fbpx
Home Cinema కే.ఎల్ రాహుల్‌తో స్టార్ డాట‌ర్ డీప్ ల‌వ్

కే.ఎల్ రాహుల్‌తో స్టార్ డాట‌ర్ డీప్ ల‌వ్

ఎఫైర్ ప్రూఫ్ దొరికిందిలే

టీమిండియా యువ‌క్రికెట‌ర్ కేఎల్ రాహుల్ .. స్టార్ హీరో సునీల్ శెట్టి కుమార్తె ఆతియా శెట్టితో ప్రేమ‌లో ఉన్నాడా? అత‌గాడితో ఆతియా ఎఫైర్ సాగిస్తోందా? అంటే అవున‌నే తాజా స‌న్నివేశం చెబుతోంది. ఇప్ప‌టికే ఈ ఇద్ద‌రూ ఓ పార్టీలో చీర్స్ చేస్తున్న ఫోటోలు వెబ్ లో వైర‌ల్ అయ్యాయి.

తాజాగా అతియా త‌నకు స‌న్నిహితుడు అయిన నిర్మాత విక్ర‌మ్ ఫ‌డ్నిస్ తో సాగించిన ఇన్‌స్టా సంభాష‌ణ వేడెక్కిస్తోంది. “ట్ర‌స్ట్ ది టైమింగ్ ఆఫ్ యువ‌ర్ లైఫ్..“ అంటూ అతియా చేసిన వ్యాఖ్య‌కు స్పందించిన విక్ర‌మ్ ఫ‌డ్నిస్ “ఈ మ‌ధ్య మ‌రీ ఎక్కువ ఎగ్జ‌యిటింగ్ గా హైప‌ర్ గా క‌నిపిస్తున్నావ్… లెట్స్ గో టు కేఎల్‌??? కౌలాలంపూర్????“ అంటూ కామెంట్ చేశారు. “ఎస్.. కేఎల్‌ని బ్లాక్ చేసే స‌మ‌యం వ‌చ్చింది“ అంటూ ఆతియా కంటిన్యూ చేయ‌డం.. “కేఎల్ సంగ‌తిని అంపైర్ కి ఫిర్యాదు చేస్తాను… అత‌డి వికెట్ ప‌డిన‌ట్ట‌యితే“ అంటూ అత‌డు స‌ర‌దాగా త‌న‌తో మాట క‌ల‌ప‌డం చ‌ర్చ‌కొచ్చింది. ఆతియా శెట్టి నిజంగానే కేఎల్ తో డీప్ ల‌వ్ లో ఉందా? ఇలా అయితే స్టార్ హీరో సునీల్ శెట్టి ఈ జంట‌ను ఆశీర్వ‌దించేందుకు సిద్ధ‌మ‌వుతున్నారా? అన్న‌ది కాస్త ఆగితే కానీ క‌న్ఫామ్ గా చెప్ప‌లేం. అతియా ఇప్ప‌టికే బాలీవుడ్‌లో రెండు సినిమాల్లో న‌టించింది. క‌థానాయిక‌గా కెరీర్ అంతంత మాత్ర‌మే. ఆ క్ర‌మంలోనే లైఫ్‌లో సెటిల‌వ్వాల‌నుకుంటుందా? అన్న‌ది చూడాలి.

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ