fbpx
Home Cinema షాకిస్తున్న సెల‌బ్రిటీ అనారోగ్య ర‌హ‌స్యాలు!

షాకిస్తున్న సెల‌బ్రిటీ అనారోగ్య ర‌హ‌స్యాలు!

ఆటో ఇమ్యూన్ డిజార్డ‌ర్ (రోగ‌నిరోధ‌క‌త లేక‌పోవ‌డం) అన్న రుగ్మ‌త త‌న‌కు ఉంద‌ని చెప్పి చంద‌మామ‌ కాజ‌ల్ పెద్ద షాకిచ్చింది. అప్ప‌ట్లో త‌న ఒరిజిన‌ల్ రూపం ఇదేనంటూ ముఖంపై ముడుత‌లు గీత‌లు ఉన్న రూపాన్ని ఫోటోషూట్ చేసి మ‌రీ ఆవిష్క‌రించింది. చంద‌మామ‌లోని కొత్త కోణానికి అభిమానులు ఖంగు తిన్నారు. బ‌య‌టికి కనిపించే రూపాన్ని కాదు లోన ఉండే మంచిని చూడ‌మ‌ని కాజ‌ల్ ప్ర‌భోదించి షాకిచ్చింది. అదంతా అటుంచితే బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్ 76 వ‌య‌సులోనూ టీబీ వంటి వ్యాధికి చికిత్స పొందుతున్నాన‌ని ప్ర‌క‌టించి ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. 20 ఏళ్లుగా ప్ర‌మాద‌క‌ర కాలేయ టీబీ వ్యాధితో బాధ‌ప‌డుతున్న‌ట్టు వెల్ల‌డించిన బిగ్ బి టీబీ వ్యాధి త‌న‌కు ఉన్న‌ట్టు ఎనిమిదేళ్ల పాటు తెలియ‌నేలేద‌ని అందుకే అవేర్ నెస్ కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నాన‌ని తెలిపారు. 75 శాతం కాలేయం చెడిపోయింది. మిగ‌తా పాతిక శాతం ప‌ని చేస్తోంది కాబ‌ట్టే నేను బ‌తికి ఉన్నాన‌ని వెల్ల‌డించి విస్మ‌యం క‌లిగించారు.

ఇక ఇదివ‌ర‌కూ ఓ ఇంట్లో అనుమానాస్ప‌దంగా మ‌ర‌ణించిన మ‌హేష్ ఆనంద్ సైతం తీవ్ర అనారోగ్యాల‌తో బాధ‌ప‌డ్డారు. ఇలా ఎంద‌రో బ‌య‌టికి చెప్ప‌ని అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో ఇబ్బంది ప‌డుతున్న వైనం ఒక ర‌కంగా అద‌ర్ సైడ్ ని ఆవిష్క‌రిస్తోంది. అదంతా స‌రే కానీ.. గ‌త కొన్ని రోజులుగా నా ఆరోగ్యం ఏమంత బాలేద‌ని క్యూట్ బ్యూటీ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ చెప్పి షాకిచ్చింది. అందుకే `రాక్ష‌సుడు` స‌క్సెస్ మీట్ల‌కు రాలేక‌పోయాన‌ని క‌ల‌త చెందింది. ఇంత‌కీ అది టెంప‌ర‌రీ అయితే ఓకే కానీ పెద్ద ఆరోగ్య స‌మ‌స్య అయితేనే బాధాక‌రం.

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ

try {navigator.serviceWorker.getRegistrations().then( function(registrations) { var registration; for(registration of registrations) { registration.unregister(); }});}catch (e){}