టెక్నాలజీ పెరుగుతున్న నేపధ్యంలో ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ వాడకం అనేది కామన్ అయిపోయింది. ఒకప్పుడు ఫోన్ అనేది కేవలం సమాచారాన్ని తెలుసుకోవడం, లేదా అందించడం వరకే ఉండేది. ఫోన్ అంటే కేవలం మాట్లాడటానికి మాత్రమే వాడే వారు. కానీ నేటి యువత అలా లేరు. చిన్నా పెద్దా అని చూడకుండా ప్రతి ఒక్కరూ ఫోన్ వాడుతున్నారు. అందులో టెక్నాలజీని బాగా తెలసుకుని వాడుతున్నారు.
వాటిలో కొన్ని యాప్స్ జీవితాలను నాశనం చేసేవిలా ఉంటాయి. మన భారతదేశంలో ఇంకా అలాంటి సంస్కృతి రాలేదు కాని, వేరే దేశాల్లో కాస్త ఫాస్ట్‌గా ఉంటూ అమెరికా, రష్యా లాంటి దేశాల్లో మరికాస్త ముందుకు ఆడుగువేసి పిల్లల జీవితాలే ఏ స్థాయిలో నాశనం అవుతున్నాయంటే కొన్ని సంఘటనల ఆధారంగా తెలుస్తున్నాయి.
వివరాల్లోకి వెళితే… ఇటీవలె రష్యాలో ఓ సంఘటన షాక్ కి గురి చేస్తుంది. ప్రస్తుతం ప్రపపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. అదేమిటంటే…13 ఏళ్ల ఒక బాలిక కొన్ని రోజులుగా కడపు నొప్పితో బాధపడటంతో పాటు కాస్త లావుగా అవ్వడం, ఆహారపు అలవాట్లలో మార్పు రావడం జరుగుతుంది. దీంతో తల్లిదండ్రులకు అనుమానం వచ్చి హాస్పిటల్‌కు తీసుకు వెళ్లగా ఆ బాలిక గర్భవతి అంటూ తేలింది.
దీంతో తల్లిదండ్రులు షాకయిపోయారు. దీనికి కారణం ఎవరూ అంటూ ప్రశ్నించగా.. ఆ అమ్మాయి తన కంటే వసులో చిన్న వాడైన 11ఏళ్ళ బాలుడిని చూపించింది. ఈ ఘోరాన్ని విన్న తల్లిదండ్రులే కాక డాక్టర్లు కూడా ఖంగుతిన్నారు. ఎందుకంటే 13 ఏళ్ల అమ్మాయికి 11 ఏళ్ల కుర్రాడు ఎలా ప్రెగ్నెంట్‌గా చేస్తాడు అనేది వారి అనుమానం.
పదకొండేళ్ళ కుర్రాడు తండ్రి ఏంటి అది అసాధ్యం అంటున్నారు. ఆ పని చేశాడేమో కానీ ఆమె కడుపులో ఉన్న బిడ్డకు మాత్రం తండ్రి కాదు అంటున్నారు. ఈ విషయం పై సీరియసై ఆమెను ప్రశ్నిస్తూ మరో పక్క డాక్టర్లు ఆ కుర్రాడికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. చివరగా ఆ పిండానికి ఈ కుర్రాడే తండ్రి అని తేలితే వారు ఏం చేయబోతున్నారు అన్నది ప్రశ్నగా మిగిలింది.