fbpx
Home Cinema సెంటిమెంటు పంచ్‌.. RRR నిర్మాత‌ల్లో టెన్ష‌న్ టెన్ష‌న్

సెంటిమెంటు పంచ్‌.. RRR నిర్మాత‌ల్లో టెన్ష‌న్ టెన్ష‌న్

గ్లామ‌ర్ ప‌రిశ్ర‌మ‌లో అదంతే

సెంటిమెంటు ప‌రిశ్ర‌మ‌లో కొన్ని ఇంతే. భారీ బ‌డ్జెట్లు కుమ్మ‌రించే ప‌రిశ్ర‌మ‌లో ప్ర‌తిదీ సెంటిమెంటుతో ముడిప‌డి ఉంటుంది. వ‌ర్జ్యం, పూజ్యం, శ‌కునం.. అంటూ ఎవ‌రి లెక్క‌లు వాళ్ల‌కు ఉంటాయి ఇక్క‌డ‌. ఒక భారీ బ‌డ్జెట్ సినిమా ఫ్లాపైంది అంటే దాని వెన‌క ఏదైనా బ‌ల‌మైన సెంటిమెంట్ ప‌ని చేసిందా? అంటూ విశ్లేషిస్తారు. ఇప్పుడు అదే త‌ర‌హాలో చూస్తోంది ఆర్.ఆర్.ఆర్ అభిమాన ప్ర‌పంచం.

ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీగా చెప్పుకున్న `సాహో` డిజాస్ట‌ర్ అంటూ టాక్ ఒక్క‌సారిగా విస్తుపోయేలా చేస్తోంది. విమ‌ర్శ‌కులు ఈ సినిమాపై పెద‌వి విరిచేయ‌డం తీవ్రంగా నిరాశ‌ప‌రుస్తోంది. అటు బాలీవుడ్ క్రిటిక్ త‌ర‌ణ్ ఆద‌ర్శ్ సైతం అంత భారీ బ‌డ్జెట్ ని ఒక కొత్త ద‌ర్శ‌కుడిని న‌మ్మి పెడ‌తారా? భ‌రించ‌లేని సినిమా తీశారు.. చాలా డ‌బ్బును వృధా చేశారు! అంటూ విమ‌ర్శించారు. ఉత్త‌రాది క్రిటిక్స్ ఇంతే అని తీసిపారేసినా.. ఇటు టాలీవుడ్ క్రిటిక్స్ నుంచి ఇంచుమించు అదే స్పంద‌న వినిపిస్తోంది. క‌న్ఫ్యూజన్.. గంద‌ర‌గోళంగా సినిమాని తీశారు అంటూ ప్ర‌తి ఒక్క‌రూ సాహో స్క్రీన్ ప్లేపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ అభిమానుల్లోనూ..

అయితే ఈ నెగెటివ్ టాక్‌ని సెంటిమెంటు ప‌రిశ్ర‌మ వేరొక కోణంలో విశ్లేషిస్తోంది. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్న ఏ హీరో ఇప్ప‌టివ‌ర‌కూ ఆ వెంట‌నే బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టింది లేదు. చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్, ప్ర‌భాస్, నాని, నితిన్, ర‌వితేజ‌, సునీల్ ఇలా ఎంద‌రికో ఈ అనుభ‌వం ఉంది. ఇప్పుడు మ‌రోసారి ప్ర‌భాస్ విష‌యంలో అది ప్రూవైంద‌ని విశ్లేషిస్తున్నారు. అన్న‌ట్టు రాజ‌మౌళినే తీసిన‌ బాహుబ‌లి ఘ‌న‌విజ‌యం త‌ర్వాత ఆర్.ఆర్.ఆర్ స‌న్నివేశ‌మేంటి? అన్న ఆందోళ‌న అప్పుడే చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ అభిమానుల్లో మొద‌లైంద‌ట‌. సామాజిక మాధ్య‌మాల్లో RRR స్టార్స్ ఫ్యాన్స్ లో ప్ర‌స్తుతం దీనిపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. `సాహో` ప్ర‌తికూల ఫ‌లితం ఫ్యాన్స్ ని ఏదో తెలియ‌ని ఆందోళ‌న‌కు గురి చేస్తోంద‌ట‌. దీంతో ఆర్.ఆర్.ఆర్ నిర్మాత‌ల్లోనూ అదే టెన్ష‌న్ నెల‌కొంద‌ని చెబుతున్నారు.

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ