Home Cinema `సైరా` కోసం సూప‌స్టార్లను దించుతున్నారు!

`సైరా` కోసం సూప‌స్టార్లను దించుతున్నారు!

రామ్‌చ‌ర‌ణ్ ప్లానింగ్ మామూలుగా లేదుగా!

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రం `సైరా న‌ర‌సింహారెడ్డి`. సురేంద‌ర్‌రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి బిగ్‌బీ అమితాబ్‌తో పాన్ ఇండియ‌న్ మూవీ లుక్‌ని తీసుకొచ్చారు. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ నిర్మిస్తున్న ఈ సినిమా కోసం మెగా ఫ్యామిలీ రేయింబ‌వ‌ళ్లు శ్ర‌మిస్తోంది. చిరు కోరిక‌ని నెర‌వేర్చ‌డం కోసం కుటుంబ స‌భ్యులంతా అలుప‌న్న‌దే లేకుండా ప‌నిచేస్తున్నారు. చివ‌రికి కొణిదెల ఇంటి కోడ‌లు కూడా త‌న వంతు బాధ్య‌త‌ని నెర‌వేరుస్తూ `సైరా`కు ప్ర‌చారం చేస్తున్నారు. టీజ‌ర్ రిలీజ్ నుంచి ఈ సినిమా కోసం చిరు, డైరెక్ట‌ర్ సురేంద‌ర్‌రెడ్డి ప్రాణం పెట్టి ప‌నిచేస్తున్నారు.

ఈ రోజు రిలీజ్ చేసిన `సైరా` మేకింగ్ వీడియో సినిమా క్వాలిటీని రివీల్ చేసింది. ఈ చిత్రాన్ని మెగా ఫ్యామిలీ ఏ రేంజ్‌లో రాజీకి రాకుండా నిర్మించిందో, అక్టోబ‌ర్ 2న ఈ సినిమాతో ఎలాంటి ఐఫీస్ట్‌ని అందించ‌బోతోందో అర్థ‌మైంది. దేశ వ్యాప్తంగా అటెన్ష‌న్ క్రియేట్ చేసిన ఈ సినిమా ప‌బ్లిసిటీని కూడా అదే స్థాయిలో మెగా హీరో రామ్‌చ‌ర‌ణ్ ప్లాన్ చేస్తున్నారు. తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ఇప్ప‌టి వ‌ర‌కు త‌మిళ ట్రైల‌ర్ ని రిలీజ్ చేయ‌లేదు. దీని కోసం రామ్‌చ‌ర‌ణ్ భారీ స్కెచ్‌నే సిద్ధం చేసిన‌ట్లు తెలుస్తోంది.

త‌మిళంలో మైలేజ్ కోసం మ‌క్క‌ల్ సెల్వ‌న్‌గా పేరు తెచ్చుకున్న విజ‌య్ సేతుప‌తిని ఓ కీల‌క పాత్ర కోసం తీసుకున్నారు. ఇక అక్క‌డ మార్కెట్‌, సినిమాపై క్రేజ్ ఏర్ప‌డాలంటే త‌మిళ చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన క్రేజీ స్టార్ హీరో ఈ చిత్ర ప్ర‌చారానికి శ్రీ‌కారం చుట్టాలి. ఇదే ఆలోచ‌న‌తో త‌మిళ సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌ని రంగంలోకి దించ‌బోతున్నారు. ఇప్ప‌టికే రామ్‌చ‌ర‌ణ్ సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీతో చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్లు తెలుస్తోంది. త‌మిళ ట్రైల‌ర్ రిలీజ్‌కి డేట్ లాక్ చేసిన రామ్‌చ‌ర‌ణ్ త‌లైవా ర‌జ‌నీ నుంచి పిలుపు రాగానే భారీగా చెన్నైలో ఫంక్ష‌న్ ఏర్పాటు చేయ‌డానికి ఏర్పాట్లు చేస్తున్న‌ట్టు కోలీవుడ్ న్యూస్‌.

Bikini Show

Recent Galleries

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ