fbpx
Home Cinema శృతీహాస‌న్‌కు ఏమైంది?

శృతీహాస‌న్‌కు ఏమైంది?

చిత్ర ప‌రిశ్ర‌మ‌లో స్టార్‌లు మందు తాగ‌డం కామ‌న్‌. కానీ స్టార్ హీరోయిన్‌లు కూడా మందు తాగ‌డం కామ‌న్‌గా మారిపోయింది. ఈ విష‌యం తాజాగా వెలుగులోకి వ‌చ్చింది. స్టార్ హీరోల్లో మెన్షన్‌హౌస్ బ్రాండ్‌ని వాడితే స్టార్ హీరోయిన్‌ల‌లో కొంత మంది విస్కీని ఇష్టంగా తీసుకుంటార‌ట. తాజాగా ఈ విష‌యాన్ని స్టార్ హీరోయిన్ శృతీహాస‌న్ బ‌య‌ట‌పెట్టేయ‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. మంచు ల‌క్ష్మి ఫీట‌ప్ విత్ స్టార్స్‌ నేరుతో ఓ షోను నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ ప్రోగ్రామ్‌లో పాల్గొన్న శృతీహాస‌న్ ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని బ‌య‌ట‌పెట్టింది.

విస్కీ అంటే త‌న‌కు చాలా ఇష్ట‌మ‌ని, అయితే కొన్ని కార‌ణాల వ‌ల్ల దాన్ని పూర్తిగా మానేశాన‌ని చెప్ప‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది. ఫీట‌ప్ విత్ స్టార్స్‌ రియాలిటీ షోలో పాల్గొన్న శృతీహాస‌న్‌ని నీకు విస్కీ అంటే ఇష్ట‌మ‌ని విన్నాను. కానీ ఇప్పుడు దాన్ని తాగ‌డం మానేశావ‌ని విన్నాను ఎందుకు? అని మంచు ల‌క్ష్మీ ప్ర‌శ్నిస్తేనిజ‌మే నాకు విస్కీ అంటే చాలా ఇష్టం. దాన్ని తాగ‌కూడ‌ద‌ని నిర్ణ‌యం తీసుకున్నాను. ఇది నాలో కొత్త మార్పు. నిజం చెప్పాలంటే నా ఆరోగ్యం బాగాలేదు. దాని నుంచి బ‌య‌ట‌ప‌డ‌టానికి చికిత్స తీసుకున్నాను. అయితే ఆ విష‌యం ఎవ‌రికీ చెప్ప‌లేదు. ప్ర‌స్తుతం నేను కోలుకుంటున్నాను` అని అస‌లు సీక్రెట్ బ‌య‌ట‌పెట్టేసింది.

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ