Home Entertainment Tollywood అన‌న్య‌కి అలాంటి వాడు మొగుడుగా వద్దంట‌...?

అన‌న్య‌కి అలాంటి వాడు మొగుడుగా వద్దంట‌…?

ప్ర‌తి ఆడ‌పిల్ల కోరుకునేది ఒక్క‌టే అది త‌న భ‌ర్త నుంచి అయినా బాయ్‌ఫ్రెండ్ నుంచి అయినాస‌రే. అదేమిటంటే ఏ ఆడ‌పిల్లైనా త‌న భ‌ర్త లేదా బాయ్‌ఫ్రెండ్ త‌న‌నే చూడాలి. త‌న‌నే ఇష్ట‌ప‌డాలి. పూర్తిగా త‌న‌కే ద‌క్కాలనుకుంటారు. ఇది చాలా కామ‌న్ విష‌యం. అందుకు హీరోయిన్స్ కూడా మిన‌హాయింపు ఏమీ కాదు. ఇక ఇదిలా ఉంటే… పరాయి స్త్రీపై కన్నేసే వ్యక్తి తనకు బాయ్‌ఫ్రెండ్‌గా కానీ భర్తగా కానీ రాకూడదని అంటున్నారు బాలీవుడ్ నటి అనన్య పాండే. ఆమె కథానాయికగా నటించిన సినిమా ‘పతి పత్ని ఔర్ వో’. ముదస్సర్ అజీజ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కార్తిక్ ఆర్యన్ హీరోగా నటించారు. మరో నటి భూమి పెడ్నేకర్ కార్తిక్ భార్య పాత్రను పోషించారు. ఇందులో అనన్య.. కార్తిక్ రెండో ప్రేయసిగా కన్పించనున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తనకు ఎలాంటి వ్యక్తి బాయ్‌ఫ్రెండ్‌గా భర్తగా రావాలని అనుకుంటున్నారో వెల్లడించారు.

‘నేను ప్రేమ విషయంలో చాలా నిజాయతీగా ఉంటాను. నా సంతోషం కోసం మరొకరి కాపురాలు కూల్చే టైప్ కాదు నేను. నేను చాలా రొమాంటిక్. నాకు ప్రేమలో పడటం అంటే ఇష్టం. నాకు చాలా రిలేషన్‌షిప్స్ ఉండేవి. అందులో తప్పు లేదు. స్కూల్లో చదువుకునేటప్పుడు చిన్న చిన్న లవ్ స్టోరీస్ అందరికీ ఉంటాయి. అయితే ఈ సినిమాలో కార్తిక్ ఆర్యన్ పెళ్లైనప్పటికీ మరో అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడు. అలాంటి వ్యక్తిని నాకు బాయ్‌ఫ్రెండ్‌గా భర్తగా అస్సలు వద్దు. నేను చాలా నిజాయతీగా ఉంటాను. కాబట్టి నా బాయ్‌‌ఫ్రెండ్ నుంచి కూడా అదే నిజాయతీని కోరుకుంటాను’ అని చెప్ప‌క‌నే చెప్పింది ఈ బాలీవుడ్ భామ‌.

‘సాహో’ సినిమాలో విలన్ పాత్రలో నటించిన ప్రముఖ బాలీవుడ్ నటుడు చుంకీ పాండే కూతురు అనన్య పాండే. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ సినిమాతో ఆమె తన బాలీవుడ్ జర్నీ ప్రారంభించారు. కానీ తొలి సినిమానే బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయింది. ఇప్పుడు ‘పతి పత్ని ఔర్ వో’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక ఈ భామ ఇలాంటి పాత్ర‌లు రీల్ లైఫ్‌కి ఓకే రియ‌ల్ లైఫ్‌కి నో అంటున్నారు.

Recent Posts

వెంకీ స్టోరీ మాస్ రాజా ద‌గ్గ‌రికి!

ఒక హీరో కోసం అనుకున్న క‌థ అక్క‌డ వ‌ర్క‌వుట్ కాక‌పోతే వెంట‌నే మ‌రో హీరో ద‌గ్గ‌రికి వెళ్ల‌డం ఇండ‌స్ట్రీలో వెరీ కామ‌న్‌. అలా చేతులు మారిన క‌థ‌లు కొంత మందికి బ్లాక్ బ‌స్ట‌ర్‌ల‌ని,...

మ‌హేష్‌కు బాలీవుడ్ ఆఫ‌ర్‌?

`స‌రిలేరు నీకెవ్వ‌రు` బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌రువాత మ‌హేష్ ఫ్యామిలీతో క‌లిసి యుఎస్‌కి వెకేష‌న్‌కి వెళ్లిన విష‌యం తెలిసిందే. వంశీ పైడిప‌ల్లి చిత్రాన్ని ప‌క్క‌న పెట్టి మైత్రీ మూవీమేక‌ర్స్‌కి ఓ భారీ ఫ్యామిలీ...

బాల‌య్య కోసం రీమిక్స్ సాంగ్‌!

బాల‌కృష్ణ కెరీర్ ప‌రిస్థితి ప్ర‌స్తుతం ఏమీ బాగాలేదు. తండ్రి బ‌యోపిక్ అంటూ హ‌డావిడి చేసినా ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. పేరు మాట అటుంచితే ఎన్టీఆర్ బ‌యోపిక్ భారీ నష్టాల‌ని తెచ్చిపెట్టింది. దీని త‌రువాత చేసిన...

క్రిష్ క్రేజీ హీరోయిన్‌ని ఫిక్స్ చేశాడు!

రెండేళ్ల విరామం త‌రువాత ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ మ‌ళ్లీ వ‌రుస ప్రాజెక్ట్‌ల‌తో వేగం పెంచారు. దిల్ రాజుతో క‌లిసి బోనీ క‌పూర్ నిర్మిస్తున్న బాలీవుడ్ హిట్ ఫిల్మ్ `పింక్‌` రీమేక్‌లో న‌టిస్తున్నారు. ఈ మూవీ...

మ‌హేష్ అతిథి పాత్ర‌కు సై అనేసిన‌ట్టేనా?

చిరంజీవి హీరోగా కొర‌టాల శివ ఓ భారీ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. చిరు 152వ చిత్రంగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో న‌క్స‌లైట్ నేప‌థ్యాన్ని, దేవా దాయ శాఖ‌లో జ‌రిగిన ఓ కుంభ‌కోణాన్ని కొర‌టాల శివ...

ప్ర‌భాస్ – నాగ్ అశ్విన్ చిత్రం పాన్ ఇండియా కాదా?

వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్‌లో ప్ర‌భాస్ చేయ‌బోతున్న తాజా చిత్రాన్ని చిత్ర బృందం బుధ‌వారం ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. వైజ‌యంతీ మూవీస్ 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేప‌థ్యంలో అత్యంత భారీ స్థాయిలో ప్ర‌తిష్టాత్మ‌కంగా...

సీఎం జ‌గ‌న్‌తో టాలీవుడ్ నిర్మాత‌ల భేటి!

ఉన్న‌ట్టుండి ఏపీ సీఎంపై టాలీవుడ్ నిర్మాత‌ల‌కు ప్రేమ పుట్టుకొచ్చింది. తాడేప‌ల్లిగూడెంలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌తో ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు. దీని వెన‌క ఏదో పెద్ద మ‌త‌ల‌బే వుంద‌ని...

క్రేన్ ఘ‌ట‌న‌పై శంక‌ర్ షాకింగ్ ట్వీట్‌!

`ఇండియ‌న్‌-2` సినిమా షూటింగ్ జ‌రుగుతుండ‌గా 150 అడుగుల ఎత్తునుంచి లైటింగ్ కోసం ఏర్పాటు చేసిన క్రేన్ విరిగిప‌డ‌టంతో ఘోర ప్ర‌మాదం జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు సిబ్బంది అక్క‌డిక‌క్క‌డే మృతి...

జగన్ ప్రభుత్వానికి రాయిటర్స్ నేర్పిన పాఠం

తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మీడియాకు ఒక రాజకీయ మరియు వ్యాపార ఎజెండా ఉంది. ఈ రెండు కారణాలే కాకుండా 2000 దశకం తర్వాత నుండి కులం కూడా...

మీడియాను నియంత్రించాలా?

ఒక రాజకీయ విశ్లేషకుడిగా,  రచయితగా,  ప్రజాస్వామ్య ప్రేమికుడిగా మీడియాను నియంత్రించాలనుకునే ఆలోచనలను నేను తిరస్కరిస్తాను.  మీడియా అనేది ప్రజాస్వామ్యానికి ఆలంబన.  మీడియా అనేది మత్తేభాలలాంటి  ప్రభుత్వ దుర్విధానాలను అదుపులో ఉంచే పదునైన అంకుశం. ...

Featured Posts

జగన్ ప్రభుత్వానికి రాయిటర్స్ నేర్పిన పాఠం

తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మీడియాకు ఒక రాజకీయ మరియు వ్యాపార ఎజెండా ఉంది. ఈ రెండు కారణాలే కాకుండా 2000 దశకం తర్వాత నుండి కులం కూడా...

మీడియాను నియంత్రించాలా?

ఒక రాజకీయ విశ్లేషకుడిగా,  రచయితగా,  ప్రజాస్వామ్య ప్రేమికుడిగా మీడియాను నియంత్రించాలనుకునే ఆలోచనలను నేను తిరస్కరిస్తాను.  మీడియా అనేది ప్రజాస్వామ్యానికి ఆలంబన.  మీడియా అనేది మత్తేభాలలాంటి  ప్రభుత్వ దుర్విధానాలను అదుపులో ఉంచే పదునైన అంకుశం. ...

ఆంధ్ర ప్రదేశ్ లో ముఖ్యమంత్రికి ప్రధాన శత్రువు ఎవరు?

కారణాలు ఏవైనా కావచ్చు. కొన్ని వివాదాస్పద నిర్ణయాలు తీసుకొని వుండవచ్చు. అవి కాస్తా పక్కన బెడితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తొమ్మిది నెలల కాలంలో రాష్ట్రంలోని అన్ని ప్రతి పక్షాలు...