Home Entertainment Tollywood నాగ‌బాబు జ‌బ‌ర్ద‌స్త్‌ని వ‌ద‌ల‌డానికి అస‌లు కార‌ణం ఇదా...?

నాగ‌బాబు జ‌బ‌ర్ద‌స్త్‌ని వ‌ద‌ల‌డానికి అస‌లు కార‌ణం ఇదా…?

బుల్లి తెర షోల‌లో మంచి అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చిన షో `జ‌బ‌ర్ద‌స్త్‌`. ఆ షో వ‌ల్ల ఈటీవీ టిఆర్పీ రేటింగ్ అమాంతం పెరిగిపోయింద‌నే చెప్పాలి. ఇక ఈ షోకి నాగ‌బాబు, రోజా జ‌డ్జిల‌గా వ్య‌వ‌హ‌రించ‌గా, అన‌సూయ‌, రేష్మి యాంక‌ర్లుగా ప్రేక్ష‌కుల‌ను ఆకట్టుకుంటారు. ఈ షోలో వ‌చ్చే క‌మెడియ‌న్స్ అంద‌రికీ దాదాపుగా మంచి పేరు వ‌చ్చి ప్ర‌స్తుతం సినిమాల్లో కూడా న‌టించేస్తున్నారు. ఇప్పుడు ఎక్క‌డ చూసినా ప్ర‌తీ సినిమాలోనూ జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్లే ఎక్కువ‌గా ఉంటున్నారు. అంతే వాళ్ళ టాలెంట్ ఏవిధంగా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

ఇక ఈ షో నుంచి మెగా బ్రదర్ నాగబాబు బయటపడిన నాటి నుంచి యూట్యూబ్-మీడియా వేదికలపై రకరకాల కథనాలు వెలువడ్డాయి. మల్లెమాల ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మాత శ్యామ్ ప్రసాదరెడ్డి నిర్మించిన ఈ షో చాలా మందిని వెలుగులోకి తీసుకురావడమే కాకుండా చాలా మంది జీవితాల్ని సమూలంగా మార్చేసింది. ఈ కార్యక్రమానికి మెగా బ్రదర్ నాగబాబు… పెద్ద అస్సెట్ అన్న కథనాలు వచ్చాయి. నాగబాబు- నటి రోజా న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించి దీనిని పెద్ద సక్సెస్ చేశారు. అయితే ఇటీవల ఈ షో నుంచి ఆర్థిక లావాదేవీలు సహా పాలసీ పరమైన విభేదాల కారణంగా మెగా బ్రదర్ నాగబాబు తప్పుకున్నారని కథనాలొచ్చాయి.

అయితే ఈ షో నుంచి తప్పుకున్న నాగబాబు జీటీవీతో భారీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారట. జీ తెలుగు ఛానల్ కోసం ఆయన జబర్దస్త్ తరహా కామెడీ షోని ఈ మధ్యనే అక్క‌డ కూడా మొదలుపెట్టారు. ఇందుకు గాను జీటీవీ వాళ్లనుంచి ప్రతి నెలా 30 లక్షలు దాంతో పాటే అదనంగా ప్యాకేజీ కూడా తీసుకుంటున్న‌ట్లు స‌మాచారం. షూటింగ్ సమయంలో ఆయ‌న‌కు ప్రత్యేకంగా కారవాన్.. సెలబ్రిటీ ట్రీట్ ని నాగబాబు పొందుతున్నారన్నది తాజా అందిన వార్త‌.

అయితే గ‌తంలో ఈటీలో జ‌బ‌ర్ద‌స్త్ షోకి ఆయ‌న కేవ‌లం 20 ల‌క్ష‌లు మాత్ర‌మే తీసుకునేవార‌ని దానికి 10 లక్షలు అదనంగా కలుపుకుని 30లక్షల వరకూ జీటీవీ నుంచి వస్తుండటం వల్లనే మెగా బ్రదర్ షిఫ్ట్ అయ్యారట. అంతేకాక‌… ఇప్పుడు తీసుకుంటున్న దాని కంటే మ‌రింత అద‌న‌పు ప్యాకేజీని రెండేళ్ళ కొక‌సారి పెంచేందుకు ఆయ‌న కాంట్రాక్ట్ కుదుర్చుకున్న‌ట్లు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అయితే మెగా బ్ర‌ద‌ర్ వెళ్ళ‌డానికి ముఖ్య కార‌ణం ప్యాకేజీ మాత్ర‌మేనా లేదా ఇంకేదైనా కార‌ణాలు ఉన్నాయా అన్న‌ది ఎవ్వ‌రికీ అర్ధం కాని ప్ర‌శ్న‌గా మిగిలింది.

Recent Post

శాసనమండలి రద్దు తొందరపాటు నిర్ణయమా?  

పుష్కరం క్రితం నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చేతులమీదుగా పునరుద్ధరించబడిన శాసనమండలి నేడు ఆయన కుమారుడి చేతులమీదుగా ఉనికిని కోల్పోవడం యాదృచ్చికం కావచ్చు.  దేశంలో ఇరవై రెండు రాష్ట్రాలు ఉంటె, కేవలం...

అమరావతి నిజంగా “కమ్మరావతి” అవకుండా పోతుందా?

భోగిమంటల్లో కాలిన నివేదికలే గొప్ప అమరావతి చారిత్రక నగరం. శాతవాహనుల నగరం. బౌద్దుల నగరం. అవన్నీ నిజమే. కానీ చంద్రబాబు ప్రభుత్వం నామకరణం చేసిన "అమరావతి"లో ఆ చారిత్రక నగరం ఉందా? ఈ...

వైఎస్ వివేకా డెత్ మిస్టరీ వీడేదెప్పుడు ?

మాజీ మంత్రి వై ఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురయిన విషయం తెలిసిందే. 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందే అయన పై హత్యాయత్నం జరగడం సంచలనం రేపింది. ఎంపీ గా ,...

అమ్మఒడి పేరుతొ దోచుకుంటున్నారు

అమ్మఒడి పేరుతొ నిరుపేదలను దోచుకుంటున్నారు అంటూ మండి పడుతున్నారు టిడిపి నేత చంద్రబాబు నాయుడు. ఆంధ్ర ప్రదేశ్ లో నిరుపేద కుటుంబాల వారు తమ పిల్లలను స్కూల్ కు పంపించేందుకు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన...

ప‌వ‌న్ కోసం బాలీవుడ్ హీరోయిన్‌?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ `పింక్‌` తెలుగు రీమేక్‌తో రెండేళ్ల విరామం తరువాత మ‌ళ్లీ కెమెరా ముందుకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. దిల్‌రాజు, బోనీక‌పూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా రాకెట్ స్పీడుతో షూటింగ్ జ‌రుపుకుంటోంది....

Featured Posts

అమరావతి నిజంగా “కమ్మరావతి” అవకుండా పోతుందా?

భోగిమంటల్లో కాలిన నివేదికలే గొప్ప అమరావతి చారిత్రక నగరం. శాతవాహనుల నగరం. బౌద్దుల నగరం. అవన్నీ నిజమే. కానీ చంద్రబాబు ప్రభుత్వం నామకరణం చేసిన "అమరావతి"లో ఆ చారిత్రక నగరం ఉందా? ఈ...

బిగ్ బ్రేకింగ్‌: గాయ‌ప‌డిన‌ ర‌జ‌నీకాంత్‌

త‌లైవా ర‌జ‌నీకాంత్ గాయ‌ప‌డ్డారు. ఓ డాక్యుమెంట‌రీ షూటింగ్ కోసం మైసూర్‌లోని బండీపూర్ అడ‌వుల‌కు వెళ్లిన ఆయ‌న అదుపు త‌ప్పి కింద‌ప‌డిపోవ‌డంతో స్వ‌ల్ప‌గాయాలైన‌ట్టు తెలుస్తోంది. గ‌త ఏడాది భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీలో డిస్క‌వ‌రీ...

రామ్‌చ‌ర‌ణ్ బ్రిటీష్ అధికారిగానా ఇదేం ట్విస్ట్‌?

`బాహుబ‌లి` విజ‌యంతో తెలుగు సినిమా స్వ‌రూప‌మే ప్రంచ య‌వ‌నిక‌పై స‌మూలంగా మారిపోయింది. టాలీవుడ్‌లో భారీ సినిమా వ‌స్తోందంటే దేశ వ్య‌ప్తంగా అటెన్ష‌న్ క్రియేట్ అవుతోంది. తాజాగా జ‌క్క‌న్న రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న`ఆర్ ఆర్ ఆర్‌`పై...

`వీ` పోస్ట‌ర్ టాక్‌: దేనిని క‌త్తిరించేశాడో ఏమిటో!

నేచుర‌ల్ స్టార్ నాని న‌టిస్తున్న 25వ‌ చిత్రం `వీ`. ఇంద్ర‌గంటి మోహ‌న కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో నాని రెండు విభిన్న పాత్ర‌లు పోషిస్తున్నాడు. ఒక పాత్ర‌లో విల‌న్ గా...

శాసన మండలి రద్దుతో వైసిపికి ప్లస్సెంత? మైనస్సైంత?

  అందరూ ఊహించినట్లుగానే శాసన మండలి రద్దు చేస్తూ శాసన సభలో తీర్మానం చేశారు.ఇక కేంద్రంలో ఉభయ సభలు ఆమోదించిన తదుపరి రాష్ట్ర పతికి వెళ్లి ఆమోద ముద్ర పడితే అంతటితో మండలి కథ...