fbpx
Home Cinema స్టార్ డైరెక్ట‌ర్ గెట‌ప్ ఛేంజ్‌.. టాప్ సీక్రెట్ లీక్

స్టార్ డైరెక్ట‌ర్ గెట‌ప్ ఛేంజ్‌.. టాప్ సీక్రెట్ లీక్

స్టార్ డైరెక్ట‌ర్ గెట‌ప్ ఛేంజ్‌.. గుట్టంతా లీక్

టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ వీవీ వినాయ‌క్ కి ఏమైంది? ఉన్న‌ట్టుండి ఆయ‌న గెట‌ప్ మార్చారు. రోజూ రెండు గంట‌లు జిమ్ముల్లో క‌స‌ర‌త్తులు చేస్తూ చెమ‌టోడుస్తున్నారు?  పైగా క్రాఫ్(త‌ల‌క‌ట్టు) మార్చారు. అంతగా ఎందుకీ ప్ర‌య‌త్నం? అస‌లేం జ‌రుగుతోంది? ఫ‌్యాన్స్ లో ఇటీవ‌ల ఆస‌క్తిక‌ర చ‌ర్చ ఇది. సోష‌ల్ మీడియాలో దీనిపై పెద్ద డిబేట్ న‌డుస్తోంది.

అయితే అన్ని ప్ర‌శ్న‌ల‌కు తాజాగా స‌మాధానం దొరికింది. అక్టోబ‌ర్ 9న వీవీ వినాయక్‌ పుట్టినరోజు. అదే రోజున ఆయన కథానాయకుడిగా పరిచయం కానున్న చిత్రం పూజా కార్యక్రమాలతో మొదలు కానుంది.  బ‌ర్త్ డే వేళా వివేషం విజయదశమి పండుగ ఘడియలు కూడా కలిసి వస్తుండటంతో కొబ్బరికాయ కొట్టి లాంఛ‌నంగా పూజా కార్య‌క్ర‌మాలు చేయ‌నున్నార‌ని తెలుస్తోంది.

ఈ సినిమాకి ఇప్ప‌టికే ద‌ర్శ‌కుడు ఫిక్స్ అయ్యాడు. సౌత్ స్టార్ డైరెక్ట‌ర్ శంకర్‌ శిష్యుడు ఎన్‌. నరసింహారావు దర్శకత్వం వహించనున్నార‌ని తెలుస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప‌తాకంపై దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాన్నారు. ఎలానూ వినాయ‌క్ హీరో అవుతున్నారు. హీరో అవ్వ‌డం అంటే.. ఆషామాషీ వ్య‌వ‌హార‌మా? అందుకే  హీరోయిక్ లుక్ కోసం వీవీ వినాయక్‌ జిమ్‌లో చెమటలు చిందిస్తున్నారు. ఇప్ప‌టికే చాలావ‌ర‌కూ బ‌రువు త‌గ్గారు. ఇంకా త‌గ్గుతున్నార‌ట‌. క్రాఫ్ మారింది అంటే.. అదంతా పాత్ర‌కు త‌గ్గ‌ట్టు మార్పు అని తెలిసింది. 1980 నేపథ్యంలో ఆద్యంతం ర‌క్తి క‌ట్టించే ఆస‌క్తిక‌ర క‌థ‌తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నారు. వినాయక్‌ వయసుకు తగ్గట్టు పాత్రను తీర్చిదిద్దార‌ని తెలుస్తోంది. 

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ