Home Entertainment Tollywood దిశ లాంటి మ‌రో క‌థ‌... హ‌లో మేడ‌మ్

దిశ లాంటి మ‌రో క‌థ‌… హ‌లో మేడ‌మ్

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ సంఘటనలు ఇంకా దేశంలో జరుగుతూనే ఉన్నాయి. మానవ రూపంలో ఉన్న మృగాలు ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నాయి. ఒక ఉన్మాది (సైకో) చేతిలో విధి వంచితులైన అమ్మాయిల కథతో ‘హలో మేడమ్‌’ సినిమా రూపొందుతోంది. అమ్మాయిలను ట్రాప్‌ చేసి, వారి శీలాన్ని దోచుకుంటున్న మృగాడి కథ ఇది. ఇలాంటి దారుణాలు చేసిన అతడికి ఎలాంటి శిక్ష పడింది? అనేది ఆసక్తికరంగా ఉంటుంది. కార్తీక్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై వడ్ల జనార్ధన్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఘటికాచలం కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, పాటలు, సంగీతం అందిస్తున్నారు. వడ్ల గురురాజ్‌, వడ్ల కార్తీక్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వడ్ల నాగ శారద సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.

హీరోగా సైకో పాత్రలో నవీన్‌ కె. చారి నటిస్తున్న ఈ చిత్రంలో సుమాయ, ప్రియాన్సి, మేఘన నాయుడు, కావ్య, కవిత గౌడ్‌, దేవి, శీలం శ్రీను, సాయి, వెంకటేష్‌ టాతి రాజు, కల్యాణ్‌ పళ్ళం, శీలం రాహుల్‌, మల్లాది శాస్త్రి, నూతన్‌ బాబు, కాకినాడ గుప్తతో పాటుగా మాస్టర్‌ తీగుల్ల తన్వీత్‌ రెడ్డి నటిస్తున్నారు.

”హలో మేడమ్‌ చిత్రీకరణ పూర్తయిందని, హైదరాబాద్‌, వరంగల్‌, జగిత్యాల ప్రాంతాల్లో, అడవుల్లో షూటింగ్‌ జరిపినట్టు” చిత్ర నిర్మాతలు వెల్లడించారు.”ప్రేమ, యాక్షన్‌, వినోదం, హారర్‌, రొమాన్స్‌, మిళితమైన చిత్ర కథలో కమర్షియల్‌ అంశాలు కూడా చేర్చడం జరిగిందని” దర్శకుడు వడ్ల జనార్ధన్‌ చెప్పారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: శ్రీనివాస రెడ్డి, ఎడిటర్‌: వాసు వర్మ, సిఈఓ: కాసు హరిప్రసాద్‌, కో డైరెక్టర్‌: మర్రి కోటేశ్వరరావు. ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: తలపనేని నరేంద్రబాబు.

Recent Post

శాసనమండలి రద్దు తొందరపాటు నిర్ణయమా?  

పుష్కరం క్రితం నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చేతులమీదుగా పునరుద్ధరించబడిన శాసనమండలి నేడు ఆయన కుమారుడి చేతులమీదుగా ఉనికిని కోల్పోవడం యాదృచ్చికం కావచ్చు.  దేశంలో ఇరవై రెండు రాష్ట్రాలు ఉంటె, కేవలం...

అమరావతి నిజంగా “కమ్మరావతి” అవకుండా పోతుందా?

భోగిమంటల్లో కాలిన నివేదికలే గొప్ప అమరావతి చారిత్రక నగరం. శాతవాహనుల నగరం. బౌద్దుల నగరం. అవన్నీ నిజమే. కానీ చంద్రబాబు ప్రభుత్వం నామకరణం చేసిన "అమరావతి"లో ఆ చారిత్రక నగరం ఉందా? ఈ...

వైఎస్ వివేకా డెత్ మిస్టరీ వీడేదెప్పుడు ?

మాజీ మంత్రి వై ఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురయిన విషయం తెలిసిందే. 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందే అయన పై హత్యాయత్నం జరగడం సంచలనం రేపింది. ఎంపీ గా ,...

అమ్మఒడి పేరుతొ దోచుకుంటున్నారు

అమ్మఒడి పేరుతొ నిరుపేదలను దోచుకుంటున్నారు అంటూ మండి పడుతున్నారు టిడిపి నేత చంద్రబాబు నాయుడు. ఆంధ్ర ప్రదేశ్ లో నిరుపేద కుటుంబాల వారు తమ పిల్లలను స్కూల్ కు పంపించేందుకు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన...

ప‌వ‌న్ కోసం బాలీవుడ్ హీరోయిన్‌?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ `పింక్‌` తెలుగు రీమేక్‌తో రెండేళ్ల విరామం తరువాత మ‌ళ్లీ కెమెరా ముందుకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. దిల్‌రాజు, బోనీక‌పూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా రాకెట్ స్పీడుతో షూటింగ్ జ‌రుపుకుంటోంది....

Featured Posts

అమరావతి నిజంగా “కమ్మరావతి” అవకుండా పోతుందా?

భోగిమంటల్లో కాలిన నివేదికలే గొప్ప అమరావతి చారిత్రక నగరం. శాతవాహనుల నగరం. బౌద్దుల నగరం. అవన్నీ నిజమే. కానీ చంద్రబాబు ప్రభుత్వం నామకరణం చేసిన "అమరావతి"లో ఆ చారిత్రక నగరం ఉందా? ఈ...

బిగ్ బ్రేకింగ్‌: గాయ‌ప‌డిన‌ ర‌జ‌నీకాంత్‌

త‌లైవా ర‌జ‌నీకాంత్ గాయ‌ప‌డ్డారు. ఓ డాక్యుమెంట‌రీ షూటింగ్ కోసం మైసూర్‌లోని బండీపూర్ అడ‌వుల‌కు వెళ్లిన ఆయ‌న అదుపు త‌ప్పి కింద‌ప‌డిపోవ‌డంతో స్వ‌ల్ప‌గాయాలైన‌ట్టు తెలుస్తోంది. గ‌త ఏడాది భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీలో డిస్క‌వ‌రీ...

రామ్‌చ‌ర‌ణ్ బ్రిటీష్ అధికారిగానా ఇదేం ట్విస్ట్‌?

`బాహుబ‌లి` విజ‌యంతో తెలుగు సినిమా స్వ‌రూప‌మే ప్రంచ య‌వ‌నిక‌పై స‌మూలంగా మారిపోయింది. టాలీవుడ్‌లో భారీ సినిమా వ‌స్తోందంటే దేశ వ్య‌ప్తంగా అటెన్ష‌న్ క్రియేట్ అవుతోంది. తాజాగా జ‌క్క‌న్న రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న`ఆర్ ఆర్ ఆర్‌`పై...

`వీ` పోస్ట‌ర్ టాక్‌: దేనిని క‌త్తిరించేశాడో ఏమిటో!

నేచుర‌ల్ స్టార్ నాని న‌టిస్తున్న 25వ‌ చిత్రం `వీ`. ఇంద్ర‌గంటి మోహ‌న కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో నాని రెండు విభిన్న పాత్ర‌లు పోషిస్తున్నాడు. ఒక పాత్ర‌లో విల‌న్ గా...

శాసన మండలి రద్దుతో వైసిపికి ప్లస్సెంత? మైనస్సైంత?

  అందరూ ఊహించినట్లుగానే శాసన మండలి రద్దు చేస్తూ శాసన సభలో తీర్మానం చేశారు.ఇక కేంద్రంలో ఉభయ సభలు ఆమోదించిన తదుపరి రాష్ట్ర పతికి వెళ్లి ఆమోద ముద్ర పడితే అంతటితో మండలి కథ...