Home Crime స‌మంత‌, పివిసింధు, ల‌క్ష్మీమంచు ఏమైపోయారంటూ నిల‌దీస్తున్న లేడీ యాంక‌ర్‌

స‌మంత‌, పివిసింధు, ల‌క్ష్మీమంచు ఏమైపోయారంటూ నిల‌దీస్తున్న లేడీ యాంక‌ర్‌

దేశంలో మృగాళ్లు రెచ్చిపోతున్నారు. రోజూ ఎక్కడ చూసిన మహిళలపై దాడులు, అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. తెలంగాణలోని హైదరాబాద్‌ శివారులో వెటర్నరీ డాక్టర్‌పై జరిగిన అత్యాచారం, హత్య ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. దీనిపై గల్లీ నుంచి ఢిల్లీ వరకు అందరూ ఖండిస్తున్నారు. ఈ ఘ‌ట‌న పై యాంక‌ర్‌ శ్వేతారెడ్డి కొంద‌రు సెల‌బ్రెటీల పై ఈ విధంగా మండిప‌డ్డారు. గ‌తంలో కొన్ని సంద‌ర్భాల్లో షీటీమ్స్‌ను పొగిడిన ఓ ముగ్గురు సెల‌బ్రెటీల‌ను శ్వేతారెడ్డి ఏకిప‌డేశారు.

స‌మంత‌, ల‌క్ష్మీమంచు, పీవీసిందు మొన్న‌నే అన్నారు. ఓహో తెలంగాణ‌, ఆహా తెలంగాణ మ‌న షీ టీమ్‌లు అద్భుతంగా ప‌ని చేస్తున్నాయ‌ని అని తెగ మురిసిపోయారు. మ‌రి ఇప్పుడు దిశ విష‌యంలో ఎందుకు మాట్లాడ‌టం లేదు. ఇక ఈ సెల‌బ్రెటీలు ఉన్నారు వాళ్ళంతా షీ టీమ్ గురించి గొప్ప‌గా చెపుతుంటారు. షీటీమ్స్ వాళ్ళు డ‌బ్బు ఉన్న‌వాళ్ళ‌కే కాపాల‌కాస్తున్నారా. బంజాహిల్స్, జూబ్లీహిల్స్ ద‌గ్గ‌రేనా వాళ్ళ డ్యూటీనా. ఊరి శివార్లు వాళ్ళ‌కు సంబంధం లేదా అవుట్ స్క‌ర్ట్స్‌లో ప్ర‌యాణం చేస్తున్న అమ్మాయిల‌ను షీ టీమ్‌లు కాపాడ‌వా. వాళ్ల‌ని ప‌ట్టించుకునే నాధుడే లేడా. పీవీ సింధుకి కేసీఆర్ ఎక‌రాలు ఎకారాలు రాసిచ్చారు. దాంతో త‌ను జైతెలంగాణ అంటూ తెలంగాణ‌కు జై కొట్ట‌క ఇంకేం చేస్తుంది. ఇక స‌మంత అక్కినేనిని బ‌ట్ట‌ల‌కు బ్రాండ్ ఎంబాసిడ‌ర్‌ని చేశారు కేటీఆర్. ఖ‌చ్చితంగా జై కేటీఆర్ అంట‌ది. ఇక ల‌క్ష్మీ మంచు కూడా ఆమె చేసే ఫ్యాష‌న్ షోల‌కి కి వీళ్ళ ప‌ర్మిష‌న్ ఈజీగా దొరుకుతుంది. సో ఖ‌చ్చితంగా వీళ్లు ముగ్గురు తెలంగాణ ప్ర‌భుత్వానికి జై కొట్ట‌క‌మాన‌రు అని అన్నారు.

Bikini Show

Recent Galleries

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ