Home Entertainment Tollywood ఆంధ్రాలో పాడ‌మ‌ని న‌న్ను పిల‌వ‌ట్లేదు - బాలు

ఆంధ్రాలో పాడ‌మ‌ని న‌న్ను పిల‌వ‌ట్లేదు – బాలు

కె.జె.ఏసుదాసు సంగీత దాసుడు. సుస్వారాల బాలుడు బాల‌సుబ్ర‌మ‌ణ్యం. తీపి రాగాల కోయిల కె.ఎస్.చిత్ర సినీ వినీలాకాశంలో ఇప్ప‌టికీ ఎప్ప‌టికీ ఆ ముగ్గురు దేదీప్య‌మానంగా వెలిగే తార‌లు. ఆ తార‌లు మ‌న‌కోసం దిగివ‌చ్చే వేళ‌యింది. ఈ ముగ్గురి అపురూప క‌ల‌యిక‌లో న‌వంబ‌ర్ 30న హైద‌రాబాద్ ఎల్‌బి స్టేడియంలో ఎలెవ‌న్ పాయింట్ టు మ‌రియు బుక్ మై షో వారి ఆధ్వ‌ర్యంలో భారీ ఎత్తున సినీ సంగీత విభావ‌రి నిర్వ‌హించ‌నున్నారు. టికెట్లు మ‌రియు ఇతర వివ‌రాల కొర‌కు బుక్ మై షోని సంప్ర‌దించండి. అలేఖ్య హోమ్స్ స‌మ‌ర్పిస్తున్న ఈ కార్య‌క్ర‌మం శ‌నివారం సాయంత్రం 5.30 నిముషాల‌కు మొద‌లు కానుంది. ఈ సంద‌ర్భంగా శుక్ర‌వారం హైదరాబాద్ సోమాజిగూడ పార్క్ హోట‌ల్ లో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో…

బాల‌సుబ్ర‌మ‌ణ్యం మాట్లాడుతూ… మేం ముగ్గురం క‌లిసి ప్రోగ్రాం చేస్తుంన్నాం. మొట్ట మొద‌టిసారిగా సింగ‌పూర్‌లో చాలా అద్భుతంగా చేశారు. ఇప్పుడు హైద‌రాబాద్‌లో నిర్వ‌హిస్తున్నారు. దీనికి కార‌ణ‌మైన లెవ‌న్ టుపాయింట్, అలేఖ్య హోమ్స్ వారికి నా కృత‌జ్ఞ‌త‌లు. ఇంత పెద్ద కార్య‌క్ర‌మం చేసేట‌ప్పుడు దాని వెన‌క ఎంత కాల వ్య‌యం, ధ‌న వ్య‌యం ఉంటుందో గ‌మ‌నించ‌గ‌ల‌రు. ఈ కార్య‌క్ర‌మాన్నిస‌పోర్ట్ చేస్తున్న ప్ర‌తి ఒక్క‌రికి మా ముగ్గురు త‌ర‌పున ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నాను. ఇక్క‌డ ఒక చిన్న ఇబ్బంది కూడా ఉంది. మా ముగ్గురు పాడిన పాట‌ల సంఖ్య ల‌క్ష‌కి పైగా ఉంటాయి. ఒకొక్క‌రు 25, 30 వేలు పాట‌లు పాడాం. మూడుగంట‌ల సేపు జ‌రిగే ఈ కార్యక్ర‌మంలో ఏ పాట‌ల‌ను సెలెక్ట్ చెయ్యాలి ఏమిటి అన్న గ్రౌండ్ వ‌ర్క్ కూడా చాలా ఉంటుంది. మా మీద అభిమానంతో ప్రేమ‌తో అది పాడ‌తారు ఇది పాడ‌తారు అనుకుంటారు. సాధ్య‌మైనంత వ‌ర‌కు అంద‌రికి న‌చ్చే పాట‌ల‌ను ఎంపిక చేసుకుని దాన్ని మీ ముందు ఉంచుతాము. ఈ కార్య‌క్ర‌మానికి వేరే వేరే రాష్ట్రాల‌నుంచి 20 మంది వాద్య బృందంకూడా వ‌స్తున్నారు. ఇది అంత సుభ‌మైన కార్య‌క్ర‌మం కాదు దీని కోసం ఒక ఆరు నెల‌లు ప్రాక్టీస్ కావాలి. మాలో ఉన్న మంచి ల‌క్ష‌ణం ఏమిటంటే ఇంకా మాకు భ‌యం ఉండ‌టం. భ‌య‌ముంటేనే కార్య‌క్ర‌మం బాగా జ‌రుగుతుంది. అంద‌ర్నీ ఆనంద‌ప‌ర‌చ‌డానికి మేము భ‌యంతో భ‌క్తితో శ్ర‌ద్ధ‌తో కృషిచేస్తున్నాము. మీ అంద‌రి అభిమానం, ఆశీస్సుల‌తో ఈ కార్య‌క్ర‌మాన్ని ర‌క్తి క‌ట్టించాలి అన్నారు. అలాగే ఈ సంద‌ర్భంగా ఓ విలేక‌రి అడిగిన ప్ర‌న్న‌కి బాలు ఇలా స్పందించారు. మీరు ఆంధ్రాలో ఎక్కువ‌గా ప్రోగ్రామ్స్ చెయ్య‌డంలేదు అని అడ‌గ‌గా ఆయ‌న దానికి న‌న్ను ఎవ్వ‌ర‌న్నా అక్క‌డ ప్రోగ్రామ్ ఫిక్స్ చేసి పాడ‌మంటే పాడ‌తాను తప్పించి నాకు నేనుగా క‌చేరీని పెట్టుకోలేనుగా అన్నారు. ఆంధ్రాలో న‌న్ను ఎవ్వ‌రూ పాడ‌మ‌ని అడ‌గ‌డం లేదు. అందువ‌ల్లే అది కుద‌ర‌డం లేదు అన్నారు.

Recent Posts

సిట్ ఏర్పాటుపై తెలుగు దేశం గుండెల్లో పరిగెత్తుతున్న రైళ్లు 

ప్రతివారం మొక్కు తీర్చుకుంటున్నట్లే ఈ వారం కూడా తన బాధ ప్రపంచం బాధ అన్నట్లు రోతపలుకుల రాధాకృష్ణ  "రాజు కక్షకు రాజ్యం బలి" అనే మకుటం కింద   వలవల ఏడుస్తూ మనలను కూడా...

అసైన్డ్ భూముల సేకరణ వైసిపికి మెడ మీద కత్తే!

ఉగాది నాటికి 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని అందుకు అవసరమైన భూముల సేకరించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం జిల్లా కలెక్టర్లు ఇతర రెవిన్యూ సిబ్బంది...

అయిదు ఏళ్ల పాలనపై సిట్! నెవెర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్!

రాష్ట్ర విభజన తర్వాత అయిదు ఏళ్ల కాలంలో టిడిపి ప్రభుత్వం సాగించిన పరిపాలన పై మొత్తంగా విచారణకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. బహుశా దేశంలోనే ఈలాంటి విచారణ ఇంతకు...

ఎత్తుకు పై ఎత్తుల్లో తెలుగు దేశం చిత్తు

చంద్రబాబు నాయుడు ప్రాపకం ఏ మాత్రం లేకుండా తుడిచి పెట్టే ఎత్తులో మూడు రాజధానుల ప్రతిపాదన ముఖ్యమంత్రి తెరమీదకు తెచ్చారు. అయితే రాజధాని రైతుల ఆందోళన దానికి రాష్ట్రంలోని అన్ని పార్టీలు మద్దతు...

నిన్న సుక్కు .. నేడు వంశీ పైడిప‌ల్లి?

మ‌హేష్ క్రేజీ డైరెక్ట‌ర్‌ల‌తో ఆడుకుంటున్నాడా?.. త‌న‌కు న‌చ్చలేద‌ని ఇష్టం వ‌చ్చిన‌ట్టు డైరెక్ట‌ర్‌ల‌ని మార్చేస్తున్నాడా? అంటే జ‌రుగుతున్న ప‌రిణామాల్ని చూసిన ఇండ‌స్ట్రీ జ‌నాలు నిజ‌మే అంటున్నారు. `మ‌హ‌ర్షి` త‌రువాత మైత్రీలో మ‌హేష్ హీరోగా కొత్త...

త‌రుణ్‌భాస్క‌ర్ ఇలా షాకిచ్చాడేంటి?

టాలీవుడ్‌కు రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ని హీరోగా అందించిన త‌రుణ్ భాస్క‌ర్ ద‌ర్శ‌కుడిగా సినిమా చేసి దాదాపు రెండేళ్ల‌వుతోంది. `మీకు మాత్ర‌మే చెప్తా` అంటూ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఎలా హ‌డావిడిగా ఈ...

తేజ బర్త్‌డేకు డ‌బుల్ ధ‌మాకా ఇచ్చాడు!

కెరీర్ తొలి నాళ్ల‌లో ద‌ర్శ‌కుడిగా సంచ‌ల‌నం సృష్టించిన తేజ జోరు ఇటీవ‌ల బాగా త‌గ్గిపోయింది. వ‌రుస ఫ్లాపులు.. నిర్మాత‌ల‌తో వివాదాలు.. ఇక సినిమాలు ఆపేయాలేమో అనే స‌మ‌యంలోనే రానాతో `నేనే రాజు నేనే...

`భీష్మ‌` ఓపెనింగ్ అదిరింది!

నితిన్ న‌టించిన తాజా చిత్రం `భీష్మ‌`. టీజ‌ర్ రిలీజ్ నుంచే ఈ సినిమాపై పాజిటివ్ టాక్ మొద‌లైంది. తొలి రోజు తొలి షో నుంచి హిట్ టాక్ రావ‌డంతో సినిమా బ్లాక్‌బ‌స్ట‌ర్ అని...

ఫ్లాప్ డైరెక్ట‌ర్‌తో రామ్‌చ‌ర‌ణ్ ప్ర‌యోగం!

సినిమా ఇండ‌స్ట్రీలో హిట్ మాత్ర‌నమే మాట్లాడుతుంది. ఏదైనా చేస్తుంది. ఎంత వ‌ర‌కైనా తీసుకెళుతుంది. అడ‌గ‌ని అంద‌లం ఎక్కిస్తుంది. అదే ఒక్క ఫ్లాప్ ప‌డిందా అదఃపాతాళానికి తొక్కేస్తుంది. దీన్ఇన బ‌ట్టే ఇక్క‌డ క‌థ‌లు, కాంబినేష‌న్‌లు,...

తెలుగోడా – ఆపక్కనుంటావా? – ఈ పక్కనుంటావా?

"విశ్వసనీయత కోల్పోతున్న మీడియా, దిగజారుతున్న విలువలు," అని ఒక ఆంగ్ల పత్రికలో వ్యాసం. "రాజధాని గుండె పగిలింది" అంటూ ఒక తెలుగు పత్రికలో ప్రత్యేక కథనం. "రాజధాని అక్రమాలపై సిట్" అంటూ మరో...

Featured Posts

సిట్ ఏర్పాటుపై తెలుగు దేశం గుండెల్లో పరిగెత్తుతున్న రైళ్లు 

ప్రతివారం మొక్కు తీర్చుకుంటున్నట్లే ఈ వారం కూడా తన బాధ ప్రపంచం బాధ అన్నట్లు రోతపలుకుల రాధాకృష్ణ  "రాజు కక్షకు రాజ్యం బలి" అనే మకుటం కింద   వలవల ఏడుస్తూ మనలను కూడా...

అయిదు ఏళ్ల పాలనపై సిట్! నెవెర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్!

రాష్ట్ర విభజన తర్వాత అయిదు ఏళ్ల కాలంలో టిడిపి ప్రభుత్వం సాగించిన పరిపాలన పై మొత్తంగా విచారణకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. బహుశా దేశంలోనే ఈలాంటి విచారణ ఇంతకు...

ఎత్తుకు పై ఎత్తుల్లో తెలుగు దేశం చిత్తు

చంద్రబాబు నాయుడు ప్రాపకం ఏ మాత్రం లేకుండా తుడిచి పెట్టే ఎత్తులో మూడు రాజధానుల ప్రతిపాదన ముఖ్యమంత్రి తెరమీదకు తెచ్చారు. అయితే రాజధాని రైతుల ఆందోళన దానికి రాష్ట్రంలోని అన్ని పార్టీలు మద్దతు...