Cinema

‘యన్‌.టి.ఆర్‌’బయోపిక్ : ఇది పుష్పక విమానమా?

అదేంటో ‘యన్‌.టి.ఆర్‌’బయోపిక్ లో ఎంత మంది హీరోయిన్స్ నటిస్తున్నా..మరొకరికి చోటు ఉంటోది. అదో పుష్పక విమానంలో తయారైంది. రోజుకో హీరోయిన్ ఈ సినిమాలో వచ్చి చేరుతున్నారు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్‌ సతీమణిగా బాలీవుడ్ నటి విద్యాబాలన్‌తో పాటు శ్రీదేవిగా రకుల్ ప్రీత్‌ సింగ్‌, సామిత్రిగా నిత్యా మీనన్‌, కృష్ణకుమారిగా మాళవిక నాయర్‌, ప్రభగా శ్రియ,జయసుధ పాయల్‌ రాజ్‌పుత్‌, జయప్రధ హన్సికలు నటిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి.

ఇంతమందితో సినిమా తీస్తున్నారా లేక ఫ్యాషన్ షో చేస్తున్నారా అనే కామెంట్స్ సోషల్ మీడియాలో సైతం వినిపిస్తున్నాయి. అయితే అవన్నీ టీమ్ పట్టించుకునేటట్లు లేదు.

తాజాగా ఈ లిస్ట్‌లో మరో బ్యూటీ వచ్చి చేరి ఆశ్చర్యపరిచింది. ఆమె మరెవరో కాదు తెలుగు అమ్మాయి ఈషా రెబ్బ. ఈషా రెబ్బ సైతం యన్‌టిఆర్‌లో నటించినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే బాలయ్య, ఈషా కాంబినేషన్‌లో అనేక సీన్స్ చిత్రీకరించారట. అయితే ఈషా ఎవరి పాత్రలో కనిపించనుందన్న విషయం తెలియరాలేదు.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటూ ఉన్న ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. తొలి భాగం యన్‌టిఆర్‌ కథానాయకుడు సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

నందమూరి బాలకృష్ణ స్వయంగా నటిస్తూ నిర్మిస్తున్న సినిమా యన్‌.టి.ఆర్‌. తండ్రి జీవితకథ ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలయ్య టైటిల్‌ రోల్‌లో నటిస్తున్నారు.

Telugurajyam
Read
Special
Ads

Copyright © 2018 TeluguRajyam

To Top