fbpx
Home Cinema హీరో గారి డూప్లెక్స్ ఖ‌రీదు 56కోట్లు

హీరో గారి డూప్లెక్స్ ఖ‌రీదు 56కోట్లు

సీ-వ్యూ లేక‌పోతే డూప్లెక్స్ కొనుక్కోడా?

బాలీవుడ్ స్టార్ హీరోల సంపాదన గురించి ప్ర‌త్యేకంగా చెప్పాలా? స‌ల్మాన్ ఖాన్‌ – అమీర్ ఖాన్- షారూక్ ఖాన్ – అక్ష‌య్ కుమార్.. వీళ్లంతా సొంతంగా సినిమాలు నిర్మిస్తూ భారీ పారితోషికాలు ఆర్జిస్తూ ప్ర‌పంచ ధ‌న‌వంతుల జాబితాలో చేరిన సంగ‌తి తెలిసిందే. వంద‌ల వేల‌కోట్ల సామ్రాజ్యాధిప‌తులుగా రాజ్య‌మేలుతున్నారు. ఆ త‌ర్వాతి జ‌న‌రేష‌న్ లో కొంద‌రు హీరోలు పెద్ద స్టార్లుగా ఎదిగేస్తున్నారు.

అయితే ఆ స్థాయి కాదు కానీ.. ఆ త‌ర్వాతి జ‌న‌రేష‌న్ లో షాహిద్ క‌పూర్ బాగానే సంపాదిస్తున్నాడు. ఇటీవ‌లే కబీర్ సింగ్ చిత్రంతో బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం అందుకున్నాడు. 300 కోట్ల క్ల‌బ్ హీరోగా రికార్డుల‌కెక్కాడు. ఇక ఇదే ఉత్సాహంలో అత‌డు ముంబై వ‌ర్లీ ప్రాంతంలో స‌ముద్ర‌పు ఫేసింగ్ ఉండేలా ఓ ఖ‌రీదైన డూప్లెక్స్ ఇంటిని కొనుక్కున్నాడ‌ట‌. 42-43 అంత‌స్తులో 8,626 చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణం ఉన్న ఈ ఇంటి కోసం అత‌డు ఏకంగా బిల్డ‌ర్ కి 56 కోట్లు చెల్లిస్తున్నాడ‌ట‌. ఇక స‌ముద్ర‌పు ముఖంగా ఉండే ఈ ఇంటి ముందు విశాలంగా ఖాళీ వ‌రండా ఉంద‌ట‌. ప్ర‌ఖ్యాత‌ రిట్స్ క‌ర్ల్ ట‌న్ స్థిరాస్తి కంపెనీ దీనిని నిర్మించింది. భార్య మీరా రాజ్ పుత్ తో క‌లిసి ఈ ఇంట్లోకి దిగాల‌న్న కొత్త కాపురం పెట్టాల‌న్నా ఇప్పుడే కుద‌ర‌దు. ఇంకా ఇది నిర్మాణంలో ఉంది కాబ‌ట్టి కొంత స‌మ‌యం ప‌డుతుంద‌ట‌.

Bikini Show

Recent Galleries

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ