Home Entertainment Tollywood జనవరి 1న ప్రేక్షకుల ముందుకు డిగ్రీ కాలేజ్

జనవరి 1న ప్రేక్షకుల ముందుకు డిగ్రీ కాలేజ్

1940లో ఒక గ్రామం, కమలతో నా ప్రయాణం తదితర చిత్రాలు అవార్డులను తెచ్చిపెట్టడంతో పాటు దర్శకుడిగా నరసింహ నందికి ఎంతో పేరు తెచ్చిపెట్టాయి. కాగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం డిగ్రీ కాలేజ్, తన పంధాకు బిన్నంగా రొమాన్స్ అంశాలను మేళవించి ఆయన ఈ చిత్రాన్ని రూపొందించారు. వరుణ్, దివ్యారావు హీరోహీరోయిన్లుగా శ్రీ లక్ష్మీ నరసింహ సినిమా పతాకంపై నిర్మాణమైన ఈ సినిమా ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలను సైతం పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. .ఆ మధ్య విడుదల చేసిన ఈ చిత్రం రెండు ట్రైలర్స్ కు విశేషమైన స్పందన లభించడమే కాదు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యాయి. ఇదిలావుండగా… శుక్రవారం హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఈ చిత్రం విడుదల తేదీని ప్రకటించడంతో పాటు రెండు ట్రైలర్స్ ను, మేకింగ్ వీడియోను విడుదల చేసారు. అతిధిగా పాల్గొన్న టి.ప్రసన్నకుమార్ ఒక ట్రైలర్ ను, ఇంకో ట్రైలర్ ను సీనియర్ ఫోటో జర్నలిస్ట్ సాయి రమేష్ ఆవిష్కరించగా, మేకింగ్ వీడియోను ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, నిర్మాత బాపిరాజు విడుదల చేసారు.

 

ఈ సందర్బంగా చిత్ర దర్శకుడు నరసింహ నంది మాట్లాడుతూ, నూతన ఏడాది ఆరంభాన్ని పురస్కరించుకుని జనవరి 1న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నాం. వాస్తవికతను ప్రతిబింబించే చిత్రాలను తీయడం మొదటి నుంచి నా అలవాటు. అయితే ఈ చిత్రాన్నిఆర్ట్ జోనర్లో కాకుండా ఇద్దరు డిగ్రీ కాలేజీ స్టూడెంట్స్ మధ్య అంకురించిన యదార్ధ ప్రేమ సంఘటనల ఆధారంగా తీసాం. ఓ అబ్బాయి, ఓ అమ్మాయి క్లాస్ రూంలో, బయట ఎలా ప్రవర్తించారో అన్న అంశాలనే సహజత్వానికి దగ్గరగా ఇందులో చూపించాను. ఇంతవరకు నేను తీసిన చిత్రాలకు బిన్నంగా కమర్షియల్ అంశాలను పొందుపరిచాను. ట్రైలర్లో ఒక రకంగా..సినిమాలో ఒకరకంగా చూపించడం నాకు అలవాటు లేదు. ట్రైలర్స్ లో వున్నది సినిమాలోనూ ఉంటుంది. కేవలం రెండు దృశ్యాలను మాత్రమే సెన్సార్ లో కట్ చేసారు అని అన్నారు.
అతిధి టి.ప్రసన్నకుమార్ మాట్లాడుతూ, సందేశాత్మక అవార్డు చిత్రాలను తీసే దర్శకుడు ఇలాంటి రొమాంటిక్ చిత్రం ఎందుకు తీశారో చిత్ర పరిశ్రమ, ప్రేక్షకులు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కనీసం అప్పుడప్పుడైనా ఆయన తన పంధా చిత్రాలను తీస్తుండాలి. ఏదిఏమైనా…యూత్ ను ఈ చిత్రం అమితంగా ఆకట్టుకుంటుందని బావిస్తున్నా అని అన్నారు. డిస్ట్రిబ్యూటర్ బాపిరాజు మాట్లాడుతూ, ఈ చిత్రంలో రొమాన్స్ మాత్రమే కాదు అంతకు మించిన భావోద్వేగ సన్నివేశాలున్నాయి. హృదయాలను స్రుపించే స్పృశించే సన్నివేశాలున్నాయి. అందుకే ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించుకున్నా అని చెప్పారు. హీరో వరుణ్ మాట్లాడుతూ, ఇలాంటి చిత్రాలు యువతను చెడిపేస్తున్నాయి అని కొందరు అంటున్నారు. కానీ రియల్ స్టోరీ ప్రేరణతోనే ఈ చిత్రాన్ని తీయడం జరిగింది. రొమాన్స్ అంశాలను సబ్జెక్టు లో భాగంగానే పెట్టడం జరిగింది అని అన్నారు. హీరోయిన్ దివ్యారావు మాట్లాడుతూ, ప్రేమకథ అయినప్పటికీ ఎంతో భావోద్వేగ భరితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అని అన్నారు. ఈ కార్యక్రమంలో నటులు రవి రెడ్డి, మదన్, ఇతర చిత్రబృందం పాల్గొన్నారు.

Recent Post

శాసనమండలి రద్దు తొందరపాటు నిర్ణయమా?  

పుష్కరం క్రితం నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చేతులమీదుగా పునరుద్ధరించబడిన శాసనమండలి నేడు ఆయన కుమారుడి చేతులమీదుగా ఉనికిని కోల్పోవడం యాదృచ్చికం కావచ్చు.  దేశంలో ఇరవై రెండు రాష్ట్రాలు ఉంటె, కేవలం...

అమరావతి నిజంగా “కమ్మరావతి” అవకుండా పోతుందా?

భోగిమంటల్లో కాలిన నివేదికలే గొప్ప అమరావతి చారిత్రక నగరం. శాతవాహనుల నగరం. బౌద్దుల నగరం. అవన్నీ నిజమే. కానీ చంద్రబాబు ప్రభుత్వం నామకరణం చేసిన "అమరావతి"లో ఆ చారిత్రక నగరం ఉందా? ఈ...

వైఎస్ వివేకా డెత్ మిస్టరీ వీడేదెప్పుడు ?

మాజీ మంత్రి వై ఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురయిన విషయం తెలిసిందే. 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందే అయన పై హత్యాయత్నం జరగడం సంచలనం రేపింది. ఎంపీ గా ,...

అమ్మఒడి పేరుతొ దోచుకుంటున్నారు

అమ్మఒడి పేరుతొ నిరుపేదలను దోచుకుంటున్నారు అంటూ మండి పడుతున్నారు టిడిపి నేత చంద్రబాబు నాయుడు. ఆంధ్ర ప్రదేశ్ లో నిరుపేద కుటుంబాల వారు తమ పిల్లలను స్కూల్ కు పంపించేందుకు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన...

ప‌వ‌న్ కోసం బాలీవుడ్ హీరోయిన్‌?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ `పింక్‌` తెలుగు రీమేక్‌తో రెండేళ్ల విరామం తరువాత మ‌ళ్లీ కెమెరా ముందుకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. దిల్‌రాజు, బోనీక‌పూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా రాకెట్ స్పీడుతో షూటింగ్ జ‌రుపుకుంటోంది....

Featured Posts

అమరావతి నిజంగా “కమ్మరావతి” అవకుండా పోతుందా?

భోగిమంటల్లో కాలిన నివేదికలే గొప్ప అమరావతి చారిత్రక నగరం. శాతవాహనుల నగరం. బౌద్దుల నగరం. అవన్నీ నిజమే. కానీ చంద్రబాబు ప్రభుత్వం నామకరణం చేసిన "అమరావతి"లో ఆ చారిత్రక నగరం ఉందా? ఈ...

బిగ్ బ్రేకింగ్‌: గాయ‌ప‌డిన‌ ర‌జ‌నీకాంత్‌

త‌లైవా ర‌జ‌నీకాంత్ గాయ‌ప‌డ్డారు. ఓ డాక్యుమెంట‌రీ షూటింగ్ కోసం మైసూర్‌లోని బండీపూర్ అడ‌వుల‌కు వెళ్లిన ఆయ‌న అదుపు త‌ప్పి కింద‌ప‌డిపోవ‌డంతో స్వ‌ల్ప‌గాయాలైన‌ట్టు తెలుస్తోంది. గ‌త ఏడాది భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీలో డిస్క‌వ‌రీ...

రామ్‌చ‌ర‌ణ్ బ్రిటీష్ అధికారిగానా ఇదేం ట్విస్ట్‌?

`బాహుబ‌లి` విజ‌యంతో తెలుగు సినిమా స్వ‌రూప‌మే ప్రంచ య‌వ‌నిక‌పై స‌మూలంగా మారిపోయింది. టాలీవుడ్‌లో భారీ సినిమా వ‌స్తోందంటే దేశ వ్య‌ప్తంగా అటెన్ష‌న్ క్రియేట్ అవుతోంది. తాజాగా జ‌క్క‌న్న రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న`ఆర్ ఆర్ ఆర్‌`పై...

`వీ` పోస్ట‌ర్ టాక్‌: దేనిని క‌త్తిరించేశాడో ఏమిటో!

నేచుర‌ల్ స్టార్ నాని న‌టిస్తున్న 25వ‌ చిత్రం `వీ`. ఇంద్ర‌గంటి మోహ‌న కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో నాని రెండు విభిన్న పాత్ర‌లు పోషిస్తున్నాడు. ఒక పాత్ర‌లో విల‌న్ గా...

శాసన మండలి రద్దుతో వైసిపికి ప్లస్సెంత? మైనస్సైంత?

  అందరూ ఊహించినట్లుగానే శాసన మండలి రద్దు చేస్తూ శాసన సభలో తీర్మానం చేశారు.ఇక కేంద్రంలో ఉభయ సభలు ఆమోదించిన తదుపరి రాష్ట్ర పతికి వెళ్లి ఆమోద ముద్ర పడితే అంతటితో మండలి కథ...