fbpx
Home Cinema ప్ర‌భాస్‌కి అలా హ్యండిచ్చేసిందిగా?

ప్ర‌భాస్‌కి అలా హ్యండిచ్చేసిందిగా?

అమ్మ దొంగా.. అందుకే షాకిచ్చిందా

స‌క్సెస్, ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా చిత్ర సీమ‌లో అవ‌కాశాలు పొంద‌డం అనేది చాలా అరుదు. అది కొంత మంది విష‌యంలోనే జ‌రుగుతుంది. అలా వారికి అవ‌కాశాలు ఎందుకు వ‌స్తున్నాయో ఎవ‌రికీ అర్థం కాదు కూడా. అలా హిట్టు- ఫ్లాప్‌ల‌తో సంబంధం లేకుండా వ‌రుస క్రేజీ ఆఫర్ల‌ని సొంతం చేసుకుంటోంది ముంబై సోయ‌గం పూజా హెగ్డే. నాజూకు సోకుల గాలంతో హీటెక్కించేస్తున్న పూజా హెగ్డే తాజాగా వ‌రుణ్ తేజ్ స‌ర‌స‌న‌ `వాల్మీకి` చిత్రంలో న‌టిస్తోంది. ఇందులో శ్రీ‌దేవి పాత్ర‌లో హోయ‌లొలికించ‌బోతోంది. దీనితో పాటు అల్లు అర్జున్‌, త్రివిక్ర‌మ్‌ల క‌ల‌యిక‌లో వ‌స్తున్న `అల వైకుంఠ‌పుర‌ములో`నూ నాయిక‌గా న‌టిస్తోంది.

జాన్ ఎందుకీ ఆల‌స్యం?

ఈ రెండిటి కంటే ముందే ప్ర‌భాస్ చిత్రానికి అంగీక‌రించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇంత‌లోనే డార్లింగ్ కి ఈ అమ్మ‌డు బిగ్ షాక్ ఇచ్చింద‌ట‌. `సాహో` చిత్రీక‌ర‌ణ త‌రువాత రిలాక్స్ మోడ్‌లోకి వెళ్లిపోయిన ప్ర‌భాస్ వెయిట్ త‌గ్గించుకునే ప‌నిలో ప‌డ్డాడు. దీంతో `జిల్‌` ఫేమ్ రాధాకృష్ణ రూపొందిస్తున్న `జాన్‌` చిత్రీక‌ర‌ణ అంత‌కంత‌కు ఆల‌స్య‌మ‌వుతోంది. దీంతో ఈ సినిమాకు కేటాయించిన పూజా హెగ్డే ఆ డేట్స్‌ని అఖిల్‌, బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ చిత్రానికి కేటాయించేసింది. ఈ సినిమా కోసం ముందు అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, ర‌ష్మిక మంద‌న్న‌, సాయి ప‌ల్ల‌విల‌ని ప‌రిశీలించిన చిత్ర బృందం చివ‌రికి పూజా హెగ్డేని ఫైన‌ల్ చేశారు. ఈ మూవీ పూర్త‌యితే కానీ ప్ర‌భాస్ సినిమాకు డేట్స్ కేటాయించే అవ‌కాశం లేదనేది తాజా స‌మాచారం. దీంతో అఖిల్ కోసం ప్ర‌భాస్‌కు పూజా హ్యాండిచ్చేసిన‌ట్టేన‌ని ఫిల్మ్ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోంది.

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ