Home Cinema సాహో మొదటి ప్రీమియ‌ర్ ఎక్క‌డో తెలుసా?

సాహో మొదటి ప్రీమియ‌ర్ ఎక్క‌డో తెలుసా?

బాహుబ‌లి త‌ర్వాత మోస్ట్ అవైటెడ్ సౌత్ ఇండియ‌న్ మూవీగా `సాహో` పాపుల‌రైంది. దాదాపు 350 కోట్ల బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన ఈ సినిమా ఏ స్థాయి వ‌సూళ్లు సాధించ‌నుంది? అన్న ఆస‌క్తి ప్ర‌పంచ‌వ్యాప్తంగా ట్రేడ్ వ‌ర్గాల్లో నెల‌కొంది. ఈ సినిమాకి దాదాపు 290 కోట్ల మేర వ‌ర‌ల్డ్ వైడ్ ప్రీరిలీజ్ బిజినెస్ సాగ‌డంతో ఆ మేర‌కు షేర్ వ‌సూళ్ల‌ను ద‌క్కించుకోవాల్సి ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. అంటే తొలి వారం నాటికే మొత్తం రిక‌వ‌రీ చేస్తుందా లేదా? అస‌లు తొలి రోజు రిపోర్ట్ ఎలా ఉండ‌బోతోంది? అన్న ఎగ్జ‌యిట్‌మెంట్ ఇటు ట్రేడ్ తో పాటు అటు ప్ర‌భాస్, యు.వి.క్రియేష‌న్స్ వ‌ర్గాల్ని టెన్ష‌న్ కి గురి చేస్తోంది. సాహో మొద‌టి రోజు పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయితే భారీ వ‌సూళ్ల‌ను కొల్ల‌గొట్టే ఛాన్సుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఈ సినిమా బాహుబ‌లి 2 డే వ‌న్ రికార్డుల్ని బ్రేక్ చేయ‌నుంద‌ని ఇప్ప‌టికే టిక్కెట్ విండో వ‌ద్ద స్పీడ్ చెబుతోంది. అటు హిందీ బాక్సాఫీస్ స‌హా ఓవ‌ర్సీస్ లోనూ ఆ స్థాయిలో భారీ అంచ‌నాలేర్ప‌డ్డాయి.

అంత‌కంత‌కు ఊపేస్తోంది.. డే వ‌న్ రికార్డు ఎంత‌?

అయితే ఇంత క్రేజీగా రిలీజ‌వుతున్న ఈ సినిమా మొద‌టి ప్రీమియ‌ర్ షో ఎక్కడ వేస్తున్నారు? అన్న‌దానికి తాజాగా స‌మాచారం అందింది. ఈ సినిమా ఓవ‌ర్సీస్ రైట్స్ చేజిక్కించుకున్న య‌శ్ రాజ్ ఫిలింస్ (వైఆర్ఎఫ్‌) సంస్థ తొలిగా దుబాయ్ లో సాహో హిందీ వెర్ష‌న్ ని ప్రీమియ‌ర్ వేస్తోంది. 29 ఆగ‌స్టు సాయంత్రం 8.30గం.ల‌కు ఈ ప్రీమియ‌ర్ ని ఐమ్యాక్స్ లో దుబాయ్ లో వేస్తున్నారు. అక్క‌డ కాల‌మానం ప్ర‌కారం రాత్రి 10 గంట‌ల‌కు షో మొద‌లవుతుంద‌ని తెలిసింది. భార‌త‌దేశంలో తెల్ల‌వారు ఝాము ఒంటిగంట‌కు `సాహో` మొద‌టి ప్రీమియ‌ర్ వేస్తున్నార‌ట‌. ప్ర‌భాస్ అభిమానులు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎంతో ఎగ్జ‌యిటింగ్ గా వేచి చూస్తున్న త‌రుణ‌మిది. అస‌లు టాక్ తో సంబంధం లేకుండా వారం రోజుల పాటు సాహో మానియా ఊపేయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఈ 15రోజుల పాటు ప్ర‌భాస్ అండ్ సాహో బృందం.విస్త్ర‌తంగా దేశంలోని అన్ని న‌గ‌రాల‌కు వెళ్లి ప్ర‌చారం చేయ‌డం మెట్రోల్లోనూ బాగా క‌లిసి రానుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

Bikini Show

Recent Galleries

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ