Home Cinema సూపర్ బోర్ రోమాన్స్ ! ‘దేవ్’ (మూవీ రివ్యూ)

సూపర్ బోర్ రోమాన్స్ ! ‘దేవ్’ (మూవీ రివ్యూ)

‘దేవ్’

రచన, దర్శకత్వం : రజత్ రవిశంకర్ 
తారాగణం : కార్తీ, రకుల్ ప్రీత్ సింగ్, రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్ తదితరులు 
సంగీతం :  హారిస్ జయరాజ్,  ఛాయాగ్రహణం : ఆర్. వేల్రాజ్ 
బ్యానర్ : ప్రిన్స్ పిక్చర్స్ 
నిర్మాత : ఎస్. లక్ష్మణ్ కుమార్ 
విడుదల :  ఫిబ్రవరి 14, 2019

రేటింగ్  1.5 / 5

          తెలుగులో మంచి ఫాలోయింగ్ వున్న తమిళ స్టార్ కార్తీ ‘దేవ్’  గా వచ్చాడు. రోమాంటిక్ అడ్వెంచర్ గా దీన్ని నిర్మించామనీ, తమన్నాతో  తను 2010 లో నటించిన ‘పయ్యా’ కూడా రోడ్ అడ్వెంచరే ననీ, అయితే ఎనిమిదేళ్ళ క్రిందటి మేకింగ్ కీ, నేటికీ చాలా మార్పు లొచ్చాయనీ, అలాగే ఎనిమిదేళ్ళ క్రితం రోమాన్స్ కీ, నేటికీ చాలా తేడా వుందనీ, ఇదిప్పుడు చూపించామనీ సినిమా గురించి చెప్పుకొచ్చాడు.అడ్వెంచర్ విషయమెలా వున్నా, ఒకే మూస రోమాన్సులతో విసుగెత్తిపోయారు ప్రేక్షకులు. మరిప్పుడు కొత్తగా కార్తీ రోమాన్స్ ని ఎలా చూపించాడు? ప్రేమికుల మధ్య ఏ కొత్త సమస్యని కేంద్ర బిందువు చేశాడు? చెప్పింది నిజమేనా లేక, ఈ వాలంటైన్స్ డేకి లవర్స్ కి బోరేనా? … విషయం లోకెళ్ళి ఒకసారి చూద్దాం…

కథ 
          బాగా రిచ్ అయిన దేవ్ రామలింగం (కార్తీ) అడ్వెంచర్స్ చేస్తూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తూంటాడు. ఇద్దరు ఫ్రెండ్స్ (అమృత, విఘ్నేష్ కాంత్) వెంట వుంటారు. ఫారిన్ లో బిజినెస్ చేసి బాగా పైకొచ్చిన మేఘన (రకుల్ ప్రీత్ సింగ్) వుంటుంది. ఈమెని ఫేస్ బుక్   లో చూడాగానే ప్రేమలో పడతాడు దేవ్. ఫ్రెండ్స్ సహకరిస్తారు. ప్రేమ కంటే బిజినెస్ మీటింగులే ముఖ్యమనుకునే మేఘన అతణ్ణి పట్టించుకోదు. దీంతో ఎలాగైనా ప్రేమించేట్టు చేసుకోవాలని దేవ్ నిర్ణయించుకుంటాడు. ఇందుకేం ప్రయత్నాలు చేశాడు, అవెలా ఫలించాయన్నది మిగతగా కథ.

ఎలావుంది కథ  

          ఈ కథ రోమాంటిక్ అడ్వెంచర్ అన్నారు, ఆ రెండూ లేవు. రెండిటినీ ఎనిమిదేళ్ళ తర్వాత ఇప్పటి ట్రెండ్ కి కొత్తగా చూపించామన్నాడు కార్తీక్. కానీ రోమాన్స్, అడ్వెంచర్ రెండూ లేనప్పుడు కొత్తగా చూపించేదేముంది. దీన్ని రెండున్నర గంటల సేపు లాగి లాగి  చూపించారు. కానీ గంట సేపే భరించడం కష్టం. అడ్వెంచర్ ప్రియుడని చెప్పి మొదటి సీనులో మంచు తూఫానులో ఒక కార్తీ సాహసం చూపించి వదిలేశారు. మళ్ళీ క్లయిమాక్స్ లోనే హిమాలయాల్లో అడ్వెంచర్. మధ్యలో అడ్వెంచర్ కాని  అడ్వెంచర్ ఏమిటంటే,  రకుల్ తో బైక్ మీద  ముంబాయి టు వైజాగ్ ప్రయాణమే. ఇందులోనూ థ్రిల్లింగ్ గా ఏమీ జరగదు. అతనేదో అడ్వెంచర్ స్పెషలిస్టు అని ఆమెకీ తెలీదు ప్రేమలో పడడానికి, బిజినెస్ అంటున్న ఆమెకి బిజినెస్ లో సహకరిద్దామని అతడికీ వుండదు. ఇద్దరి వృత్తులకి కథలో అర్ధమే లేదు. ఆమె అతనేదో చేసిన అడ్వెంచర్ చూసి ప్రేమలో పడదు, ఒకమ్మాయిని రౌడీల బారి నుంచి ఫైట్ చేసి కాపాడాడని ప్రేమలో పడిపోతుంది! ఇదన్న మాట కొత్తదనం!

ఎవరెలా చేశారు 

          చేయడానికేముంది? స్టయిలిష్ గా తిరగడమే. ఇలాటి పనిలేని పాత్ర కొత్తగా కార్తీక్ కె లా నచ్చిందో. చాలా వరకూ ఫస్టాఫ్ లో ఫ్రెండ్స్ తో రొటీన్ కామెడీలే సరిపోతాయి. ఇలా ఫ్రెండ్ షిప్ యాంగిల్ ని కూడా చూపించామన్నారు. ఉండాల్సిన ముఖ్యమైన  రెండూ లేవుగానీ ఫ్రెండ్షిప్ యాంగిల్ అవసరమన్పించింది కొత్త దర్శకుడికి. ఇంకా ఫ్యామిలీ కూడా వుంటుంది కార్తీకి. కానీ ఫాదర్ ప్రకాష్ రాజ్  అప్పుడప్పుడు కన్పించి,  ఒక మూస డైలాగు చెప్పి పోతూంటాడు. అటు రకుల్ తల్లి పాత్ర రమ్య కృష్ణ కూడా ఇలాగే చేసి వెళ్లి పోతూంటుంది. ఇక ఏం బిజినెస్ చేస్తూంటుందో రకుల్ ఎక్కడా మనకి చూపించదు. దేశ రహస్యాలు అమ్ముతోందేమో తెలీదు. ఇద్దరికీ ప్రేమ పట్ల గానీ, వృత్తి పట్ల గానీ ఎలాటి ఎమోషన్స్ వుండవు.

          హారిస్ జయరాజ్ సంగీత భరితం చేశాడు ఈ సినిమాకాని సినిమాని. ‘షోలే’ టైటిల్ మ్యూజిక్ లా అన్పించే గిటార్ తో ప్రారంబించే థీమ్ సాంగ్ హుషారు తెస్తుంది. వేల్రాజ్ కెమెరా వర్క్ రిచ్ లొకేషన్స్ తో వైభవంగా వుంది. టెక్నికల్ గా ట్రెండీగా వుంది. ఒక్క ప్రేమికుల విషయమే ప్రారంభంలో చూపించినప్పుడే మంచు తూఫానులో ఎటో కొట్టుకు పోయింది. 

చివరికేమిటి 


          పేరు పొందిన బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కాశ్యప్ అసిస్టెంట్ రజత్ రవిశంకర్ ఇంత పాత సినిమా సినిమా తీస్తాడనుకోరు. అతను అన్ని విధాలా వైఫల్యం చెందాడు. ఒక కామెడీ ప్రోగ్రాం లో  ఫ్రెండ్ క్యారె క్టర్ తో కామెడీ చేయిస్తూ, కార్తీతో తమ ఫ్లాష్ బ్యాక్ ని చిన్నప్పట్నుంచీ మల్టీ పుల్ ఫ్లాష్ బ్యాకులుగా వేస్తూ చాలా సేపు సాగదీస్తాడు దర్శకుడు. సినిమా ప్రారంభమే ఈ బోరేమిటో అర్ధంగాదు. ఫేస్ బుక్ లో రకుల్ ఫోటో చూడగానే ప్రేమలో పడ్డం, ఆ తాలూకు లవ్ ట్రాక్ అంతా అనేక సినిమాల్లో చూసిందే. తీరా ఆమె ప్రేమలో పడినట్టే పడి మీటింగుందని చెప్పి వెళ్లిపోవడంతో ఫస్టాఫ్ ముగుస్తుంది. ఇంత బలహీన సంఘర్షణని ఏర్పాటు చేశాక, ఇక సెకండాఫ్ ఎటూ కదలని కథతో ఒక బాధ కాదు. ఆమెని ప్రేమలో పడెయ్యడానికి మళ్ళీ ఫస్టాఫ్ కథ లాంటిదే మొదలెడటాడు. ఫస్టాఫ్ లోనే ప్రేమలో పడేసే కథనం చూడలేకపోతే, మళ్ళీ సెకండాఫ్ లో మళ్ళీ ప్రేమలో పడేసే కథనం. సెకండాఫ్ లో కూడా ఈ బలహీన ప్రేమని కొత్త మలుపు తిప్పింది లేదు. 
          ఇలాటి పస లేని ప్రేమ సినిమాలే చూస్తూ వస్తున్నారు ప్రేక్షకులు. కేరాఫ్ కాశ్యప్ కొత్త దర్శకుడు కూడా ఇందుకేమీ తీసిపోకుండా సూపర్ బోరు కొట్టిస్తూ ఇది చూపించాడు.

―సికిందర్

అత్యంత ప్రజాధారణ

తెలుగురాజ్యం ప్రత్యేకం

తాజా వార్తలు

పవన్ హీరోయిన్ పై ఛీటింగ్ కేసు

అమీషా పటేల్ గుర్తుందా.. అప్పట్లో పవన్ కళ్యాణ్ సరసన “బద్రి”, మహేష్ బాబుకు జతగా నాని సినిమాలో నటించిన బాలీవుడ్ భామ అమీషా పటేల్.   గతకొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ...

బోయపాటి కు బాలయ్య 2 కండీషన్స్..ఒప్పుకుంటేనే సినిమా

సినిమా హిట్ అయితే తదుపరి సినిమాకు ఎన్ని డిమాండ్స్ చేసినా సెలంట్ గా భరిస్తారు నిర్మాత, హీరో. ఎందుకంటే తమకు ఆ రేంజి హిట్ ఇస్తాడనే నమ్మకంతో. అదే ప్లాఫ్ అయితే సీన్...

తల్లికి దాహం తీర్చలేదు గాని పినతల్లికి పట్టు చీరనా?

  (వి. శంకరయ్య)   అన్న దాత సుఖీభవ తంతు ఇలాగే వుంది.        రైతు రుణ మాఫీపథకం దిక్కు మొక్కు లేకుండా పడి వుంది. రెండు కంతులు ఎపుడు ఇస్తారని రైతులు ఎదురు చూస్తుంటే దానిని పట్టించుకోకుండా ‘అన్న...

రిలీజ్ కాకముందే రచ్చ వద్దని వారించిన మోహన్ బాబు

లక్ష్మీస్  ఎన్టీఆర్ ట్రైలర్ రిలీజ్ అయిన నాటి నుంచీ తెలుగు రెండు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా గురించే చ‌ర్చ న‌డుస్తోందనటంలో అతిశయోక్తి లేదు. వాస్తవానికికి ఎన్టీఆర్ క‌థానాయకుడు విడుద‌లైన‌పుడు కూడా ఇంత‌గా చ‌ర్చ...

‘యన్‌టిఆర్‌ – మహానాయకుడు’ ట్రైలర్

‘నేను రాజకీయాలు చేయడానికి రాలేదు, మీ గడపలకు పసుపునై బతకడానికి వచ్చాను’ అంటూ మహానాయకుడు వచ్చేసాడు.  నటుడు, రాజకీయనాయకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన చిత్రం ‘యన్‌టిఆర్‌’....

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ కు కోటి వ్యూస్..వెనక సీక్రెట్ ఇదే

ప్రముఖ దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌. ఎన్టీఆర్ జీవితంలోని కీలక సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం...

రకుల్ రెమ్యునేషన్ ఎంతో తెలుసా?

సిని పరిశ్రమలో లెక్కలు క్రేజ్ ని బట్టే ఉంటాయి. హిట్ పడితే ఓవర్ నైట్ లో రెమ్యునేషన్ రెట్టింపు అవుతుంది. ప్లాఫ్ వస్తే ..అడ్వాన్స్ లు కూడా వెనక్కి తిరిగి ఇచ్చేయమంటారు. అంతా...

రెబెల్ ర్యాపర్ గా రణవీర్ గుర్తుండిపోయే నటన: గల్లీ బాయ్ (మూవీ రివ్యూ)

16.2.19 రివ్యూ స్లమ్ డాగ్ కళా విజయం!  ‘గల్లీబాయ్’ దర్శకత్వం : జోయా అఖ్తర్  తారాగణం : రణవీర్ సింగ్, ఆలియాభట్, కల్కి కొష్లిన్, సిద్ధాంత్ చతుర్వేది, విజయ్ రాజ్, విజయ్ వర్మ, అమృతా సుభాష్ తదితరులు  రచన : జాయా...

తలకు ప్లాస్టిక్ కవర్ చుట్టుకొని ఉరేసుకున్న సాఫ్ట్ వేర్ అమ్మాయి

 హైదరాబాద్ లో దారుణం జరిగింది. మాదాపూర్ లోని అరుణోదయ లేడిస్ హాస్టల్ లో ఉంటున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్ శ్రీవిద్య(25)   శనివారం ఆత్మహత్య కు పాల్పడింది. గదిలో లోపలి నుంచి గడియ పెట్టుకున్న...

జవాన్ల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన చంద్రబాబు 

ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు ఏపీ సీఎం చంద్రబాబు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఒక్కో అమర జవాను కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. అమరుల త్యాగాలను దేశం ఎప్పటికి గుర్తుంచుకుంటుదని...