Home ఆంధ్ర & తెలంగాణ హరిత ప్లాజా : రాహుల్ మీటింగ్స్ లో ఏం జరిగిందంటే ?

హరిత ప్లాజా : రాహుల్ మీటింగ్స్ లో ఏం జరిగిందంటే ?

కాంగ్రెస్ పార్టీ అనగానే అంతర్గత ప్రజాస్వామ్యం కాసింత ఎక్కువ అన్న డైలాగ్ వినబడుతుంటది. ఆ అంతర్గత ప్రజాస్వామ్యం ఒక్కోసారి శృతిమించి కొన్నిసార్లు గడబిడలు జరుగుతుంటాయి. తాజాగా రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనలో భాగంగా రెండోరోజు మీటింగ్స్ లో గడబిడలు జరిగాయి. రాహుల్ తొలిరోజు పర్యటన విజయవంతంగా సాగింది. మహిళలతో ఇంటరాక్షన్, ఒక బహిరంగ సభలో రాహుల్ పాల్గొన్నారు. తొలిరోజు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు కాంగ్రెస్ నేతలు. కానీ రెండోరోజు కాంగ్రెస్ మార్కు పాలిటిక్స్ జరిగాయి. రాహుల్ తో ఎడిటర్స్ మీటింగ్ మొదలు కొని సీనియర్ల మీటింగ్, విద్యార్థి నేతల మీటింగ్ లో ఏం జరిగిందో టూకీగా కింద చదవండి. (విశ్వసనీయ వర్గాలు అందించిన సమాచారం ఆధారంగా…)

ఎడిటర్స్ మీటింగ్ లో జానారెడ్డి వేదిక మీదకు వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే ఆయన పేరు లేదని చెప్పడంతో ఆయన అలిగి బయటకు వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. ఇంతలో పార్టీ నేత గూడూరు నారాయణరెడ్డి బతిలాడి లోపలికి తీసుకుపోయారు.

సీనియర్ల మీటింగ్ లో ఇటీవల పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి కి పాస్ నిరాకరించారు. ఆయనను సీనియర్ లీడర్ గా గుర్తించకపోవడం వివాదాస్పదమైంది.

సీనియర్ లీడర్ల మీటింగ్ జాబితాలో తన పేరు లేకపోవడంతో మాజీ మంత్రి సునితా లక్ష్మారెడ్డి బాధపడి కంటతడి పెట్టారు.

రెండు వర్గాల గొడవ కారణంగా ఉస్మానియా విద్యార్థులతో జరగాల్సిన భేటీ వాయిదా పడింది. ఈ భేటీకి కొందరికి అనుమతి లేదనడం తో రెండు వర్గాలుగా విడిపోయి హోటల్ లోపల  ఓయూ విద్యార్థుల మధ్య గొడవ జరిగింది. ఒకరినొకరు కొట్టుకున్నారు. ఈ వివాదంలో కొందరు పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ బ్యాచ్ గా మరికొందరు రేవంత్ రెడ్డి బ్యాచ్ గా చీలిపోయారు. వసూల్ బ్యాచ్ అని ఒక వర్గం వారు మరో వర్గం వారిని విమర్శించడంతో వివాదం చెలరేగింది.  దీంతో భేటీ తొలుత పోస్టు పోన్ అయి మధ్యాహ్నం తర్వాత జరిగింది. 

అత్యంత ప్రజాధారణ

తెలుగురాజ్యం ప్రత్యేకం

తాజా వార్తలు

రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో క్రిష్ సినిమా! రామ్‌నాథ్ కోవింద్‌ కోసం స్పెష‌ల్ స్క్రీనింగ్‌

మ‌న తెలుగువాడు క్రిష్ జాగ‌ర్ల‌మూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన బాలీవుడ్ మూవీ `మ‌ణిక‌ర్ణిక‌`. ఝాన్షీ ల‌క్ష్మీబాయి జీవిత చ‌రిత్ర ఆధారంగా తెర‌కెక్కిన సినిమా ఇది. బాలీవుడ్ క్వీన్ కంగ‌న ర‌నౌత్ ఇందులో టైటిల్ రోల్‌ను...

సీబీఐలో ప్ర‌కంప‌న‌లు! అస్థానానూ సాగ‌నంపారు!

సీబీఐలో ప్ర‌కంప‌న‌లు చెల‌రేగ‌డానికి కార‌ణ‌మైన రాకేష్ అస్థానాపై కేంద్రం బ‌దిలీ వేటు వేసింది. ఆయ‌న‌తో పాటు ఇద్ద‌రిని ఇత‌ర శాఖ‌ల‌కు బ‌దిలీ చేస్తూ కేంద్ర హోం మంత్రిత్వ‌శాఖ గురువారం రాత్రి ఉత్త‌ర్వులు జారీ...

ఆ బాబా ఇక జీవితాంతం జైల్లోనే!

అత్యాచారాల బాబాగా గుర్తింపు పొందిన డేరా బాబా ఆలియాస్ గుర్మీత్ రామ్ ర‌హీమ్ ఇక జీవితాంతం జైల్లోనే గ‌డ‌ప‌నున్నారు. జర్నలిస్ట్ రామచంద్ర ఛత్రపతి హత్య కేసులో పంచ్‌కులలోని సీబీఐ న్యాయ‌స్థానం ఆయ‌న‌ను దోషిగా...

జ‌గ‌న్ లండన్ పర్యటన రద్దు

ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి త‌న లండ‌న్ ప‌ర్య‌ట‌న‌ను ర‌ద్దు చేసుకున్నారు. వ‌చ్చేనెల మూడో వారం నాటికి ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ రానున్నందున‌.. పార్టీ శ్రేణుల‌ను స‌మాయాత్తం...

జగన్-కేటీఆర్ భేటీ! టీడీపికి ఉత్తరాంధ్ర ఓటు బ్యాంకు దడ

ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మధ్య ప్రాథ‌మిక స్థాయిలో జరిగిన ఓ భేటీ.. తెలుగుదేశంలో కాక పుట్టించింది. వారి నోళ్లకు...

రకుల్ వివాదంలో ఎవరిది తప్పు, తల్లిని లాగటమెందుకు?

ఈ రోజు ఉదయం నుంచీ రకుల్ ప్రీతి సింగ్ కామెంట్లు, ప్రతీ కామెంట్ల అన్నట్లుగా సోషల్ మీడియాలతో హంగామా మొదలైంది. రకుల్ ప్రీత్ సింగ్ తనపై భగత్ అనే వ్యక్తి ట్విట్టర్లో చేసిన...

తెలంగాణ డిప్యూటి స్పీకర్ గా అజ్మీరా రేఖా నాయక్

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా పోచారం శ్రీనివాస్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్ ఎన్నికకు అన్ని పార్టీల వారు మద్దతు పలకడంతో పోచారం ఎన్నిక లాంఛనమైంది. స్పీకర్ ఎన్నిక తర్వాత డిప్యూటి స్పీకర్...

ఏపీ ఎన్నిక‌ల ప్ర‌ధాన‌ అధికారి బ‌దిలీ..ఆయ‌న స్థానంలో!

ఏపీ ఎన్నికల అధికారి ఆర్పీ సిసోడియా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో సీనియ‌ర్ ఐఎఎస్ అధికారి గోపాలకృష్ణ ద్వివేది నియ‌మితుల‌య్యారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఉత్త‌ర్వులు జారీ చేసింది....

బ్రేకింగ్ :ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్

అవును ...యంగ్ టైగర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా ఓ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకోనుంది. ఇంతకీ ఏమిటా సినిమా అంటారా..మిస్టర్ మజ్ను. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి...

బ్రహ్మానందం ఆపరేషన్, ఆరోగ్యంపై కొడుకు వివరణ.!

ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందానికి గుండె ఆపరేషన్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై ఆయన కుమారుడు, నటుడు రాజా గౌతమ్ ని మీడియా వారు కలిసి..వివరాలు అడిగితే ఆయన స్పందించాడు. తన...