fbpx
Home Cinema కొత్త పోస్టర్ : 'నన్' గెటప్ లో యంగ్  హీరో..నవ్వించటానికేనా?

కొత్త పోస్టర్ : ‘నన్’ గెటప్ లో యంగ్  హీరో..నవ్వించటానికేనా?

(సూర్యం)

కాన్సెప్టులో ఏదో ఒక విభిన్నత ఉండాలి. అలాగే  సినిమా పోస్టర్, ట్రైలర్స్ లోనే సృజనాత్మకత చూపించాలి..లేకపోతే ఓపినింగ్స్ ఉండవు..జనాలు పట్టించుకోరు. ఓపినింగ్స్ లేకపోతే సినిమాలో ఎంత గొప్ప మ్యాటర్ ఉన్నా రెండో రోజుకు తిరిగు ప్రయాణం పెట్టుకోవాల్సిందే.

 

ఈ విషయం జీవా హీరోగా రెడీ అవుతున్న గొరిల్లా టీమ్ బాగానే బుర్రకెక్కించుకుంది. అందుకే … తమ టాలెంట్ ని ఉపయోగించి ఓ ఫన్నీ పోస్టర్ ని రెడీ చేసి వదిలింది. ఇప్పుడు అది సోషల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేస్తోంది.

హీరో జీవాను నన్ గెటప్ లో చూపెడుతూ…గొరిల్లాకు స్టైలిష్ కళ్లద్దారు పెట్టారు.  ఇక్కడ మీరు చూస్తున్న ఫొటో అదే.

 

ఇక ఈ సినిమా తెలుగులో కూడా మంచి బిజినెస్ చేసే అవకాశం ఉంది . దానికి కారణం గతంలో జీవా నటించిన చిత్రాలు ఇక్కడా బాగానే వర్కవుట్ అవటం…అలాగే ..ఈ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న షాలిని పాండే కు తెలుగులో అర్జున్ రెడ్డి సినిమాతో మంచి క్రేజ్ రావటం. ఇక ఈ సినిమాకు డాన్ శాండీ డైరక్షన్ చేస్తున్నాడు.

ఈ సినిమా మరి కామెడీగా నవ్విస్తుందో..అసలు గొరిల్లాకు , ఈ నన్ గెటప్ కు లింకేంటో తెలుసుకోవాలనే ఆసక్తి రేపుతోంది. యంగ్ హీరో ఇలా నన్ గా కనిపించటం తో ఇదో చర్చనీయాంశంగా మారింది. అదే కదా..ఈ సినిమా టీమ్  కోరుకునేది.

 

 

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ