fbpx
Home Politics ఓటరు కార్డు లేకున్నా ఈ 13 కార్డులు చూపించి ఓటు వేయవచ్చు

ఓటరు కార్డు లేకున్నా ఈ 13 కార్డులు చూపించి ఓటు వేయవచ్చు

తెలంగాణలో శుక్రవారం ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసినట్టు ప్రకటించింది. కొద్ది సేపటి క్రితమే మైకుల మోత బంద్ అయ్యింది. ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడుతారు అన్న చర్చల్లో జనాలు మునిగిపోయారు.

మరో వైపు పట్టణాలు, నగరాల్లో ఉన్న వారంతా పల్లె బాట పడుతున్నారు. అయితే  ఓటరు కార్డు ఉంటేనే ఓటు వేయనిస్తారు అన్న అపోహ ఉంటుంది.  కానీ అటువంటి భయం లేకుండా 13 రకాల కార్టులను చూపించి ఓటు వేయవచ్చని  తెలంగాణ ఎన్నికల సంఘం సీఈవో  అధికారి రజత్ కుమార్ ప్రకటించారు. ఓటరు కార్డు లేకపోయినా సరే… ఓటర్ లిస్టులో పేరు ఉంటే  తమ వద్ద ఉన్న  కార్డు చూపించి ఓటు హక్కును సద్వినియోగపరుచుకోవచ్చు.  ఏ ఏ కార్డులు చెల్లుతాయి.

1.పాస్ పోర్ట్

2.డ్రైవింగ్ లైసెన్స్

3.ఆధార్ కార్డు

4.ఉపాధి హామీ పథకం కార్డు

5.ఆరోగ్య బీమా కార్డు

6.పాన్ కార్డు

7.ప్రభుత్వ, ప్రభుత్వ రంగ, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలలో పని చేస్తున్న ఉద్యోగులు ఐడి కార్డు చూపించి ఓటు వేయవచ్చు.

8.బ్యాంకు పాసు పుస్తకం

9. పోస్టాఫీస్ పాసు పుస్తకం

10.ఆర్ జీఐ జారీ చేసిన ఎన్ పీఆర్ స్మార్ట్ కార్డు

11.ఫోటోతో కూడిన పెన్షన్ డాక్యుమెంట్

12. ఈసీ జారీ చేసిన ఫోటోతో కూడిన ఓటరు స్లిప్పు

13. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల గుర్తింపు కార్డు

5 వతేది సాయంత్రం ఎన్నికల ప్రచారం ముగిసింది. ప్రచార గడువు ముగిసినప్పటి నుంచి మద్యం అమ్మకాలను కూడా నిలిపి వేయాలని ఈసీ ఆదేశించింది. డిసెంబర్ 5 వ తేది సాయంత్రం నుంచి 7 వతేది సాయంత్రం 5 గంటల వరకు డ్రై డేగా పాటించాలని సీఈవో రజత్ కుమార్ తెలిపారు. ఒపీనియన్ సర్వేలు, ఇతరాత్ర ఎన్నికల కార్యక్రమాలను ప్రసారం చేయడం నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందన్నారు. సెల్ ఫోన్లను పోలింగ్ బూత్ కు అనుమతించరు.

పోలింగ్ కోసం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 32,815 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల బందోబస్తు పై పోలీసు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. భద్రతాపరంగా అనుసరించాల్సిన వ్యూహాల పై ఇప్పటికే డిజిపి ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు. 

డిసెంబర్ 7 వ తేది ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికల పోలింగ్ జరగనుంది. సాయంత్రం 5 గంటల వరకు లైన్ లో ఉన్న వారందరిని కూడా ఓటు వేసేందుకు అనుమతిస్తారు. 5 దాటిన తర్వాత వచ్చే వారికి  ఓటు వేసే అవకాశం ఉండదు. ప్రజలంతా కూడా ముందుగానే వచ్చి ఓటు వేయాలని ఎన్నికల అధికారులు తెలిపారు. 

 

మందు తాగొస్తే ఓటు ఉండదు

మందు తాగి బండి నడిపితే పోలీసులు బ్రీత్ ఎనలైజర్ లతో పోలీసులు పరీక్షలు చేయడం సాధారణమే. కానీ ఈ సారి ఎన్నికలలో అటువంటి సీన్లు కన్పించనున్నాయి. మద్యం తాగి ఓటు వేసేందుకు వస్తే పోలీసుల ఆపుతారు. ఓటు వేసేందుకు అనుమతించరు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద బ్రీత్ ఎనలైజర్ చేసిన తర్వాతనే పోలింగ్ బూత్ లోకి అనుమతిస్తారు. మందు తాగినట్టు తేలితే అరెస్టు చేసి కేసు నమోదు చేస్తారు.  

ఈ ఎన్నికల బరిలో మొత్తం 119 నియోజకవర్గాల్లో 1821 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 32815 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అత్యధికంగా హైదరాబాద్‌లో 3873, వనపర్తిలో 280 పోలింగ్‌కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎన్నికల విధుల కోసం 1,60,509 మంది సిబ్బందిని కేటాయించారు. ఎన్నికల కోసం 55,329 బ్యాలెట్‌ యూనిట్లు, 42,751 వీవీప్యాట్‌ యంత్రాలు, 39,763 కంట్రోల్‌ యూనిట్లను వినియోగించనున్నారు.

 

ఎన్నికల విధుల్లో 649 మంది సహాయక రిటర్నింగ్‌ అధికారులు ఉంటారు. ఎన్నికల విధుల కోసం 279 మంది కేంద్ర కంపెనీల బలగాలు రాష్ట్రంలో మోహరించనున్నాయి. 30వేల మంది రాష్ట్ర భద్రతా సిబ్బంది విధుల్లో పాల్గొననున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,80,64,684 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికల ఫలితాలు ఈ నెల 11న వెలువడనున్నాయి.

తెలుగురాజ్యం ప్రత్యేకం

విజయ్ ఆంటోనీ ‘కిల్లర్’ ట్రైలర్ రివ్యూ!

  ‘బిచ్చగాడు’ విజయ్ ఆంటోనీ ‘కిల్లర్’ ట్రైలర్ విడుదలయ్యింది. తమిళంలో ‘కలైగరన్’ (హంతకుడు) గా నిర్మించి తెలుగులోకి డబ్ చేసిన ‘కిల్లర్’ కి ఆండ్రూ లూయిస్దర్శకత్వం వహించాడు. ఇతను 2012 లో కొత్త వాళ్లతో...

బాబు గారి ‘Is It not వివక్షత’ కి ఈసీ కౌంటర్?

చంద్ర బాబు గారు ఎలక్షన్ కమిషన్ ని కలిసిన తర్వాత మాట్లాడుతూ పోలింగ్ జరిగిన 30 రోజుల తర్వాత ఎలా రీపోలింగ్ నిర్వహిస్తారని , is this not వివక్షత అంటూ ప్రశ్నించారు....

‘ఎబిసిడి’ రివ్యూ – చిన్న మహర్షి అవుదామనుకుంటే…

ఐదు సినిమాల అల్లుశిరీష్ యువహీరోగా నిలదొక్కుకోవడానికి స్ట్రగుల్ చేస్తున్నాడు. ఆరో సినిమాగా నాలుగక్షరాల ‘ఎబిసిడి’ కొచ్చాడు. రీమేక్ తో, కొత్త దర్శకుడితో ఒక ప్రయోగం చేస్తున్నట్టు చెప్పాడు. అట్టహాసంగా 600 పై చిలుకు...

అత్యంత ప్రజాధారణ

తాజా వార్తలు

‘సీత’వివాదం: తేజ క్షమాపణ చెప్పాల్సిందే,లేదా కేసు

వివాదం లేనిదే పెద్ద సినిమా ఉండదా అనే విధంగా ప్రతీ సారి ఏదో వివాదం చెలరేగుతూనే ఉంది. తాజాగా తేజ దర్శకత్వంలో బెల్లంకొండ హీరోగా.. కాజల్ అగర్వాల్ టైటిల్ పాత్రలో నటించిన ‘సీత’...

‘టిక్‌ టాక్‌’ టాప్ సెలబ్రిటీని దారుణంగా చంపేసారు

ఇండియాలో పాపులర్ అయిన టిక్ టాక్ యాప్‌‌లో లక్షల మంది ఫాలోవర్లను కలిగి ఉన్న మోహిత్ మోర్ అనే 24ఏళ్ల యువకుడు హత్యకు గురవ్వడం ఢిల్లీలో సంచలనంగా మారింది. ముగ్గురు గుర్తు తెలియని...

‘జబర్దస్థ్’ లో సడెన్ ట్విస్ట్… సీన్ లోకి సీనియర్ కమిడియన్

తెలుగు టీవీ రంగంలో బాగా పాపులర్ అయిన కామెడీ షో 'జబర్దస్థ్' అనేది ఎవరూ కాదనిలేని సత్యం. ఆ పోగ్రాం సక్సెస్ అవటంతో ఎక్స్ ట్రా జబర్ధస్త్ కూడా మొదలు పెట్టారు. అదీ...

న్యూడ్ ఫొటోలు పంపి షాక్ ఇచ్చిన సింగర్ చిన్మయి

గత కొంతకాలంగా చిన్మయి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటోంది. ముఖ్యగా మీటూ అంటూ తనకు ఎదురైన క్యాస్టింగ్ కౌచ్ సంఘటనను వెలుగులోకి తెచ్చింది. అందులో భాగంగా ప్రముఖ తమిళ పాటల...

బాబూ బెల్లంకొండ ఏంటీ కామెడీ,నవ్వుకుంటున్నారు

బెల్లంకొండ శ్రీనివాస్ తన కెరీర్ లో చెప్పుకోదగ్గ హిట్ అనేది పడలేదు. అయితే తనకు హిందీలో పెద్ద మార్కెట్ ఉందని అంటున్నారు బెల్లంకొండ శ్రీనివాస్. తన తాజా చిత్రం సీత ప్రమోషన్ లో...

అదనపు బలగాలపైనా మండిపోవటమేనా ?

కౌంటింగ్ సందర్భంగా గురువారం రాష్ట్రంలో అల్లర్లు జరుగుతాయన్న అనుమానంతో కేంద్ర ఎన్నికల కమీషన్ అదనపు బలగాలను మోహరించింది. అదనపు బలగాలను మోహరించటంపైన కూడా చంద్రబాబునాయుడు మండిపోతున్నారు. ఎలక్షన్ కమీషన్ చేసే ప్రతీ పనినీ...

జపాన్ లో రానా తుఫాన్

అవును ..ఇప్పుడు జపాన్ లో దగ్గపాటి రానా సినిమాల తుఫాను వస్తోంది అక్కడ వరస పెట్టి ఆయన సినమాలు అన్నీ రిలీజ్ అవుతున్నాయి. ముఖ్యంగా బాహుబ‌లి ఫ్రాంచైజ్‌లో వ‌చ్చిన చిత్రాలు జపాన్‌లో విడుద‌ల...

వెయ్యి కోట్లకు చేరుకున్న బెట్టింగులు ?

రాష్ట్రంలో బెట్టింగుల జోరుతో మారు మోగిపోతోంది. పోలింగ్ ముగిసిన వెంటనే పందెం రాయళ్ళు బరిలోకి దిగినా తర్వాత మెల్లిగా ఊపు తగ్గిపోయింది. పోలింగ్ ముగిసిన రోజు నుండి దాదాపు పది రోజులు బెట్టింగ్...

ఓడిపోతే….అందుకే సాకులు వెతుక్కుంటున్నారా ?

చూడబోతే  అలాగే ఉంది చంద్రబాబునాయుడు వ్యవహారం.   పదే పదే ఈవిఎంలుని వివి ప్యాట్లని ఒకటే దేశవ్యాప్తంగా చంద్రబాబు చేస్తున్న గోల చూస్తుంటే అందరిలోను అనుమానాలు పెరిగిపోతున్నాయి. చంద్రబాబు వాదనను కోర్టులు కొట్టేస్తున్న మళ్ళీ...

ఈ మంత్రి గెలుపు కష్టమేనా ?

చంద్రబాబునాయుడు క్యిబినెట్ లో మంత్రులందరూ రెండోసారి పోటీ చేశారు. అయితే వీరిలో ఎంతమంది గెలుస్తారనే విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి. సరే మిగిలిన మంత్రుల సంగతి పక్కన పెడితే ఒక మంత్రి గెలుపోటముల విషయంలో మాత్రం...
 Nate Gerry Jersey