fbpx
Home Cinema తెలుగు క‌ల్చ‌ర్‌కు బిగ్‌బాస్ తెగులు

తెలుగు క‌ల్చ‌ర్‌కు బిగ్‌బాస్ తెగులు

సంప్ర‌దాయాన్ని కిల్ చేస్తున్న బిగ్‌బాస్‌!

బిగ్‌బాస్‌.. పాశ్చాత్య‌ వెకిలి టాస్క్‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా మారింది. ప్రైజ్ మనీ పేరుతో 16 మందిని ఒకే ఇంట్లో బందించి చిత్ర విచిత్ర‌మైన టాస్క్‌ల‌తో వంద రోజుల పాటు ప్ర‌పంచంతో సంబంధం లేకుండా వారి జీవితాల్లోని విలువైన స‌మ‌యాన్నివృధా చేస్తూ.. బిగ్‌బాస్ పేరుతో ఆడుకోవ‌డం ఓ వింత అన్న చ‌ర్చ సాగుతోంది. తెలుగులో బిగ్‌బాస్ సీన్ 1, సీజ‌న్ 2 మాస్ కి చేరువైనా సాంప్ర‌దాయ వాదుల నుంచి విమ‌ర్శ‌లు మాత్రం త‌ప్ప‌లేదు. త‌మిళ‌నాట అయితే కోర్టు కేసుల వ‌ర‌కూ వెళ్లింది. ఇక తెలుగులో సీజ‌న్‌-3కి వ‌చ్చే స‌రికి బిగ్‌బాస్ పిచ్చి ప‌రాకాష్ట‌కు చేరింది. వినోదం కాస్తా అగ్లీగా మారింద‌న్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. 16 మంది కంటెస్టెంట్‌ల‌తో ఈ సీజ‌న్‌ని మొద‌లుపెట్టినా త‌మ‌న్నా లాంటి ట్రాన్స్ జెండ‌ర్ ఎంట్రీతో బిగ్‌బాస్ కాస్త గాడి త‌ప్పింది. అర్థం ప‌ర్థం లేని టాస్క్‌ల‌తో హౌస్‌లో వున్న వాళ్ల‌తో పాటు బిగ్‌బాస్‌ని చూస్తున్న వారి స‌హానాన్ని కూడా ప‌రీక్షిస్తోంది.  

త‌న‌తో పాటు హౌస్‌లో పాల్గొన్న కంటెస్టెంట్‌ల‌ని బూతులు తిడుతూ ట్రాన్స్ జెండ‌ర్ త‌మ‌న్నా బిగ్‌బాస్ గాడి త‌ప్పింద‌నే సంకేతాల్ని అందించింది. ఆ త‌రువాత కూడా చిత్ర విచిత్ర‌మైన టాస్క్ ల‌తో బిగ్‌బాస్ ప్ర‌తీ ఎపిసోడ్‌ని గాడి త‌ప్పించ‌డం ప‌రాకాష్ట‌కు చేరింది. బ్ర‌తికి వున్న వాళ్ల పొటోల‌ని నిప్పుల్లో వేసి వారిని నామినేట్ చేయ‌డం, ఇంట్లో దెయ్యం నాకేం భ‌య్యం వంటి సిల్లీ టాస్క్‌ల‌తో కంటెస్టెంట్‌ల స‌హ‌నాన్ని ప‌రీక్షించ‌డం వంటి వైప‌రిత్యాల‌తో బిగ్‌బాస్ సీజ‌న్ 3 మొత్తానికి గాడి త‌ప్పింది. తెలుగు సంప్ర‌దాయం అంటే ఖోఖో, క‌బాడీ, తొక్కుడు బిల్లా.. ఆడ‌పిల్ల‌లంతా కోతికొమ్మ‌చ్చి, అష్టాచ‌మ్మా, రంగ‌వ‌ళ్లులు వంటి ఆట‌లుండేవి. కానీ బిగ్ బాస్ మాత్రం చిత్ర విచిత్ర‌మైన టాస్క్‌ల‌తో, సైకిక్ గేమ్‌ల‌తో తెలుగింటి సంప్ర‌దాయ‌న్ని మంట గ‌లిపేస్తోంద‌న్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తుత‌న్నాయి. 

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ

try {navigator.serviceWorker.getRegistrations().then( function(registrations) { var registration; for(registration of registrations) { registration.unregister(); }});}catch (e){}