Home Entertainment Kollywood త్రిష ఎప్పటికి మరిచిపోలేని రెండు పాత్రలు !

త్రిష ఎప్పటికి మరిచిపోలేని రెండు పాత్రలు !

త్రిష కెరీర్ అయిపోయింది అనుకుంటున్న సమయంలో ’96’ త్రిష సెకండ్ ఇన్నింగ్స్‌కు మంచి బాట వేసింది. అందరినీ ఆకట్టుకునేలా,ఫీల్ గుడ్ కథతో,వాస్తవిక కోణంలో తెరకెక్కించాడు దర్శకుడు సి.ప్రేమ్ కుమార్. 96 చిత్రానికి ముందు త్రిష మార్కెట్‌ చాలా డౌన్‌ అయిపోయ్యింది. తను నటించిన హీరోయిన్‌ సెంట్రిక్‌ కథా చిత్రాలు ఘోరంగా నిరాశ పరిచాయి. అలాంటి పరిస్థితుల్లో వచ్చిన చిత్రం ’96’. త్రిష విజయ్‌సేతుపతితో కలిసి నటించిన ఈ చిత్రం అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. ఇందులో జాను పాత్రలో నటించిన త్రిషపై విమర్శకులు ప్రశంసల వర్షం కురిపించారు.
 
ప్రశంసలతో పాటు ఈ సినిమా త్రిషకు అత్యధిక అవార్డుల్ని తెచ్చిపెట్టింది. ‘ఏషియన్ ఫిల్మ్ అవార్డ్స్’ నుంచి నిన్నటి ‘ఫిల్మ్ ఫేర్’ వరకు త్రిష మొత్తం 11 అవార్డులని ఈ సినిమాతో సొంతం చేసుకోవడం ఒక రికార్డు. ’96’ అంత విజయం సాధిస్తుందని త్రిషనే ఊహించలేదట. ’96` సినిమాపై నాకు మొదట్లో పెద్దగా నమ్మకాలు లేవు. పాత్ర చాలా సింపుల్‌గా బాగుంది అనుకున్నాను. అటువంటి పాత్రలో నటించిన చిత్రం ఇంత పేరు తెచ్చిపెడుతుందని ఊహించలేదు. సినిమా సక్సెస్‌ అవుతుందని.. అందులోని రామ్, జాను పాత్రల్లో ప్రేక్షకులు తమను చూసుకుంటారని భావించానని చెప్పింది. అయితే ఒక సాధారణ పసుపురంగు చుడీదార్‌ ధరించి నటించిన పాత్ర ఎంతగానో ఆదరింపబడిందని అంది. అంత నిరాడంబర రూపంలో ఆ చిత్రంలో కనిపించానని పేర్కొంది. నిరాడంబరత ఎప్పుడూ ఆదరింపబడుతుందని… అలా ఒకటి రెండు కథా పాత్రలు మ్యాజిక్‌గా నిలుస్తాయని అంది.
 
నా కెరీర్‌లో `విన్నైతాండి వరువాయా` (తెలుగులో ‘ఏ మాయ చేశావే’) సినిమాలోని జెస్సీ పాత్ర, `96`లోని జాను పాత్ర మ్యాజిక్ క్రియేట్ చేశాయి. ఆ రెండింటినీ ఎప్పటికీ మర్చిపోలేన`ని త్రిష చెప్పింది

Recent Posts

30 ఇయర్స్ పృథ్వీ ఇప్పుడు ఏం చేస్తురో తెలుసా?

టాలీవుడ్ కమెడియన్ 30 ఇయర్స్ పృథ్వీ‌ ఏమైపోయారు, ఎక్కడున్నారు? తెలుగు సినీ ఇండస్ట్రీ మొత్తం ఆయనను దూరం పెట్టిందా? ఆయన చేసిన ఓ చిన్న తప్పిదానికి రాజకీయ భవిష్యత్తు కూడా ముగిసిపోయిందా..? తెలుగు సినీ...

‘ఆపరేషన్ నమస్తే’ రంగంలోకి దిగిన ఆర్మీ.. ఏం చేయబోతోంది?

ప్రపంచ దేశాలను వణికిస్తూ విలయ తాండవం చేస్తోన్న కరోనా కట్టడికి కేంద్రం నడుంబిగించింది. ఇప్పటికే దేశంలో లాక్ డౌన్ ప్రకటిచగా ఇప్పుడు ఆర్మీని రంగంలోకి దింపింది. 'ఆపరేషన్ నమస్తే' పేరిట కరోనాపై యుద్ధనికి...

తిరుమలలో కొండెక్కిన అఖండ దీపం..?!

క‌రోనా ప్రభావంతో తిరుమల శ్రీవారి ఆలయం సహా దేశంలోని ప్రముఖ ఆలయాలన్నీ మూతపడ్డ విషయం విధితమే. అయితే భక్తులకు దర్శనాన్ని ఆపేసినా తిరుమలలో స్వామివారికి నిత్యం నిర్వహించే పూజలు, కైంకర్యాలు మాత్రం యథావిధిగా...

మాస్ట‌ర్ మైండ్ ఎందుకు ఫెయిల‌య్యాడు?

ఇండ‌స్ట్రీలో వున్న నిర్మాత‌ల్లో అల్లు అర‌వింద్ మాస్ట‌ర్ మైండ్ అన్న విష‌యం తెలిసిందే. ఎంత ప్ర‌తికూల ప‌రిస్థితుల్ని అయినా త‌న‌కు అనుకూలంగా మార్చుకోవ‌డంలో అల్లు అర‌వింద్‌ని మించిన వారు లేర‌న్న‌ది ఇండస్ట్రీ వ‌ర్గాల...

ప్ర‌దీప్ మాచిరాజు మళ్లీ మొద‌లుపెట్టాలా?

ప్ర‌దీప్ మాచిరాజు.. బుల్లితెర‌పై స‌క్సెస్‌ఫుల్ యాంక‌ర్‌. ప్ర‌ముఖ టెలివిజ‌న్ ఛాన‌ల్‌లో ప్ర‌దీప్ త‌న పేరే వినిపించేలా చేసుకున్నాడు. అయితే బుల్లితెర‌పై క్రేజ్‌ని సొంతం చేసుకున్న ప్ర‌దీప్‌కు వెండితెర‌పై ఆక‌ట్టుకోవాల‌నే ఆశ మొద‌లైంది. దీంలో...

మ‌నోజ్‌కు విష్ణు ఇచ్చిన స‌ల‌హా ఏంటీ?

హీరో మంచు మ‌నోజ్ ఇటీవ‌ల అత‌ని భార్య‌తో విడిపోయాడు. ఈ విష‌యాన్ని వెల్ల‌డించ‌డానికి చాలానే స‌మ‌యం తీసుకున్నాడు. వ‌రుస పుకార్ల త‌రువాత సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌న భార్య‌తో విడిపోయిన‌ట్టు వెల్ల‌డించాడు. ఆ...

భ‌ళా రాజ‌మౌళి భ‌ళా…ఎవ్వ‌రినీ తగ్గించ‌లేదే!

తెలుగులో మ‌ల్టీస్టార‌ర్ చిత్రాల‌కి ప్ర‌ధాన అడ్డంకి ఇద్ద‌రు హీరోల‌కు స‌మ ప్రాధాన్య‌త‌. కథ డిమాండ్ చేసినా చేయ‌కపోయినా ఇద్ద‌రు హీరోల్లో ఏ ఒక్క‌రికీ ప్ర‌ధాన్యం పెర‌గ‌కూడ‌దు త‌గ్గ‌కూడ‌దు. పెరిగితే త‌గ్గిన హీరో ఫ్యాన్స్...

పోగొట్టుకున్న చోటే వెతుక్కుంటోన్న చంద్రబాబు!

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రులు ఎవరూ ఉండరు అనే నానుడి మరోసారి రుజువవుతోంది. రాజకీయాల్లో గెలుపు, ఓటములు ఎప్పుడు ఎవరిని ఎటువైపుకి నడిపిస్తాయో.. ఎలాంటి నిర్ణయాలు తీసుకునేలా చేస్తాయో ప్రస్తుతం మాజీ...

జగన్‌ నిర్ణయానికి మద్దతిచ్చిన చంద్రబాబు!

ఉప్పు, నిప్పులా ఒకరిపై ఒకరు చిటపటలాడుతూ.. తీవ్ర విమర్శలు చేసుకునే అధికార, ప్రతిపక్ష నేతలు వారు. కానీ ఇప్పుడు ఒకరు తీసుకున్న కఠిన నిర్ణయానికి మరొకరు మద్దతుగా నిలిచారు. వందశాతం సమర్థించారు. పైగా...

కేసీఆర్ మాటల ఆంతర్యం అదేనా?

ప్రస్తుత కష్టకాలంలో తెలంగాణలో ఎవరూ ఆకలితో అలమటించకుండా చూసే బాధ్యత తీసుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రజల, విద్యార్థులను కూడా కాపాడుకుంటామని పెద్ద మనసు చాటుకునన్నారు. ఈ విషయంలో ఎవరూ ఏ...

Featured Posts

జగన్‌ నిర్ణయానికి మద్దతిచ్చిన చంద్రబాబు!

ఉప్పు, నిప్పులా ఒకరిపై ఒకరు చిటపటలాడుతూ.. తీవ్ర విమర్శలు చేసుకునే అధికార, ప్రతిపక్ష నేతలు వారు. కానీ ఇప్పుడు ఒకరు తీసుకున్న కఠిన నిర్ణయానికి మరొకరు మద్దతుగా నిలిచారు. వందశాతం సమర్థించారు. పైగా...

వీరికి  లాక్ డౌన్ వర్తించదా?

 ప్రపంచంలోని నూట తొంభై అయిదు దేశాలను గడగడలాడిస్తూ, ఇప్పటివరకు పద్దెనిమిది వేలమంది ప్రాణాలను తీసి, లక్షలాదిమందికి ఆసుపత్రుల పాలు చేసిన భయంకరమైన కరోనా వైరస్ (కోవిద్ 19 ) ఆ రెండుమూడు గ్రామాల...

షాకింగ్‌…. క‌ర్ఫ్యూ మొత్తం 21 రోజులు… క‌రోనా క‌ట్ట‌డికి ఇదే మార్గం..!

వేలాది మందిని నిలువునా పొట్ట‌పెట్టుకుంటున్న క‌రోనా దెబ్బకు ప్ర‌పంచం మొత్తం మూత‌బ‌డుతోంది. దేశ దేశాల‌న్నీ విధిలేక క‌ర్ఫ్యూ విధిస్తున్నాయి. భార‌త్‌లో ఇప్ప‌టికే వారం రోజుల పాటు పూర్తిగా ర‌వాణా నిలిపివేశారు. దాదాపు 75...