Home Cinema భార్య ప‌క్క‌నే చిలిపి హీరో మైన‌పు విగ్ర‌హం

భార్య ప‌క్క‌నే చిలిపి హీరో మైన‌పు విగ్ర‌హం

బాలీవుడ్ స్టార్ హీరోల్లో ర‌ణ‌వీర్ సింగ్ స్టైల్ వేరు. అత‌డు ఎక్క‌డ ఉన్నా ఎన‌ర్జీ వ‌చ్చేస్తుంది. త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన శైలి ఉన్న హీరోగా అత‌డు త‌న‌ని తాను నిరూపించుకున్నాడు. ప‌ద్మావ‌త్ ను పెళ్లాడిన ఖిల్జీగానూ అభిమానుల్లో అత‌డికి క్రేజు రెట్టింపైంది.

ప్ర‌స్తుతం ర‌ణ‌వీర్ – దీపిక జంట ఇంట‌ర్నేష‌న‌ల్ ఇండియ‌న్ ఫిలిం అకాడెమీ (ఐఫా)-2019 ఉత్స‌వాల్లో సంద‌డి చేస్తున్నారు. అక్క‌డ గ్రీన్ కార్పెట్ పై భార్యాభ‌ర్త‌ల రొమాన్స్ అదిరిపోయింది. దీపిక వంగ‌పువ్వు రంగు లాంగ్ గౌన్ లో కార్పెట్ పై హొయ‌లు పోయింది. అయితే త‌న పొడ‌వాటి గౌనును సేఫ్ గా ముందుకు తీసుకెళ్లాలంటే ఒక‌రి సాయం అవ‌స‌రం అవుతుంది. ఆ స‌మ‌యంలో ర‌ణ‌వీర్ చొర‌వ తీసుకుని దీపిక గౌనును వెన‌క ఉండి ప‌ట్టుకున్నాడు. అలా ఆ ఇద్ద‌రూ ఒక‌రి వెంట ఒక‌రు న‌డిచారు. ఆ దృశ్యం ఫోటోల రూపంలో క‌న్నుల పండ‌గ చేస్తోంది. వంగ‌పువ్వు రంగు డిజైన‌ర్ డ్రెస్ లో దీపిక న‌వ్వులు చిందిస్తుంటే ఆ వెన‌క‌నే ఉన్న ర‌ణ‌వీర్ పిల‌క‌ముడి బాబాలా స‌రికొత్త‌గా క‌నిపించాడు. ఆ స‌మ‌యంలో ఫోటోగ్రాఫ‌ర్ల‌కు న‌వ్వులు చిందిస్తూ ఫోజిచ్చాడు.

అంతేకాదు.. త‌న భార్యామ‌ణి గొప్ప‌త‌నం గురించి వేదిక‌పై ఆస‌క్తిక‌రంగా మాట్లాడాడు. త‌న భార్య‌కు లండన్ మ్యాడ‌మ్ టుస్సాడ్స్ లో త‌న‌కంటే ముందే ఓ మైన‌పు విగ్ర‌హం ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్బాన్ని అత‌డు ఎంతో జోక్ చేస్తూ వేదిక‌పై చెప్ప‌డం అహూతుల్ని న‌వ్వించింది. మా అత్త అడిగింది న‌న్ను. నువ్వు కూడా బాగా శ్ర‌మించు.. నీక్కూడా విగ్ర‌హం పెడ‌తారు.. అని అంది. మామా  మ‌నం క‌లిసి లండ‌న్ వెళుతున్నాం!  నిన్ను లండ‌న్ లో చూస్తాను అంటూ దీపిక్ తండ్రిని ఉద్ధేశిస్తూ పంచ్ విసిరాడు. లండ‌న్ లో ఉన్న మ్యాడం టుస్సాడ్స్ లో ఉన్న మైన‌పు విగ్ర‌హాల‌న్నిటిలో త‌న భార్య విగ్ర‌హమే సెక్సీగా ఉంటుంద‌ని అన్నాడు. దీపిక ఎంతో పెర్ఫెక్ష‌నిస్టు. ఆ విగ్ర‌హం కోసం చాలానే స‌హ‌క‌రించింద‌ని అన్నాడు. మొత్తానికి ర‌ణ‌వీర్ పొగ‌డ్త‌ల‌కు భార్యామ‌ణి ఆ వేదిక వ‌ద్ద కిసుక్కున న‌వ్వేయ‌డం ఆక‌ట్టుకుంది. ఈ జంట ప్ర‌స్తుతం క‌పిల్ దేవ్ బ‌యోపిక్ 83లో జంట‌గా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.

Bikini Show

Recent Galleries

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ