fbpx
Home Cinema పాల పిట్ట పాటకు సితార ... అదిరిపోయే డాన్స్

పాల పిట్ట పాటకు సితార … అదిరిపోయే డాన్స్

పాల పిట్ట పాటకు సితార … అదిరిపోయే డాన్స్

మహేష్ బాబు , నమ్రత ల ముద్దుల కుమార్తె సితార ఏది చేసినా ఇప్పుడు వైరల్ గా మారుతూనే వుంది . చిన్న వీడియో లు , టాక్ షో చేయడంలో సితార బీజీ గా ఉంటుంది . తండ్రి మహేష్ బాబు అంటే సీతారాకు ఎంత ఇష్టమో , అలాగే తండ్రి చేసే డాన్సులు అన్నా కూడా ఎంతో అభిమానిస్తోంది . అప్పుడప్పుడు తన ముసుకు నచ్చిన పాటలకు డాన్స్ చేసి తల్లి తండ్రులని కాదు సోషల్ మీడియాకు కూడా ఊపేస్తూ ఉంటుంది . ఇప్పుడు తాజాగా సితార చేసిన నృత్యం ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసేసింది .

మహేష్ బాబు నటించిన “మహర్షి ” సినిమాలోని … ఏవో గుస గుసలే … నాలో వలసి విడిసి … వలపే విరిసే ఎదలో ” అంటూ సాగే ఈ పాట యువతరానికి ఎంతో నచ్చింది . పాల పిట్టలో వలపు … నీ పైట మెట్టుపై వాలిందే … పూల బుట్టలో మెరుపు నీ కట్టు పట్టులో దూరిందే అంటూ సితార చేసిన నృత్యం అమోఘం . తన తండ్రి మహేష్ బాబు జిమ్ లో ఈ పాటను డాన్స్ చేసింది . మహేష్ , నమ్రతకు ఈ పాట విపరీతంగా నచ్చింది . అంతే దీన్ని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు .
లైక్ లు … కామెంట్స్ … అదిరిపోయే రెస్పాన్స్ … సితార నా మజాకా !

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ