Home Cinema శిలువ విషయమై...మాధవన్‌ ఇలాంటి రిప్లై ఇస్తారని ఊహించం

శిలువ విషయమై…మాధవన్‌ ఇలాంటి రిప్లై ఇస్తారని ఊహించం

శిలువ వివాద విషయమై…మాధవన్‌ సమాధానం ఇదీ

సోషల్ మీడియాలో సెలబ్రెటీలను విమర్శించటమే కొందరు పనిగా పెట్టుకున్నారు. వాళ్లను డీగ్రేడ్ చేయటం ద్వారా ఆనందం అనుభవిస్తూంటారు. అయితే చాలా మంది వాటిని లైట్ తీసుకుంటారు. అయితే మాధవన్ లాంటి మాత్రం సీరియస్ గానే కౌంటర్ ఇస్తారు. తాజాగా సోషల్ మీడియా నుంచి ప్రముఖ నటుడు మాధవన్‌కు చేదు అనుభవం ఎదురైంది. అయితే మాధవన్‌ చక్కటి రిప్లై ఇచ్చి, అందరి చేతా శభాష్ అనిపించుకున్నారు.

వివరాల్లోకి వెళితే.. మాధవన్‌ తన ఇన్‌స్టాలో రాఖీ పండగ సందర్భంగా దిగిన ఓ ఫొటోను షేర్‌ చేశారు. అందులో మాధవన్‌ తండ్రితో పాటు, కుమారుడు కూడా ఉన్నారు. అయితే ఆ ఫొటోకు సంబంధించి ఓ నెటిజన్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విటర్‌లో మాధవన్‌పై విమర్శలు గుప్పించారు. ఆవిమర్శలపైన స్పందించిన మాధవన్‌ నెటిజన్‌కు గట్టి కౌంటర్‌ ఇచ్చారు. ఆమె ఆలోచన విధానం ఎంతో తప్పో చిన్న ఊదాహరణ ద్వారా వివరించారు. అలాగే తన మనసులోని భావాలను నిర్భయంగా వ్యక్తికరించి సదురు నెటిజన్‌ చెంప చెళ్లుమనిపించేలా చేశాడు.

వివరాల్లోకి వెళితే.. మాధవన్‌ షేర్‌ చేసిన ఫొటోలో అతని వెనకభాగంలో శిలువ ఉండటాన్ని గుర్తించి.. ఓ నెటిజన్‌ అతనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ‘శిలువ అక్కడ ఎందుకుంది?.. అది పూజ గదేనా? మీపై నాకున్న గౌరవాన్ని పోగొట్టుకున్నారు. చర్చిల్లో ఎప్పుడైనా హిందు దేవుళ్ల ఫొటోలు చూశారా?. మీరు ఈ రోజు ఏదైతే చేశారో అదంతా ఫేక్‌’ అని సదరు నెటిజన్‌ పేర్కొన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై మాధవన్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాను ప్రతి మతాన్ని గౌరవిస్తానని తెలిపారు. నేను ఏ మతంలోనైనా శాంతిని చూస్తానని అన్నారు.

‘మీలాంటి వారి నుంచి గౌరవం కోల్పోయినందుకు నాకు ఎలాంటి బాధ లేదు. మీరు త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నాను. అనారోగ్యంతో ఉన్న మీరు అక్కడే ఉన్న గోల్డెన్‌ టెంపుల్‌ ఫొటోను గుర్తించకపోవడం చూసి ఆశ్చర్యమేసింది. గోల్డెన్‌ టెంపుల్‌ ఫొటో ఉంది కాబట్టి నేను సిక్కిజమ్‌ను స్వీకరించినట్టేనా?. నేను దర్గాలను, అలాగే ప్రపంచంలోని చాలా ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించాను. ఆయా సందర్భాల్లో కొన్ని వస్తువులు బహుమతిగా వచ్చినవి. మరికొన్ని కొని తెచ్చుకున్నవి. మా ఇంట్లో అన్ని విశ్వాసాలను గౌరవిస్తారు. అన్ని మతాల వారికి మా ఇంట్లోకి ప్రవేశం ఉంది.

నేను నా చిన్నతనం నుంచి గర్వంగా బతకడంతో పాటు ప్రతి ఒక్కరికి, మతానికి, నమ్మకానికి గౌరవం ఇవ్వడం నేర్చుకున్నాను. ప్రతి మతం నాకు చెందిందిగానే భావిస్తాను. నా కుమారుడు కూడా అలాగే భావిస్తాడని నమ్ముతాను. నాకు సమీపంలో వెళ్లడానికి దేవాలయం లేనప్పుడూ.. దర్గాకు కానీ, గురుద్వార్‌, చర్చికి వెళ్లడం అదృష్టంగా భావిస్తాను. నేను ఒక హిందూ అని తెలిసి అక్కడి వారు కూడా నన్ను గౌరవిస్తార’ని పేర్కొన్నారు. దాంతో మాధవన్‌ సదరు నెటిజన్‌కు ఇచ్చిన సమాధానంపై పలువురు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Recent Posts

సిట్ ఏర్పాటుపై తెలుగు దేశం గుండెల్లో పరిగెత్తుతున్న రైళ్లు 

ప్రతివారం మొక్కు తీర్చుకుంటున్నట్లే ఈ వారం కూడా తన బాధ ప్రపంచం బాధ అన్నట్లు రోతపలుకుల రాధాకృష్ణ  "రాజు కక్షకు రాజ్యం బలి" అనే మకుటం కింద   వలవల ఏడుస్తూ మనలను కూడా...

అసైన్డ్ భూముల సేకరణ వైసిపికి మెడ మీద కత్తే!

ఉగాది నాటికి 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని అందుకు అవసరమైన భూముల సేకరించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం జిల్లా కలెక్టర్లు ఇతర రెవిన్యూ సిబ్బంది...

అయిదు ఏళ్ల పాలనపై సిట్! నెవెర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్!

రాష్ట్ర విభజన తర్వాత అయిదు ఏళ్ల కాలంలో టిడిపి ప్రభుత్వం సాగించిన పరిపాలన పై మొత్తంగా విచారణకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. బహుశా దేశంలోనే ఈలాంటి విచారణ ఇంతకు...

ఎత్తుకు పై ఎత్తుల్లో తెలుగు దేశం చిత్తు

చంద్రబాబు నాయుడు ప్రాపకం ఏ మాత్రం లేకుండా తుడిచి పెట్టే ఎత్తులో మూడు రాజధానుల ప్రతిపాదన ముఖ్యమంత్రి తెరమీదకు తెచ్చారు. అయితే రాజధాని రైతుల ఆందోళన దానికి రాష్ట్రంలోని అన్ని పార్టీలు మద్దతు...

నిన్న సుక్కు .. నేడు వంశీ పైడిప‌ల్లి?

మ‌హేష్ క్రేజీ డైరెక్ట‌ర్‌ల‌తో ఆడుకుంటున్నాడా?.. త‌న‌కు న‌చ్చలేద‌ని ఇష్టం వ‌చ్చిన‌ట్టు డైరెక్ట‌ర్‌ల‌ని మార్చేస్తున్నాడా? అంటే జ‌రుగుతున్న ప‌రిణామాల్ని చూసిన ఇండ‌స్ట్రీ జ‌నాలు నిజ‌మే అంటున్నారు. `మ‌హ‌ర్షి` త‌రువాత మైత్రీలో మ‌హేష్ హీరోగా కొత్త...

త‌రుణ్‌భాస్క‌ర్ ఇలా షాకిచ్చాడేంటి?

టాలీవుడ్‌కు రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ని హీరోగా అందించిన త‌రుణ్ భాస్క‌ర్ ద‌ర్శ‌కుడిగా సినిమా చేసి దాదాపు రెండేళ్ల‌వుతోంది. `మీకు మాత్ర‌మే చెప్తా` అంటూ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఎలా హ‌డావిడిగా ఈ...

తేజ బర్త్‌డేకు డ‌బుల్ ధ‌మాకా ఇచ్చాడు!

కెరీర్ తొలి నాళ్ల‌లో ద‌ర్శ‌కుడిగా సంచ‌ల‌నం సృష్టించిన తేజ జోరు ఇటీవ‌ల బాగా త‌గ్గిపోయింది. వ‌రుస ఫ్లాపులు.. నిర్మాత‌ల‌తో వివాదాలు.. ఇక సినిమాలు ఆపేయాలేమో అనే స‌మ‌యంలోనే రానాతో `నేనే రాజు నేనే...

`భీష్మ‌` ఓపెనింగ్ అదిరింది!

నితిన్ న‌టించిన తాజా చిత్రం `భీష్మ‌`. టీజ‌ర్ రిలీజ్ నుంచే ఈ సినిమాపై పాజిటివ్ టాక్ మొద‌లైంది. తొలి రోజు తొలి షో నుంచి హిట్ టాక్ రావ‌డంతో సినిమా బ్లాక్‌బ‌స్ట‌ర్ అని...

ఫ్లాప్ డైరెక్ట‌ర్‌తో రామ్‌చ‌ర‌ణ్ ప్ర‌యోగం!

సినిమా ఇండ‌స్ట్రీలో హిట్ మాత్ర‌నమే మాట్లాడుతుంది. ఏదైనా చేస్తుంది. ఎంత వ‌ర‌కైనా తీసుకెళుతుంది. అడ‌గ‌ని అంద‌లం ఎక్కిస్తుంది. అదే ఒక్క ఫ్లాప్ ప‌డిందా అదఃపాతాళానికి తొక్కేస్తుంది. దీన్ఇన బ‌ట్టే ఇక్క‌డ క‌థ‌లు, కాంబినేష‌న్‌లు,...

తెలుగోడా – ఆపక్కనుంటావా? – ఈ పక్కనుంటావా?

"విశ్వసనీయత కోల్పోతున్న మీడియా, దిగజారుతున్న విలువలు," అని ఒక ఆంగ్ల పత్రికలో వ్యాసం. "రాజధాని గుండె పగిలింది" అంటూ ఒక తెలుగు పత్రికలో ప్రత్యేక కథనం. "రాజధాని అక్రమాలపై సిట్" అంటూ మరో...

Featured Posts

సిట్ ఏర్పాటుపై తెలుగు దేశం గుండెల్లో పరిగెత్తుతున్న రైళ్లు 

ప్రతివారం మొక్కు తీర్చుకుంటున్నట్లే ఈ వారం కూడా తన బాధ ప్రపంచం బాధ అన్నట్లు రోతపలుకుల రాధాకృష్ణ  "రాజు కక్షకు రాజ్యం బలి" అనే మకుటం కింద   వలవల ఏడుస్తూ మనలను కూడా...

అయిదు ఏళ్ల పాలనపై సిట్! నెవెర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్!

రాష్ట్ర విభజన తర్వాత అయిదు ఏళ్ల కాలంలో టిడిపి ప్రభుత్వం సాగించిన పరిపాలన పై మొత్తంగా విచారణకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. బహుశా దేశంలోనే ఈలాంటి విచారణ ఇంతకు...

ఎత్తుకు పై ఎత్తుల్లో తెలుగు దేశం చిత్తు

చంద్రబాబు నాయుడు ప్రాపకం ఏ మాత్రం లేకుండా తుడిచి పెట్టే ఎత్తులో మూడు రాజధానుల ప్రతిపాదన ముఖ్యమంత్రి తెరమీదకు తెచ్చారు. అయితే రాజధాని రైతుల ఆందోళన దానికి రాష్ట్రంలోని అన్ని పార్టీలు మద్దతు...