్ ఆర్ ఆర్‌`పై...

`వీ` పోస్ట‌ర్ టాక్‌: దేనిని క‌త్తిరించేశాడో ఏమిటో!

నేచుర‌ల్ స్టార్ నాని న‌టిస్తున్న 25వ‌ చిత్రం `వీ`. ఇంద్ర‌గంటి మోహ‌న కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో నాని రెండు విభిన్న పాత్ర‌లు పోషిస్తున్నాడు. ఒక పాత్ర‌లో విల‌న్ గా...

శాసన మండలి రద్దుతో వైసిపికి ప్లస్సెంత? మైనస్సైంత?

  అందరూ ఊహించినట్లుగానే శాసన మండలి రద్దు చేస్తూ శాసన సభలో తీర్మానం చేశారు.ఇక కేంద్రంలో ఉభయ సభలు ఆమోదించిన తదుపరి రాష్ట్ర పతికి వెళ్లి ఆమోద ముద్ర పడితే అంతటితో మండలి కథ...

ప‌వ‌న్ చూడాలంటే అద్భుతం జ‌ర‌గాలంట‌!

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ల క‌ల‌యిక‌లో వ‌చ్చిన చిత్రం `అల వైకుంఠ‌పుర‌ములో`. ఈ సంక్రాంతికి రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద భారీ విజ‌యాన్ని సాధించి రేసులో ముందుంద‌నిపించింది....