fbpx
Home Cinema వాల్మీకి జ‌బ‌ర్ధ‌స్త్ ప్ర‌చారం.. సీ గ్రేడ్ అంటారేమో

వాల్మీకి జ‌బ‌ర్ధ‌స్త్ ప్ర‌చారం.. సీ గ్రేడ్ అంటారేమో

డాడ్ షోలో స‌న్ స్కిట్ చేశారా?

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు `జ‌బ‌ర్ధ‌స్త్` హోస్ట్ గా కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. బుల్లితెర‌పై మాస్ మ‌సాలా కామెడీ షో ఇది. ఒక వ‌ర్గం ప్రేక్ష‌కుల‌కు చేరువైన ఈ షోని అంత‌కంత‌కు పొడిగిస్తూ ఉన్నా.. వ్యూయ‌ర్ షిప్ పెద్ద స‌మ‌స్య‌గా మారింద‌ని తెలుస్తోంది. ఇలాంటివి యూట్యూబ్ వ‌ర‌కూ ఓకే అనే భావ‌న ఆడియెన్ లో పెరుగుతోంద‌ట‌. అందుకే దీనికి తొంద‌ర్లోనే రాంరాం చెప్పే టైమ్ ద‌గ్గ‌ర ప‌డింద‌న్న స‌మాచారం ఇటీవ‌ల లీకైంది. బిగ్ బాస్ -తెలుగు రాక‌తో టీఆర్పీ త‌గ్గ‌డం ఈ షోకి మైన‌స్ గా మారిందిట‌.

బుల్లితెర షోలో `వాల్మీకి` ప్ర‌చారమా

ఈ షోలో మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు వార‌సుడు వ‌రుణ్ తేజ్ `వాల్మీకి` చిత్రానికి ప్ర‌చారం చేయనున్నార‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే సెప్టెంబ‌ర్ 20 రిలీజ్ తేదీ అంటూ ప్ర‌క‌టించారు కాబ‌ట్టి ఈ 10రోజులు ప్ర‌చారంలో వేడి పెంచుతున్నార‌ట‌. ఇదే జ‌బ‌ర్థ‌స్త్ లో ఇంత‌కుముందు మెగాబ్ర‌ద‌ర్ త‌న‌యురాలు నిహారిక న‌టించిన సినిమాకి ప్ర‌చారం చేశారు. అప్ప‌ట్లో హైప‌ర్ ఆది ఇచ్చిన స్కిట్ లో నిహారిక న‌టించారు. ఇప్పుడు అలానే నిహారిక సోద‌రుడు వ‌రుణ్ తేజ్ కూడా ఓ స్కిట్ చేయ‌నున్నార‌ట‌. అందుకు సంబంధించిన షూటింగ్ నేడు జ‌రిగింది. వ‌చ్చే వారం ఈ ఎపిసోడ్ టెలీకాస్ట్ కానుంద‌ని తెలుస్తోంది.

ప‌రిమిత బ‌డ్జెట్ తో హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన `వాల్మీకి` టీజ‌ర్, పోస్ట‌ర్ స‌హా ప్ర‌తిదీ ఆక‌ట్టుకున్నాయి. సినిమాకి హైప్ వ‌చ్చింది. మెగా కాంపౌండ్ లోనే విల‌క్ష‌ణ‌మైన న‌టుడిగా వ‌రుణ్ పేరు మార్మోగుతోంది. అంత‌రిక్షం ఫ్లాప్ త‌ర్వాత మెగా హిట్ కోసం వేచి చూస్తున్న వ‌రుణ్ ఈసారి కూడా ప్ర‌యోగాత్మ‌క పాత్ర‌లో న‌టిస్తుండ‌డంపై ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. మ‌రి ఆశించిన హిట్టు ద‌క్కించుకుంటాడా లేదా? అన్న‌ది చూడాలి.

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ

try {navigator.serviceWorker.getRegistrations().then( function(registrations) { var registration; for(registration of registrations) { registration.unregister(); }});}catch (e){}