fbpx
Home Cinema సూర్య సినిమాకు కాపీ రైట్ వివాదం

సూర్య సినిమాకు కాపీ రైట్ వివాదం

సూర్య బందోబ‌స్త్‌(త‌మిళంలో కాప్పాన్‌) సినిమాతో సెప్టెంబ‌ర్ 20న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ సినిమా క‌థ త‌న‌దంటూ చెన్నై క్రోమ్ పేట‌కు చెందిన జాన్ చార్లెస్ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. సినిమా విడుద‌ల చేయ‌కుండా ఆపాల‌ని ఆయ‌న త‌న పిటిష‌న్‌లో పేర్కొన్నారు. 10 సంవత్స‌రాల నుండి సినిమా రంగంలో ప‌నిచేస్తున్నాన‌ని, తాను స‌ర‌వెడి పేరుతో రాసుకున్నక‌థ‌ను డైరెక్ట‌ర్ కె.ఎస్‌.ర‌వికుమార్‌, కె.వి.ఆనంద్‌ల‌కు చెప్పాన‌ని తెలిపారు. కె.వి .ఆనంద్ క‌థ విని న‌చ్చింద‌ని త‌న‌కు అవ‌కాశం క‌ల్పిస్తాన‌న్నార‌ని, కానీ త‌న క‌థ‌తోనే బందోబ‌స్త్‌(కాప్పాన్) నిర్మించార‌ని తెలిసి షాక‌య్యానని జాన్ చార్లెస్ తెలిపారు. కాబ‌ట్టి బందోబ‌స్త్‌ చిత్రాన్ని విడుద‌ల చేయ‌కుండా నిషేధం విధించాల‌ని కోర్టును కోరారు. పిటీష‌న్‌ను ప‌రిశీలించిన న్యాయ‌మూర్తులు కేసును సెప్టెంబ‌ర్ 4కి వాయిదా వేశారు

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ