fbpx
Home Cinema ర‌ష్మీ రాకెట్: చిరుత వేగాన్ని ఆపేదెలా తాప్సీ?

ర‌ష్మీ రాకెట్: చిరుత వేగాన్ని ఆపేదెలా తాప్సీ?

కెరీర్ లో వ‌రుస ప్ర‌యోగాల‌తో దూసుకుపోతోంది తాప్సీ. పింక్, నామ్ ష‌బానా, బ‌ద్లా, మ‌న్మార్జియాన్, గేమ్ ఓవ‌ర్ .. ఇలా వ‌రుస ప్ర‌యోగాల‌తో బాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగుతోంది తాప్సీ. ప్ర‌స్తుతం త‌న‌కంటూ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను పెంచుకుంది. బ‌ద్లా చిత్రంలో హాకీ ప్లేయ‌ర్ గా న‌టించిన‌ తాప్సీ త‌దుప‌రి క్రీడాకారిణుల బ‌యోపిక్ ఛాన్సులొస్తే విడిచిపెట్టేట్టు లేదు.బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ `మిష‌న్ మంగ‌ళ్`లో మ‌హిళా శాస్త్ర‌వేత్త‌గా న‌టించి మెప్పించింది. లేటు వ‌య‌సు షార్ప్ షూట‌ర్ ప్ర‌కాషి తోమ‌ర్ పాత్ర‌లోనూ న‌టిస్తోంది. దీంతో పాటు టీమిండియా మ‌హిళా కెప్టెన్ మిథాలీరాజ్ బ‌యోపిక్‌లో న‌టించేందుకు ఆస‌క్తిగా ఉన్నాన‌ని ప్ర‌క‌టించింది.

ఇన్ని సినిమాల న‌డుమ మ‌రో క్రీడా నేప‌థ్యం ఉన్న సినిమాతో ప్రేక్ష‌కాభిమానుల ముందుకు వ‌స్తోంది. `ర‌ష్మీ రాకెట్` అనేది ఈ సినిమా టైటిల్. రాజ‌స్థాన్ క‌చ్ ప్రాంతానికి చెందిన‌ గ్రామీణ యువ‌తి స్ఫూర్తివంత‌మైన జ‌ర్నీకి సంబంధించిన క‌థ‌తో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. విలేజ్ నుంచి వ‌చ్చి ఓ ఛాలెంజింగ్ రియ‌ల్ అథ్లెట్ కం ఫాస్ట్ ర‌న్న‌ర్‌గా మ‌రిపించ‌నుంది. తాజాగా ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ మోష‌న్ పోస్ట‌ర్ రిలీజైంది. ఈ పోస్ట‌ర్ లో తాప్సీ సాంప్ర‌దాయ గ్రామీణ‌ రాజ‌స్థానీ లుక్ లో మైమ‌రిపించింది. ఆక‌ర్ష్ ఖురానా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న‌ ఈ చిత్రానికి త‌మిళ ద‌ర్శ‌కుడు నంద పెరియ స్వామి స్క్రిప్టును అందిస్తున్నారు. ఆర్.ఎస్.వీ.పీ తో క‌లిసి మ్యాంగో పీపుల్ మీడియా నెట్ వ‌ర్క్ సంస్థ నిర్మిస్తోంది. వాస్త‌వ ఘ‌ట‌న‌ల్ని క‌థ‌గా రాసుకుని ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. వ‌రుస‌గా క్రీడాకారిణుల పాత్ర‌ల్లో న‌టిస్తూ యువ‌త‌రంలో త‌న‌దైన ముద్ర వేస్తున్న తాప్సీని సౌత్ ఇండ‌స్ట్రీ మాత్రం చాలానే వెక్కిరించింది. ఎన్నో అవ‌కాశాలొచ్చినా ఐరెన్ లెగ్ అన్న ముద్ర వేయించుకుంది ఇక్క‌డ‌. అయితే అన్నిటికీ త‌న‌దైన శైలిలో స‌మాధానం ఇస్తోంది తాప్సీ.

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ