Home Entertainment Tollywood కొత్త బిజినెస్‌లో అడుగుపెట్ట‌బోతున్న మెగా డాట‌ర్

కొత్త బిజినెస్‌లో అడుగుపెట్ట‌బోతున్న మెగా డాట‌ర్

టాలీవుడ్‌లో ఎక్కువ‌శాతం హీరోల ఫ్యామిలీస్ నుంచి వారి వార‌సులుగా ఇండ‌స్ట్రీకి వాళ్ళ కొడుకులు వ‌చ్చి స‌క్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. కానీ, కూతుళ్ళు వ‌చ్చి స‌క్సెస్ అయిన వాళ్ళు చాలా త‌క్కువ. ఇక ఈ విష‌యానికి వ‌స్తే కృష్ణ కూతురు మంజుల వ‌చ్చి రెండు మూడు చిత్రాల్లో న‌టించింది కానీ పెద్ద‌గా స‌క్సెస్ కాలేదు. ముఖ్యంగా అభిమానులు వారసురాళ్లు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడాన్ని అసలు అంగీకరించరు. అయినా అడపాదడపా స్టార్‌ వారసురాళ్లు ఇండస్ట్రీలో సందడి చేస్తూనే ఉన్నారు. త‌రువాత మంచు ల‌క్ష్మీ కూడా ఏవో టీవీ షోలు అవి చేస్తూ రెండు మూడు చిత్రాల్లో న‌టించి హ‌డావుడి చేసింది కానీ అంత స‌క్సెస్‌లు అయితే ఏమీ లేవు. ఇక ఇటీవ‌లె మ‌హేష్‌బాబు అక్క గంటా ప‌ద్మ అమ‌ర్‌రాజా ఎంట‌ర్ టైన్మెంట్స్‌తో త‌న కొడుకును హీరోగా లాంచ్ చేశారు. ఇక వీళ్ళు ఎంత వ‌ర‌కు స‌క్సెస్ అవుతారో చూడాలి.

ఇక మెగాస్టార్ వారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయమైంది సుష్మిత. చిరు పెద్ద కూతురైన సుష్మిత ఫ్యాషన్‌ డిజైనింగ్‌ చేసింది. అందుకే చిరు తన సినిమాలకు కూతురినే డిజైనర్‌గా తీసుకున్నాడు. చిరు రీ ఎంట్రీ సినిమా ఖైదీ నంబర్‌ 150తో పాటు రంగస్థలం, సైరా నరసింహారెడ్డి లాంటి సినిమాలకు డిజైనర్‌గా పనిచేసింది సుష్మిత. త‌ను చేసింది తక్కువ సినిమాలే అయినా కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా మంచి పేరు తెచ్చుకుంది.

ఇప్పటికే డిజైనర్‌గా మంచి పేరును సంపాదించిన‌ సుష్మిత తాజాగా మరో రంగంలోకి అడుగుపెట్టే ఆలోచనలో ఉందట. త్వరలో తాను సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించే ఆలోచనలో ఉందన్న టాక్‌ వినిపిస్తోంది. ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి అల్లు అరవింద్‌, నాగబాబు, రామ్‌ చరణ్‌లకు సొంత నిర్మాణ సంస్థలు ఉన్నాయి. తాజాగా ఈ లిస్ట్‌లోకి సుష్మిత కూడా అడుగుపెట్టనుందన్న టాక్‌ వినిపిస్తోంది.

అయితే దీనికోసం కాస్త భారీగానే ప్లాన్ చేస్తుంద‌ట‌. ముందుగా చిన్న చిన్న వెబ్ సిరీస్ తో మొద‌లు పెట్టి ఆ త‌రువాత సినిమాలు నిర్మించే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు స‌మాచారం. ఇక ఆల్రెడీ ప‌ని కూడా మొద‌లుపెట్టేసింద‌ట‌. దానికి సంబంధించిన క‌థ‌లు వింటూ. అందుకు సంబంధించి ఇప్పటికే గ్రౌండ్‌ వర్క్‌ కూడా ప్రారంభించిందన్న టాక్‌ వినిపిస్తోంది. అయితే సుష్మిత బ్యానర్‌ ఎప్పుడు లాంచ్‌ చేస్తుందన్న విషయంలో మాత్రం ఇంకా ఎటువంటి అధికారిక ప్ర‌క‌ట‌న రాలేదు.

ఇక ఈ ఫ్యామిలీ నుంచి వ‌చ్చిన నిర్మాత‌ల గురించి చూసుకుంటే మెగాస్టార్‌ వారసుడిగా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన రామ్‌ చరణ్‌ ఘనవిజయం సాధించాడు. తండ్రి రీ ఎంట్రీ సినిమా కోసం నిర్మాతగా మారిన చరణ్‌, కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ బ్యానర్‌ను స్థాపించాడు. ఆ బ్యానర్‌లో తొలి సినిమాగా ఖైదీ నంబర్‌ 150 సినిమాను తెరకెక్కించి సూపర్‌ హిట్ అందుకున్నాడు. తరువాత రెండో సినిమాగా సైరా నరసింహారెడ్డిలాంటి భారీ ప్రాజెక్ట్‌ను రూపొందించాడు ఈ సినిమా కమర్షియల్‌గా నిరాశపరిచినా నిర్మాతగా చరణ్‌కు మంచి పేరు తీసుకువచ్చింది.

Recent Post

వైఎస్ వివేకా డెత్ మిస్టరీ వీడేదెప్పుడు ?

మాజీ మంత్రి వై ఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురయిన విషయం తెలిసిందే. 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందే అయన పై హత్యాయత్నం జరగడం సంచలనం రేపింది. ఎంపీ గా ,...

అమ్మఒడి పేరుతొ దోచుకుంటున్నారు : చంద్రబాబు

అమ్మఒడి పేరుతొ నిరుపేదలను దోచుకుంటున్నారు అంటూ మండి పడుతున్నారు టిడిపి నేత చంద్రబాబు నాయుడు. ఆంధ్ర ప్రదేశ్ లో నిరుపేద కుటుంబాల వారు తమ పిల్లలను స్కూల్ కు పంపించేందుకు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన...

ప‌వ‌న్ కోసం బాలీవుడ్ హీరోయిన్‌?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ `పింక్‌` తెలుగు రీమేక్‌తో రెండేళ్ల విరామం తరువాత మ‌ళ్లీ కెమెరా ముందుకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. దిల్‌రాజు, బోనీక‌పూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా రాకెట్ స్పీడుతో షూటింగ్ జ‌రుపుకుంటోంది....

`ఆర్ ఆర్ ఆర్‌`లో మ‌రో హీరోయిన్‌?

రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న విజువ‌ల్ వండ‌ర్ `ఆర్ ఆర్ ఆర్‌`. ఈ సినిమా ప్ర‌క‌టించిన ద‌గ్గ‌రి నుంచి రోజుకో వార్త హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ కొమ‌రంభీం పాత్ర‌లో, అల్లూరి సీతారామ‌రాజుగా రామ్‌చ‌ర‌ణ్ న‌టిస్తున్న...

విశాఖ రాజధానిని చేస్తే సమస్యలు తప్పవు : జిఎన్ రావు కమిటీ

ఆంధ్ర ప్రదేశ్ లో మూడు రాజధానుల అంశం మొత్తానికి చివరి దశకు చేరుకున్నట్టే. శాసన మండలిలో మూడు రాజధానులకు అనుగుణంగా బిల్లు ప్రవేశకా పెట్టకపోవడంతో జగన్ సర్కార్ శాసన మండలి రద్దు దిశగా...

Featured Posts

బిగ్ బ్రేకింగ్‌: గాయ‌ప‌డిన‌ ర‌జ‌నీకాంత్‌

త‌లైవా ర‌జ‌నీకాంత్ గాయ‌ప‌డ్డారు. ఓ డాక్యుమెంట‌రీ షూటింగ్ కోసం మైసూర్‌లోని బండీపూర్ అడ‌వుల‌కు వెళ్లిన ఆయ‌న అదుపు త‌ప్పి కింద‌ప‌డిపోవ‌డంతో స్వ‌ల్ప‌గాయాలైన‌ట్టు తెలుస్తోంది. గ‌త ఏడాది భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీలో డిస్క‌వ‌రీ...

రామ్‌చ‌ర‌ణ్ బ్రిటీష్ అధికారిగానా ఇదేం ట్విస్ట్‌?

`బాహుబ‌లి` విజ‌యంతో తెలుగు సినిమా స్వ‌రూప‌మే ప్రంచ య‌వ‌నిక‌పై స‌మూలంగా మారిపోయింది. టాలీవుడ్‌లో భారీ సినిమా వ‌స్తోందంటే దేశ వ్య‌ప్తంగా అటెన్ష‌న్ క్రియేట్ అవుతోంది. తాజాగా జ‌క్క‌న్న రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న`ఆర్ ఆర్ ఆర్‌`పై...

`వీ` పోస్ట‌ర్ టాక్‌: దేనిని క‌త్తిరించేశాడో ఏమిటో!

నేచుర‌ల్ స్టార్ నాని న‌టిస్తున్న 25వ‌ చిత్రం `వీ`. ఇంద్ర‌గంటి మోహ‌న కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో నాని రెండు విభిన్న పాత్ర‌లు పోషిస్తున్నాడు. ఒక పాత్ర‌లో విల‌న్ గా...

శాసన మండలి రద్దుతో వైసిపికి ప్లస్సెంత? మైనస్సైంత?

  అందరూ ఊహించినట్లుగానే శాసన మండలి రద్దు చేస్తూ శాసన సభలో తీర్మానం చేశారు.ఇక కేంద్రంలో ఉభయ సభలు ఆమోదించిన తదుపరి రాష్ట్ర పతికి వెళ్లి ఆమోద ముద్ర పడితే అంతటితో మండలి కథ...

ప‌వ‌న్ చూడాలంటే అద్భుతం జ‌ర‌గాలంట‌!

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ల క‌ల‌యిక‌లో వ‌చ్చిన చిత్రం `అల వైకుంఠ‌పుర‌ములో`. ఈ సంక్రాంతికి రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద భారీ విజ‌యాన్ని సాధించి రేసులో ముందుంద‌నిపించింది....